చైర్మన్‌ పదవి మాదిగలకే ఇవ్వాలి | give the chairmen post for sc candidates | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ పదవి మాదిగలకే ఇవ్వాలి

Jul 22 2016 1:08 AM | Updated on Sep 15 2018 2:43 PM

నాగర్‌కర్నూల్‌రూరల్‌: నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని మాదిగలకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అంబేద్కర్‌ చౌరస్తాలో టీ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌రూరల్‌: నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని మాదిగలకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అంబేద్కర్‌ చౌరస్తాలో టీ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వంగూరి జయశంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఎస్సీలకు కేటాయించడం స్వాగతిస్తున్నామని, అయితే ప్రకటించి ఏడాదిన్నర గడిచినా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నేటికీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను ఎన్నిక చేయించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో మాదిగలే అధిక శాతంగా ఉన్నారని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను మాదిగలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అఖిల పక్షాల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఎర్ర భగవంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, కలమూరి కృష్ణ, గిద్ద రాము, శ్రీను, నాగరాజు, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రేణయ్య, సురేందర్, మన్యం, వీరస్వామి, చింతలయ్య, లక్ష్మయ్య  పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement