ఐరోపాలో ‘కత్తి’ గీతాలు | Ilayathalapathy Vijay & Samantha Duet Songs in European | Sakshi
Sakshi News home page

ఐరోపాలో ‘కత్తి’ గీతాలు

Published Tue, Jul 29 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

ఐరోపాలో ‘కత్తి’ గీతాలు

ఐరోపాలో ‘కత్తి’ గీతాలు

 కత్తి చిత్ర గీతాలను ఐరోపాలో చిత్రీకరించనున్నారు. ఇళయదళపతి విజయ్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత నాయకి. చిత్ర షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 10వ తేదీకంతా టాకీ పార్టు పూర్తి అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తి అవుతోంది.
 
 ఈ రెండు పాటలను ఐరోపా దేశాల్లో చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దీంతో ఆగస్టు నెల చివరిలో విజయ్, సమంత, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్‌తోపాటు చిత్ర యూనిట్ ఐరోపాకు పయనం కానుంది. ఈ రెండు పాటలను అక్కడి మూడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. అనిరుధ్ సంగీతాన్ని చిత్రం అందిస్తున్నా ఈచిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కత్తి చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement