
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట విభజన అనైతికం అనే వ్యాఖ్యలు వెంటనే వాపసు తీసుకోని, వివరన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మోదీ స్పీచ్ 2019 ఎన్నికల స్పీచ్‌లా ఉందని ఎద్దేవా చేశారు.
దేశంలో ఉన్న అనేక సమస్యలు, 2014లో మోదీ ఇచ్చిన హామీ అంశాలు ప్రస్తావించలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్ గురించి మోదీ మాట్లడం మరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయాలు చేస్తారన్నారు. నిజాలను పార్లమెంట్ వేదికగా ప్రజలముందు ఉంచిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు, కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment