పార్లమెంట్‌లో ఎంపీలు ఆంగ్లంలో మాట్లాడకుండా నిషేధం విధించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇటావా: పార్లమెంట్‌లో ఎంపీలు ఆంగ్లంలో మాట్లాడకుండా నిషేధం విధించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటావా హిందీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు వారి మాతృభాష అభివృద్ధికి కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో హిందీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.