t mrps
-
చైర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం అంబేద్కర్ చౌరస్తాలో టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వంగూరి జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించడం స్వాగతిస్తున్నామని, అయితే ప్రకటించి ఏడాదిన్నర గడిచినా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నేటికీ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఎన్నిక చేయించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో మాదిగలే అధిక శాతంగా ఉన్నారని మార్కెట్ కమిటీ చైర్మన్‌ను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల పక్షాల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర భగవంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, కలమూరి కృష్ణ, గిద్ద రాము, శ్రీను, నాగరాజు, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రేణయ్య, సురేందర్, మన్యం, వీరస్వామి, చింతలయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు -
పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని టీ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యదర్శి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఇంటిని ముట్టడించి ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆ సమితి రాష్ట్ర కార్యదర్శి వంగూరి జయశంకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు కేంద్రానికి సూచించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని, సంపూర్ణ మెజార్టీతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి బుసిరెడ్డి సుబ్బారెడ్డి టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఇచ్చిన వినతిపతాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి అందజేస్తానన్నారు. కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు పానుగంటి మనోహర్, తాలుకా అధ్యక్షుడు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము నాగరాజు, శ్రీనివాసులు, Üురేందర్, దుర్గాప్రసాద్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.