సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులో లేవని కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. భౌగోళికంగా అనుకూలతలు లేని మారుమూల ప్రాంతాల్లో, అక్కడక్కడ విసిరేసినట్లు ఉండి, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనువుగా లేని కారణంగానే మొబైల్ ఫోన్ సర్వీస్ లను విస్తరించలేకపోయినట్లు మంత్రి చెప్పారు.
వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా టెలికమ్ సరీ్వసు ప్రొవైడర్లతో కలిసి ఆయా గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా 346 మొబైల్ టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో 8,963 గ్రామాలు ఉండగా అందులో 5,967 గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ ఫోన్ సర్వీసులను అందిస్తోందని వివరించారు.
25 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే
విద్యా హక్కు చట్టం (ఆరీ్టఈ) కింద ప్రతి విద్యా సంస్థలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం 25 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసి తీరాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిషాంక్ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, విద్యా సంస్థలపై పాలనా నియంత్రణ రాష్ట్రాల చేతుల్లో ఉందని చెప్పారు. 6–14 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ 2009లో ఆర్టీఈ చట్టం వచి్చందని అన్నారు. ఆర్టీఈ చట్టం అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి విద్యా సంస్థ బలహీన వర్గాల పిల్లలకు విధిగా అడ్మిషన్ కలి్పంచాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో ఆర్టీఈ చట్టం అమలు జరుతున్న తీరుపై మధింపు చేయవలసిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 2016లోనే కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పారు.
యూజీసీ–ఏఐసీటీఈ విలీనంపై నిర్ణయం తీసుకోలేదు
యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (యూజీసీ) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) విలీనంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
జాతీయ పర్యావరణ విధానం రూపొందించాలి
కాలుష్య నివారణకు అనేక పరిష్కారాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలేదని, ఇవి అమలయ్యేందుకు వీలుగా జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని సమగ్రంగా ఎదుర్కొన్న జపాన్, చైనా వంటి దేశాల ఉదంతాలను పరిశీలించాలని సూచించారు.
కనుచూపు స్థాయిలోనే డ్రోన్లు ఎగరాలి..
దేశంలో పౌరుల డ్రోన్ల వినియోగం కనుచూపు స్థాయి వరకే పరిమితమని, ఆ మేరకు పౌర విమానశాఖ డైరెక్టర్ జనరల్ నిబంధనలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి పేర్కొన్నారు. డ్రోన్ల విచ్చలవిడి వినియోగాన్ని నియంత్రిస్తూనే, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణపరమైన చర్యలకు వినియోగంపై జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ కోటగిరి, బెల్లాన చంద్రశేఖర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.
నర్సీపట్నం–తుని రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చండి
అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపే ప్రధాన రాష్ట్ర రహదారి అయిన నర్సీపట్నం–తుని (42కి.మీ) రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చాల్సిందిగా ఎంపీ వెంకట సత్యవతి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది మండలాలకు చెందిన ప్రజలు తుని రైల్వే స్టేషన్‌కు ఇదే రహదారిలో ప్రయాణిస్తారని, అలాగే గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంటారని వివరించారు.
ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలియజేయండి
నెల్లూరు(సెంట్రల్): ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలపాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి గురువారం లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ ఎయిరిండియాలో వాటా విక్రయ నిర్ణయం గతంలోనే జరిగిందన్నారు. 2018 మార్చి 28న ఈ మేరకు బిడ్లను కూడా ఆహా్వనించారని గుర్తు చేశారు. గత ఏడాది మే 31 వరకు ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎయిరిండియాకు రూ.58,222.92 కోట్ల అప్పు ఉందని తెలిపారు. విమాన ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు విమాన తయారీ సంస్థల సూచనల మేరకు విమానాలకు అన్ని పరీక్షలు నిర్వహించి నడుపుతున్నట్లు మంత్రి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment