ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల సమావేశాలు | police conducted special meetings in faction effected villages | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల సమావేశాలు

Published Mon, Aug 17 2015 3:04 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

police conducted special meetings in faction effected villages

న్యూజెండ్ల: ఫ్యాక్షన్ తగాదాలకు దూరంగా ఉండాలంటూ, అలాంటి కేసుల్లో చిక్కుకుంటే ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరిస్తూ గుంటూరు జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. న్యూజెండ్ల మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో జిల్లా పోలీసులు సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

న్యూజెండ్ల, కంభంపాడు, పమిడిపాడులో సీఐ టి.శ్రీనివాసులు, ఎస్‌ఐ విజయ్‌చరణ్ గ్రామస్తులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఫ్యాక్షన్ అంశాలు, నేరాలు, సంఘ వ్యతిరేక పనులపై తక్షణమే తమకు సమాచారం అందించాలని ఫోన్ నంబర్లు ఇచ్చారు. నేరాల అదుపులో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement