న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 5న ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ రాజాజీమార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడి చేయలేదు. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment