
ప్రతీకాత్మక చిత్రం
అబ్దుల్లాపూర్‌మెట్: తమ పెళ్లికి పెద్దలు అంగీకరంచరేమోననే భయంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రమాదేవి పబ్లిక్ స్కూల్ వెనకాల రెండు మృతదేహాలు ఉన్నాయన్న సమాచారం మేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ యువతి, యువకుడి మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో లభించిన టీఎస్ కాప్ అప్లికేషన్ పత్రాలు, బైక్, సెల్‌ఫోన్ ఇతర ఆధారాల సాయంతో వివరాలు సేకరించారు. మృతులిద్దరూ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలెపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పోలెపల్లికి చెందిన వెంకటయ్య కుమారుడు సతీష్ బైక్ మెకానిక్.
వీరి ఇంటి సమీపంలో ఉండే శంకర్ కూతురు శిరీష (23) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే అనుమానంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
(చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!)
Comments
Please login to add a commentAdd a comment