
టెంకాయలు కొడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సుండుపల్లి : ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆరోగ్యం బాగుండాలని కోరుతూ మండలంలోని భైరాగిగుట్ట సమీపంలో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు హకీంసాహెబ్, వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, మండల కోఆప్షన్‌మెంబర్ ఇర్ఫాన్, యువనాయకులు చింటూ, బాబురెడ్డి, సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, ఆనందరెడ్డి, రఘురెడ్డి, నాగేశ్వర్, ఎస్సీ మండల కన్వీనర్ చిన్నప్ప, ఎస్సీ నాయకులు మారయ్య, నాగేశ్వర్, మాజీ ఎంపీటీసీ చంద్రానాయక్, విద్యార్థిసంఘ నాయకుడు బాబురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment