మాడ్రిడ్: మేటి యూరోపియన్ క్లబ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో లివర్‌పూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం మాడ్రిడ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో లివర్‌పూల్ (ఇంగ్లండ్) 2–0 గోల్స్ తేడాతో టోటెన్‌హామ్ హాట్‌స్పర్ క్లబ్ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. లివర్‌పూల్ తరఫున మొహమ్మద్ సలా (2వ నిమిషంలో), డివోక్ ఒరిగి (87వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన లివర్‌పూల్ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 147 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడం లివర్‌పూల్‌కిది ఆరోసారి. గతంలో ఆ జట్టు 1977, 1978, 1981, 1984, 2005లలో విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment