సియోల్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ సంక్రమణకు సంబంధించిన పలు సర్వేలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ బయట వారి నుంచే వ్యాపిస్తుందన్న వాదన ఎక్కువగా ఉండేది. కానీ, తాజాగా సౌత్‌కొరియా ఎపిడిమాలజిస్టులు చేసిన సర్వేలో మాత్రం కరోనా వైరస్ బయటి వ్యక్తుల కంటే కుటుంబ సభ్యుల నుంచి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సర్వేలో 5,706మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు పాల్గొనగా, పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 59,000 మందిపై సర్వే చేశారు.
అయితే 100మంది సన్నిహితులలో కేవలం ఇదరు వ్యక్తులకు మాత్రమే బయటి వారి నుంచి వైరస్ సంక్రమించినట్లు తెలిపారు. కాగా వైరస్ సంక్రమించిన పది మంది సన్నిహితులలో ఒకరు సొంత కుటుంబం నుంచి వైరస్ బారిన పడ్డారని సర్వే వివరించింది. అయితే వ్యాధి సంక్రమించిన వారితో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలవాలనుకుంటే అన్ని నియమాలు పాటించాలని సౌత్‌కొరియన్ వ్యాధి నియంత్రణ డైరెక్టర్ కియాంగ్ తెలిపారు. కాగా పెద్ద వారితో పోలిస్తే చిన్నపిల్లలో వైరస్ లక్షణాలు అంతగా కనిపించడం లేదని తెలిపింది. అయితే చిన్న పిల్లల్లో వైరస్ లక్షణాలు లేవనడానికి తమ వద్ద ఆధారాలు లేవని సర్వే అధికారి చో పేర్కొన్నారు. (చదవండి: వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం)
Comments
Please login to add a commentAdd a comment