Special meetings
-
పార్లమెంట్లో ‘మోదీ చాలీసా’ వద్దు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ చాలీసాను తాము కోరుకోవడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశమైంది. పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ప్రభుత్వం ఆ పని చేయలేదని, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆక్షేపించారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
5న ఇండియా ఎంపీలతో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 5న ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ రాజాజీమార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడి చేయలేదు. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. -
దాహం తీర్చేదెలా?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: వేసవి ప్రారంభానికి ముందే జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు ముదరక ముందే ఈ పరిస్థితులు నెలకొంటే, మండు వేసవిలో నీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. జిల్లాలో ఏయే గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది.. ఎద్దడి తీవ్రంగా ఉన్న నివాసిత ప్రాంతాలు.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడే ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎండలు ముదిరితే పని చేయకుండా పోయే తాగునీటి పథకాల గుర్తింపు, బోర్లు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఎన్ని గ్రా మాల్లో ఉంటుంది.. తదితర వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళికను రూపొందించాక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా, ఆలస్యమైంది. ఇప్పటి కే తాగునీటి సమ స్య ప్రారంభమైన ఈ తరుణంలో ప్రణాళికలు రూపకల్పన దశలో ఉండటం.. వాటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పం పడం.. ఈ ప్రతిపాదనలను పరిశీలన.. నిధుల మంజూరు.. పనుల ప్రారంభం వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. మండల సమావేశాలు.. వేసవి కార్యాచరణ ప్రణాళికను రూ పొందించేందుకు అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డి.రమేశ్ ఈ నెల 10న అన్ని మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లతో చర్చించి నీటి ఎద్దడి నెలకొనే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. వీలైతే గ్రిడ్ నుంచే.. గ్రామీణ నీటిపారుదల శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 860 నివాసిత ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గ్రిడ్ పరిధిలోకి రాగా, మరో 785 నివాసిత ప్రాంతాలు సింగూరు గ్రిడ్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వాటర్ గ్రిడ్ ద్వారా ఈ వేసవిలోనే తాగునీటిని సరఫరా చేయడానికి వీలున్న నివాసిత ప్రాంతాలను గుర్తిస్తామని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీర్ రమేశ్ ‘సాక్షి’తో పేర్కొన్నా రు. ఆయా ప్రాంతాలకు గ్రిడ్ ద్వారానే నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గ్రిడ్ పనులు కొన్ని గ్రామాల్లో చివరి దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. -
కోలుకున్న స్టాక్ మార్కెట్..
లాభాలు-నష్టాలు-లాభాలు సెన్సెక్స్ 291 పాయింట్లు అప్ నిఫ్టీకి 72 పాయింట్లు లాభం సోమవారం భారీ పతనం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. జీఎస్టీ, ఇతర కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 26,032 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 7,881 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,190 పాయింట్లు క్షీణించింది. షార్ట్ కవరింగ్ చోటు చేసుకోవడం, రూపాయి బలపడడం(55 పైసలు పెరిగి 66.10 వద్ద ముగిసింది), యూరోపియన్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ పుంజుకోవడం వంటి అంశాలూ ప్రభావం చూపాయి. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంక్, లోహ, చమురు, గ్యాస్, పీఎస్‌యూ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభపడ్డాయి. తీవ్రంగా ఒడిదుడుకులు: సెన్సెక్స్ లాభాల్లో మొదలై, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల బాట పట్టింది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇంట్రాడేలో 383 పాయింట్లు లాభపడింది. ఒక దశలో 444 పాయింట్లు నష్టపోయింది. చైనా షాంఘై స్టాక్ సూచీ 7.6 శాతం పతనమవడం ప్రభావం చూపింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో మొత్తం 827 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,805 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.27,646 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,93,405 కోట్లుగా నమోదైంది. కాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు 3 నుంచి 5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ అక్కడక్కడే!: బీఓఎఫ్ఏ భారత స్టాక్ మార్కెట్ సమీప భవిష్యత్తులో అక్కడక్కడే కదలాడుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ) మంగళవారం తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం దీనికి కారణాలని తాజా నివేదికలో పేర్కొంది. రూ.1.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.1.5 లక్షల కోట్లు పెరిగింది. సోమవారం సెన్సెక్స్ 1,625 పాయింట్ల పతనంతో రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే. మంగళవారం ట్రేడింగ్ ముగిసిన తరవాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,51,311 కోట్లకు చేరింది. ఈ మార్కెట్ క్యాప్ సోమవారం 95.29 లక్షల కోట్లకు తగ్గింది. ఆల్‌టైమ్ హైకి అమరరాజా బ్యాటరీస్ అమర రాజా బ్యాటరీస్ బీఎస్ఈలో 15% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,132ను తాకింది. కేవలం ఒక్క నెలలోనే ఈ షేర్ 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జూలై 27న రూ.844గా ఉన్న ఈ షేర్ మంగళవారం 9.5 శాతం లాభంతో రూ.1,078 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం, బ్యాటరీల తయారీలో ఉపయోగించే సీసం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో షేర్ ధర జోరుగా పెరుగుతోందని నిపుణులంటున్నారు. -
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల సమావేశాలు
న్యూజెండ్ల: ఫ్యాక్షన్ తగాదాలకు దూరంగా ఉండాలంటూ, అలాంటి కేసుల్లో చిక్కుకుంటే ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరిస్తూ గుంటూరు జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. న్యూజెండ్ల మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో జిల్లా పోలీసులు సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. న్యూజెండ్ల, కంభంపాడు, పమిడిపాడులో సీఐ టి.శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్‌చరణ్ గ్రామస్తులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఫ్యాక్షన్ అంశాలు, నేరాలు, సంఘ వ్యతిరేక పనులపై తక్షణమే తమకు సమాచారం అందించాలని ఫోన్ నంబర్లు ఇచ్చారు. నేరాల అదుపులో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
ప్రైవేటు స్కూల్స్‌పై వాణిజ్య శాఖ నజర్!
పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలపై ఆరా అమ్మకం పన్ను ఎగవేయకుండా చర్యలు {పైవేటు యాజమాన్యాలతో సమావేశం సెప్టెంబర్‌లోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు విద్యా సంస్ధలపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ప్రైవేటు స్కూల్స్ ప్రతి యేట విద్యా సంవత్సరం ప్రారంభంలో తమ స్టాల్స్ ద్వారా కోట్లాది రూపాయల విలువ గల పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ తదితర అమ్మకాలు సాగిస్తూ వ్యాట్ చెల్లించకపోవడాన్ని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. గ్రేటర్లో సుమారు నాలుగు వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికి కనీసం వ్యాట్ పన్ను చెల్లించక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా 2015-16 విద్యా సంవత్సరం అమ్మకాలపై ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మహానగరంలోని ఏడు ఉప వాణిజ్య పన్నుల శాఖల పరిధిలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, స్టాల్స్ ద్వారా జరిగే అమ్మకాలపై వ్యాట్ చెల్లించే విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠశాలలకు నమూనా పత్రంతో కూడిన సర్కులర్ కూడా జారీ చేసింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు స్టాల్స్ ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను నిర్దేశిత నమూనా పత్రంలో సమగ్రంగా పూరించి సెప్టెంబర్‌లోగా సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. పూర్తి వివరాలకు సర్కిల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు స్కూల్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి బలవంతపు అమ్మకాలు సాగించ వ ద్దని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.