
ఉత్తరకొరియా చేసే దేనికైనా మేము సిద్దం అని ప్రకటించిన బైడెన్. దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేసేందుకు అంగీకరించారు కూడా.
Prepared for Weapons Test: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటనలో భాగంలో దక్షిణ కొరియాలోని సీయోల్‌లో విలేకరుల సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్‌కి ఒక సందేశాన్ని అందించారు. తాను ఉత్తర కొరియా అణుపరీక్షల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. అంతేకాదు ఉత్తరకొరియా చేసే దేనికైనా తాము సిద్దంగా ఉన్నాం అని చెప్పారు. బైడెన్ ఒకరకంగా తాము అణ్వయుధాపరీక్షలకు సిద్ధమేనని చెప్పకనే చెప్పేశారు.
మరోవైపు దకిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు, అణ్వయుధ సామార్థ్యంగల ఆయుధాల కసరత్తులు నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. ఐతే ఉత్తరకొరియా మాత్రం ఈ కరోనా విపత్కర సమయంలో ఆదుకుంటామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్‌లో నిజం లేదంటూ ఆరోపించింది. ఒక పక్క ఆదుకుంటామంటూనే సెనిక కసరత్తులు, ఆంక్షలు వంటి శత్రువిధానాలు కొనసాగిస్తుందంటూ అమెరికా పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అమెరికా మాత్రం కరోనా వ్యాక్సిన్‌లు ఉత్తరకొరియాకు సరఫర చేస్తామని ప్రకటించినా ఎలాంటి స్పందన లేదని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పై ఒత్తిడి తెచ్చేలా ఆసియా దేశాలను సమీకరించేందుకు ఈ పర్యటన చేస్తున్నాట్లు బైడెన్ తెలిపారు. ఆ తర్వాత బైడెన్ క్వాడ్ దేశాలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.