chairmen
-
RC Bhargava: భవిష్యత్ భారత్‌దే
న్యూఢిల్లీ: భవిష్యత్ వృద్ధికి సంబంధించి మిగతా దేశాలన్నింటితో పోలిస్తే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. భారత్ ముందుకు సాగాలంటే కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు, విధానాలను వదిలించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు.. వృద్ధి సాధన గురించి ఇథమిత్థంగా అంచనా వేయలేని నిర్దిష్ట స్థాయికి చేరాయని భార్గవ చెప్పారు. అక్కడి ప్రజలు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నప్పటికీ పని చేయాలన్న స్ఫూర్తి తగ్గిందని ఆయన తెలిపారు. మరోవైపు, మన వారు తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును కూడా గణనీయంగా మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. ఇదే కసి భారత్‌ను ముందుకు తీసుకెడుతోందని ఆయన వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ మనం కాలం చెల్లిన విధానాలన్నింటినీ వదిలించుకోవాల్సి ఉందన్నారు. ఇక, తమ సంస్థ ముందు నుంచి పొదుపుగా వ్యవహరిస్తూ వస్తోందని, అందుకే వ్యాపార విస్తరణ కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అంతర్గత నిధులనే వినియోగించుకుంటున్నామని భార్గవ చెప్పారు. చిన్న పట్టణాల్లో నెక్సా సరీ్వస్ మారుతీ సుజుకీ చిన్న పట్టణాల్లో సరీ్వస్ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంపాక్ట్ నెక్సా సరీ్వస్ వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్సహా హర్యానా, పశి్చమ బెంగాల్, గుజరాత్, తమిళనాడులో మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2025 మార్చి నాటి కి దేశవ్యాప్తంగా ఇటువంటి 100 వర్క్‌షాప్స్‌ను నెలకొల్పాలన్నది లక్ష్యమని మారుతీ సుజుకీ ఇండి యా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా జరుగుతున్న మొత్తం కార్ల విక్రయాల్లో నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల వాటా 30 శాతం ఉందని చెప్పారు. -
ఫ్యూచర్ రిటైల్ చైర్మన్‌గా బియానీ రాజీనామా
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ చైర్మన్, డైరెక్టరు పదవులకు కిశోర్ బియానీ రాజీనామా చేశారు. ‘దురదృష్టకరమైన వ్యాపార పరిస్థితుల ఫలితంగా‘ సంస్థ సీఐఆర్‌పీని ఎదుర్కొనాల్సి వస్తోందంటూ పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) పంపిన రాజీనామా లేఖలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కంపెనీపై అభిరుచితో తాను సంస్థ వృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డానని, కానీ ప్రస్తుత వాస్తవ పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి వస్తోందని బియానీ పేర్కొన్నారు. కంపెనీని ఆర్పీ తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను తప్పుకున్నప్పటికీ రుణదాతలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. భారత్‌లో ఆధునిక రిటైల్ కు ఆద్యుడిగా బియానీ పేరొందారు. బిగ్ బజార్, ఈజీడే, ఫుడ్‌హాల్ వంటి బ్రాండ్స్ కింద ఒక దశలో 430 నగరాల్లో 1,500 అవుట్‌లెట్స్‌ను ఎఫ్ఆర్ఎల్ నిర్వహించింది. అయితే, రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో కంపెనీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ వేసింది. -
పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి : వాసిరెడ్డి పద్మ
-
ఏపీ: జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్ సభ్యుల పదవులకూ శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదీ సామాజిక న్యాయమంటే.. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే.. ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. ►కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. ►ఇలా జనరల్, జనరల్ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. ►మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు. ►అంతేకాక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి.. వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్దపీట వేశారు. ►ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. ‘జనరల్’లో బీసీలకు అవకాశం ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు రిజర్వు చేస్తే.. బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. -
బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల
తాడేపల్లి: బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పం అని అన్నారు. నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. ఇక మంత్రి వేణు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈనెల 30న బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి వేణు అన్నారు. మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ బీసీలకు గౌరవం కల్పించారు. బీసీకి చెందిన నన్ను డిప్యూటీ సీఎం చేయడమే నిదర్శనం’’ అని అన్నారు. చదవండి: చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే.. విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల -
టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. రెండు నెలలుగా అవి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిస్థితి. గతేడాది డిసెంబర్లో కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు ఇద్దరు సభ్యులు సి.విఠల్, చంద్రావతి పదవీకాలం పూర్తయింది. దీంతో మిగిలిన ఇద్దరు సభ్యులు కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగుతున్నారు. వీరిలో ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. తాజాగా కృష్ణారెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీలో కేవలం ఒక్కరు మాత్రమే మెంబర్‌గా కొనసాగనున్నారు. ఒక్క సభ్యుడితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొనసాగింపు అనేది మున్ముందు అయోమయంగా మారనుంది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలభర్తీకి సన్నద్ధమవుతున్న వేళ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది. కోరం ఉంటేనే నోటిఫికేషన్లు... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఇద్దరుసభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్చార్జి చైర్మన్‌గా ఉండగా, మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖలవారీగా అంచనాలపై ఆర్థికశాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా... అందులో అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాలలో చేరిపోయారు. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. -
కుంభకోణం సెగ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!
కౌలాలంపూర్ : మలేషియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినీతి, లంచాల ఆరోపణలపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో సంస్థ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తాత్కాలికంగా పదవినుంచి తప్పుకున్నారు. ఫెర్నాండెజ్‌తో పాటు, విమానయాన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కమారుద్దీన్ మెరానున్ కూడా పదవినుంచి వైదొలగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందనీ, రెండు నెలల కాలానికి లేదా కంపెనీ సరిపోతుందని భావించే సమయానికి వారు ఎగ్జిక్యూటివ్ పదవులకు దూరంగా ఉంటారని ఎయిర్ ఏషియా ప్రకటనలో తెలిపింది. అలాగు గ్రూపు ప్రెసిడెంట్ కనకలింగంను తాత్కాలిక సీఈవోగా నియమించింది. అనుమానాస్పద లంచాలు, అవినీతిపై బహిరంగ దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నామని ఎయిర్‌బస్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ఏషియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యంతర సీఈవో కనకలింగం యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 180 విమానాల కొనుగోలు, ఎయిర్ ఏషియాఎక్స్ క్రీడా జట్టుకు స్పాన్సర్‌షిప్‌గా ఎయిర్‌బస్ నుండి సుమారు 50 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై మలేషియా అవినీతి నిరోధక కమిషన్(ఎంఏసీసీ) తెలిపింది. దేశానికి వెలుపల ఎక్కడైనా పౌరులు లేదా శాశ్వత నివాసితులు చేసిన అవినీతి చర్యలపై దర్యాప్తు చేసే అధికారం ఉందని శనివారం ప్రకటించింది. ఎయిర్ బస్-ఎయిర్ ఏషియా వివాదంలో యూకే అధికారులతో సంప్రదింపులతోపాటు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని ఎంఏసీసీ చీఫ్ కమిషనర్ లతీఫా కోయా చెప్పారు. మరోవైపు యూరోపియన్ తయారీదారుతో చర్చలు జరపడానికి మధ్యవర్తులను ఎప్పుడూ ఉపయోగించలేదని ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారించేందుకు కంపెనీ బోర్డు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సలహాదారులుగా, ఫెర్నాండెజ్, మెరానున్కు బోర్డులో కార్యనిర్వాహక అధికారం ఉండదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. తాముగానీ, సీఈవో ఫెర్నాండెజ్, మెరానున్గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్ ఏషియా మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ షేర్లు పడిపోయాయి. కాగా పౌర, సైనిక ఒప్పందాలను పొందటానికి ఎయిర్ ఏషియా కంపెనీ మధ్యవర్తులను ఉపయోగించిందన్న ఆరోపణలపై బ్రిటీష్ మోసపూరిత నిరోధక సంస్థ ఎస్ఎఫ్వో (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్) 2016 లో దర్యాప్తు ప్రారంభించింది. -
ప్రజా పోరాటాలకు..కాంగ్రెస్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దీనిపై ప్రజా పోరాటాలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ అవినీతిపై పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించాలనే నిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి ఆధారాల సేకరణకు వీలుగా ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా 26 మందితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, విజయశాంతి, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అమీర్ జావేద్‌లను సభ్యులుగా నియమించారు. అవినీతిపై మెమోరాండం రూపంలో రాష్ట్రపతి, గవర్నర్, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తుంది. -
చైర్మన్, ఎండీ గిరీ వేర్వేరు!
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఓ కంపెనీకి చైర్మన్, ఎండీగా ఒక్కరే బాధ్యతలు నిర్వహించేందుకు వీలుంది. కానీ, సెబీ ప్యానెల్ సిఫారసులు అమలు చేస్తే ఇక ముందు ఈ అవకాశం ఉండకపోవచ్చు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఎండీ బాధ్యతలు చేపట్టలేరు. కార్పొరేట్ గవర్నెన్స్ (నిర్వహణ) నిబంధనల్లో భారీ సంస్కరణలకు వీలు కల్పించేలా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సెబీ ఈ ప్యానెల్ సిఫారసులు చేయడం విశేషం. చైర్మన్ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకే పరిమితం చేయాలని ప్యానెల్ సూచించింది. అలాగే, కనీసం ఒక మహిళను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని కూడా సిఫారసు చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చైర్మన్, ఎండీ పోస్టుల విభజనకు దారితీయనుంది. ఇక ఓ కంపెనీ బోర్డు సభ్యుల సంఖ్య ఆరుకు పెంచాలని, ఓ ఏడాదిలో బోర్డు కనీసం ఐదు సార్లు సమావేశాలు నిర్వహించాలన్న సిఫారసులు కూడా ఉన్నాయి. ఓ మహిళ బోర్డులో ఉండాలన్న నిబంధన ఇప్పటికే ఉంది. అయితే, ఇండిపెండెండ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీటిలో ఏ రూపంలో అయినా నియమించుకునే వెసులుబాటు ఉంది. తాజా సిఫారసు ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉంచటం తప్పనిసరి కానుంది. టాటా గ్రూపు, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఇటీవలి కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సెబీ ప్యానెల్ తాజా సిఫారసులకు ప్రాధాన్యం ఏర్పడింది. -
చైర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం అంబేద్కర్ చౌరస్తాలో టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వంగూరి జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించడం స్వాగతిస్తున్నామని, అయితే ప్రకటించి ఏడాదిన్నర గడిచినా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నేటికీ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఎన్నిక చేయించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో మాదిగలే అధిక శాతంగా ఉన్నారని మార్కెట్ కమిటీ చైర్మన్‌ను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల పక్షాల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్ర భగవంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, కలమూరి కృష్ణ, గిద్ద రాము, శ్రీను, నాగరాజు, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రేణయ్య, సురేందర్, మన్యం, వీరస్వామి, చింతలయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు -
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. చిలుకూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించనున్న ఈ 18వ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సదస్సు సందర్భంగా సిలబస్, పరీక్ష విధానం, నూతన సాంకేతిక పద్దతులపై చర్చతో పాటు టీ హబ్‌లో ఐటీ కంపెనీలతో సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమీక్ష ఉంటుందని చక్రపాణి వెల్లడించారు. యూపీఎస్సీ చైర్మన్‌తో పాటు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు హాజరవుతున్న ఈ సదస్సు గవర్నర్ ప్రసంగంతో ముగియనున్నట్లు తెలిపారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయభాస్కర్
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా జేఎన్టీయూకే ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ నియమితులయ్యారు. గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన్ను వీసీగా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి దక్కింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ మంచి ఇంజనీర్లను తయారుచేసి భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దానని, ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎంతోకాలంగా నిరుద్యోగులు కలలుకంటున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనను చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఙతలు తెలిపారు. ఉదయభాస్కర్‌ను వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్, రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు తదితరులు అభినందించారు.