
పార్లమెంట్ రద్దుకు ప్రధాని కార్నీ సిఫార్సు
ఒట్టావా: కెనడాలో ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 28న ముందస్తు పోలింగ్ జరపనున్నట్లు ఆదివారం కెనడా ప్రధానమంత్రి కార్నీ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం.
జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగడంతో రెండు వారాల క్రితమే కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆదివారం ఆయన గవర్నర్ జనరల్‌తో భేటీ అయి పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార లిబరల్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కార్నీ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment