పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
Published Thu, Jul 21 2016 12:17 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
నాగర్‌కర్నూల్‌రూరల్: బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యదర్శి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఇంటిని ముట్టడించి ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆ సమితి రాష్ట్ర కార్యదర్శి వంగూరి జయశంకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు కేంద్రానికి సూచించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని, సంపూర్ణ మెజార్టీతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి బుసిరెడ్డి సుబ్బారెడ్డి టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఇచ్చిన వినతిపతాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి అందజేస్తానన్నారు. కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు పానుగంటి మనోహర్, తాలుకా అధ్యక్షుడు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము నాగరాజు, శ్రీనివాసులు, Üురేందర్, దుర్గాప్రసాద్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement