న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలు, రామ మందిరం నిర్మాణం, కావేరీ నది జలాల విషయంలో ఆందోళనలు చేశారు. గురువారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. 17 ఏళ్ల కింద పార్లమెంటులో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి రాజ్యసభ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ వెంటనే కావేరీ జలాల సమస్యపై అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చా రు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని ఎంత కోరినా వారు. వినిపించు కోలేదు. సభా కార్యకలాపాలను సజావుగా సాగని వ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘పార్లమెంటును కాపాడేం దుకు 9 మంది ప్రాణత్యాగం చేశారు. ఇలా చేశారంటే మన వ్యవస్థ గురించి తప్పుడు సమాచారం వెళు తుంది’అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో తప్పని పరిస్థితు ల్లో శుక్రవారానికి చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు.
లోక్‌సభలోనూ ఇదే స్థితి..
లోక్‌సభ ప్రారంభం కాగానే 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులర్పించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో రెండుసార్లు సభను వాయిదావేశారు. కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ఆందోళనలను విరమించుకోకపోవడంతో జీరో అవర్ సమయంలో స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేసింది. రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని శివసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. ‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన అంశమైన హిందూత్వాన్ని ఆ పార్టీ మరిచిపోయింది’ అని పార్టీ నేత అడ్సల్ అన్నారు.
మూడో రోజూ సేమ్ సీన్
Published Fri, Dec 14 2018 4:38 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment