యూరప్‌ మహా సామ్రాజ్ఞి! | European stocks close lower on Italy, US turmoil | Sakshi
Sakshi News home page

యూరప్‌ మహా సామ్రాజ్ఞి!

Published Tue, Oct 1 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

యూరప్‌ మహా సామ్రాజ్ఞి!

యూరప్‌ మహా సామ్రాజ్ఞి!

మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్‌ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీద గానీ ఎలాంటి భ్రమలూ లేవు. జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే ఆమెకు సత్యం. జరగరానిది జరగక తప్పదని తెలిసి కూడా జరగరాదని ఆఖరు వరకు ఎదురు చూడటం, ఆపై నిరాశతో నిట్టూర్చడం మానవ నైజం. సెప్టెంబర్‌ 22న అదే జరిగింది. ‘ప్రతి ఒక్కరూ ద్వేషించాలని కోరుకునే మహిళ’ (‘టైం’ పత్రిక) వరుసగా మూడో మారు జర్మనీకి ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. జర్మన్లు ఏంజెలా మర్కెల్‌కు ఘనంగా పట్టంగట్టారు. కానీ, జర్మనీ మినహా యూరప్‌ అంతటా విచారపడ్డవారే ఎక్కువ. మర్కెల్‌ను ‘యూరో నియంత’, ‘అభినవ హిట్లర్‌’ అని తిట్టిపోసేవారికి కొదవలేదు. యూరో సంక్షోభానికి విరుగుడుగా మర్కెల్‌ అమలు చేయిస్తున్న కఠోరమైన ప్రభుత్వ పొదుపు చర్యల ధాటికి సామాన్యులే కాదు యూరో అధినాయక ‘త్రయం’-యూరోపియన్‌ కమిషన్‌ (ఈసీ). యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సైతం ఆమె అంటేనే హడలెత్తిపోతున్నాయి.

‘పొదుపుల’ భారం పెరిగే కొద్దీ నిరుద్యోగం పెరగుతుందని, కొనుగోలుశక్తి పడిపోయి సంక్షోభం మరింత విషమిస్తుందని, కాబట్టి ఇప్పటికైనా కాస్త పొదుపు చర్యల్లో ‘మెతకదనం’ చూపాలని ‘త్రయం’ సైతం భావి స్తోంది. అందుకే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు మర్కె ల్‌ మితవాద కూటమికి పూర్తి ఆధిక్యతను కట్టబెడతాయన్న తొలి అంచాలను చూసి ఈయూఈసీ అధ్యక్షుడు గుంతర్‌ ఓటింగర్‌ ‘బాప్‌రే బాప్‌!’ అంటూ గుడ్లు తేలేశారు. కానీ, మర్కెల్‌ పూర్తి ఆధిక్యతకు ఐదు సీట్ల దూరంలో నిలిచిపోయారు. సోషల్‌ డెమోక్రాట్లతో, గ్రీన్‌ పార్టీతో కలిసి మర్కెల్‌ ‘మహా కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సి రావటం యూరప్‌కు శుభ సూచకమంటూ ఈయూ అధ్యక్షుడు మార్టిన్‌ షుల్‌‌జ ‘త్రయం’ అభిమ తాన్ని వెల్లడించారు. మర్కెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తలపడ్డ ఎస్‌పీడీ 2005లో మర్కెల్‌తో ‘మహా కూటమి’ ప్రభుత్వం నిర్మించిన ఫలితంగా... 2009 కంటే ఘోరపరాజయం పాలైంది. అయినా మర్కెల్‌తో మళ్లీ సంకీర్ణానికి వెనుకాడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికలు నిజానికి మర్కెల్‌ ఈయూ విధానంపై జనాభిప్రాయ సేకరణలాంటివి. ఎస్‌పీడీయే కాదు, గ్రీన్‌ పార్టీ సైతం మర్కెల్‌ ఈయూ విధానాన్ని సమర్థిస్తున్నవే. ఇతర ఈయూ దేశాలకు సం క్షోభ పరిష్కారంగా మర్కెల్‌ ఏమి శాసిస్తున్నారో వాటికి విరుద్ధమైన విధానాలను దేశంలో అవలంబిస్తున్నారు.

2007 సంక్షోభం మొదలైన వెంటనే ఆమె పొదుపర్లకు ఎలాంటి ముప్పు లేదని అభయహస్తం ఇచ్చారు. సైప్రస్‌లో అందుకు విరుద్ధంగా పొదుపర్ల డిపాజిట్లకు కత్తెర వేయించారు. ప్రభుత్వ వ్యయాల కోతలను శాసిస్తున్న మర్కెల్‌ 150 కోట్ల యూరోలను ఒక్క కార్ల పరిశ్రమకు ‘తుక్కు బోనస్‌’గా ఇచ్చారు. తద్వారా 5 లక్షలకు పైగా పాత కార్లను తుక్కు చేయించారు. ఆరు లక్షల కొత్త కార్లను ఒక్కొక్కదానికి 2,500 యూరోల సబ్సిడీని ప్రకటించి మరీ అమ్మించారు! సంక్షోభంలో కూడా జర్మనీది ఆర్థికంగా తిరుగులేని స్థానం. మిగతా యూరో జోన్‌ దేశాల ఎగుమతులన్నీ కలిసి జర్మనీ ఎగుమతుల్లో 42 శాతం మాత్రమే. భారీ ఎత్తున ఇతర యూరోపియన్‌ దేశాలతో వాణిజ్య మిగులు, భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నా మర్కెల్‌ యూరో సంక్షోభం పరిష్కారానికి పైసా పైసా లెక్కబెట్టి మరీ దులపరిస్తా రు.

యూరో సంక్షోభానికి పరిష్కారంగా చెబుతున్న యూరోపియన్‌ స్టెబిలిటీ మెకానిజంకు (యూరో శాశ్వత బెయిలవుట్‌ నిధి) జర్మనీ 27 శాతం నిధులను సమకూరుస్తోంది. కానీ జనాభాను లెక్కలోకి తీసుకొని చూస్తే అది చాలా తక్కువ. ఎనిమిది కోట్లకు పైగా జనా భా ఉన్న యూరప్‌లోని అత్యంత బలమైన దేశం జర్మనీ పౌరులు తలసరిన 265 యూరోలను ఈఎస్‌ఎమ్‌ నిధికి చెల్లిస్తుంటే, 53 లక్షల జనాభా ఉన్న లగ్జెంబర్‌‌గ తలసరిన 373 యూ రోలను చెల్లిస్తోంది. యూరో జోన్‌లో ఇస్తోనియా ఒక్కటే జర్మనీకన్నా తక్కువగా చెల్లిస్తున్నది. మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్‌ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీదగానీ ఎలాంటి భ్రమలూ లేవు. ఆమెకు జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే సత్యం. అలా అని ఆమె ‘నియంతలా’ ఏ నిర్ణయాన్ని ఇతరులపై రుద్దరు. కాకపోతే, ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని సృష్టించి ఏది కావాలో మీరే ‘ఎంచుకోమంటారు.’ గ్రీస్‌ విషయంలో ఆమె చేసిం దదే. గ్రీస్‌కు యూరో బహిష్కారమా? కఠోరమైన పొదుపు చర్యలతో బెయిలవుటా? తేల్చుకోమన్నారు. రెండోది ఎంచుకోకపోతే... ఆమె చెప్పకపోయినా జరిగేది అందరికీ తెలి సిందే. జర్మనీ యూరోకు గుడ్‌బై చేప్పేయటం.

  కాబట్టే గత మూడు నెలలుగా ‘త్రయం’ చేతులు ముడుచుకొని జర్మనీ ఎన్నికల కోసం వేచి చూస్తోంది. యూరో అధినాయక త్రయం సహా అంతా మర్కెల్‌ ఏర్పరచబోయో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ఆమె కాస్త ‘మెత్తబడతారని’ ఆశిస్తున్నారు. అదేమోగానీ ‘నుయ్యో గొయ్యో’ తేల్చుకోవాల్సింది సోషల్‌ డెమోక్రాట్లే. మర్కెల్‌ను వ్యతిరేకించి ఎన్నికలకు వెళి తే మర్కెల్‌కు తిరుగులేని ఆధిక్యత ఖాయం. కాబట్టి మర్కెల్‌ జర్మనీకి ఏది మేలనుకుంటే ఆదే చేస్తారు. అంతా మర్కెల్‌ చేతుల్లోనే ఉం ది. నేటి యూరప్‌కు మర్కెల్‌ ఒక శాపం... ఉన్న ఒకే ఒక్క ఆశ!
- పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement