
సాక్షి, న్యూ ఢిల్లీ : 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై జరిగిన తీవ్రవాదుల దాడిలో అమరులైన వారికి వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ గురువారం తీవ్రవాదుల దాడిలో అమరులైన వారి సంస్మరణార్థం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు అమరులకు ఘనంగా నివాళులర్పించి, అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున తీవ్రవాదులు పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. వీరిని నిలువరించే ప్రయంత్నంలో పలువురు భద్రతా సిబ్బంది సైతం తమ ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment