న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఈ నెల 20 నుంచి జూలై 26 వరకు నిర్వహించనున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ ప్రకటనలో వెల్లడించారు. ఇక లోక్‌సభ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 19వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment