అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ - 19 పాజిటివ్‌గా తేలిందని, ఆయన స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.ఆయన గతంలో వ్యాక్సీన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు. బైడెన్‌కు గతంలోనూ రెండుసార్లు కోవిడ్ సోకింది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ కరోనా బారినపడటం పార్టీ నేతలను కలవరపాటుకి గురి చేసింది.
ఆయన టీకాలు వేయించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం తన డెలావేర్ బీచ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడ నుంచి విధులు కొనసాగిస్తారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కి కరోనా రావడం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్షుడు కేసును బట్టి వృద్ధులు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండేల్సిందేనని తెలుస్తోంది.
అదీగాక యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 65 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులలో కరోనే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వృద్ధులు కరోనా బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల వారికే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ తదితరాల గురించి తెలుసుకుందాం.
వృద్ధులకే ఎందుకు..
వృద్ధలు, చిన్నపిల్లల్లో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. వృద్ధాప్య కారణంగా ఉండే వయసురీత్య సమస్యలు కూడా కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఊబకాయం, ఉన్నవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. వృద్ధులలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే.
జ్వరం లేదా చలి
దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
అలసట
కండరాలు లేదా శరీర నొప్పులు
తలనొప్పి
రుచి లేదా వాసన యొక్క కొత్త నష్టం
గొంతు మంట
ముక్కు కారటం
వికారం లేదా వాంతులు
అతిసారం
మరింత తీవ్రంగా ఉంటే..
కోవిడ్-19 ఉన్న పెద్దలు కూడా డెలిరియం, వివరించలేని హైపోక్సియా వంటి విలక్షణమైన లక్షణాలు కనిపించొచ్చు. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలు, వేగవంతమైన శ్వాస, మైకం, పెరిగిన హృదయ స్పందన రేటు, రక్తపోటు పడిపోవడం తదితరాలు.
బూస్టర్లు ఎందుకు..
బూస్టర్ మోతాదులను సాధారణంగా వారి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడానికి వృద్ధులకు సిఫార్సు చేస్తారు. అంతేగాదు డబ్ల్యూహెచ్‌ఓ కూడా సాధారణంగా 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటే..వారి సంరక్షణార్థం ఈ బూస్టర్ షాట్‌లను సిఫార్సు చేస్తోంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా వృద్ధులను రక్షించడంలో బూస్టర్ లేదా ముందుజాగ్రత్త మోతాదు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లక్షణాలు స్వల్పంగా ఉండేలా చేసి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
(చదవండి: వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!)
Comments
Please login to add a commentAdd a comment