
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ చాలీసాను తాము కోరుకోవడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశమైంది. పార్టీ ఎంపీలు హాజరయ్యారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ప్రభుత్వం ఆ పని చేయలేదని, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్‌ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆక్షేపించారు.
ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్‌సైట్లకు కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment