ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్న పసిపాప నోమశ్రీ
ఏడాదిన్నర వయసు.. ఆ పిల్ల మాట్లాడినా, అరిచినా, నవ్వినా, కాస్త నడిచినా ముచ్చటపడిపోవాల్సిందే. రోజంతా ఎంత కష్టపడినా ఆ బుజ్జాయి ముఖం చూస్తే చాలు తండ్రి ప్రాణానికి హాయి. దినమంతా ఎంత బాధగా గడిచినా ఆ చిన్నారి నవ్వు చూస్తే ఆ తల్లి మనసుకు స్వాంతన. అలాంటిది ఆ పాప ఇప్పుడు నవ్వలేకపోతోంది. నోరారా అమ్మా అని సరదాగా పిలవలేకపోతుంది. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతోంది. అన్నింటికీ మించి ఆస్పత్రి మంచంపై చావుతో పోరాడలేకపోతోంది. కిడ్నీ ట్యూమర్‌తో బాధ పడుతున్న కుమార్తెను బతికించుకోవడానికి తల్లిదండ్రులు తోటివారి సాయం కోరుతున్నా రు. ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, ఆదుకోవాలని అర్థిస్తున్నారు.
ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం జిల్లా): ఇచ్ఛాపురం మండలం కొళిగాం గ్రామానికి చెందిన యామన గోపాలకృష్ణ, చిట్టిపాప దంపతులు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కొన్నాళ్ల కింద ట బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని బతుకుతున్నారు. దు స్తులు కుట్టే పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ దంపతులకు కోమలి, నోమశ్రీలు సంతానం. ఇద్దరు పిల్లలే లోకంగా ఆ దంపతులు ఉన్నంతలోనే సు ఖంగా రోజులు గడిపేస్తున్నారు. కానీ ఆ కాస్త ఆనందం కూడా వారిని నిలవలేదు. ఇరవై నెలల ముద్దుల చిన్నారి నోమశ్రీ అనారోగ్యం బారిన పడింది. విపరీతమైన జ్వరం, నీరసం రావడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిప్పారు. కొన్ని రోజులు జ్వరం తగ్గడం, మళ్లీ రావడంతో కేవలం ఆ వైద్యానికే రూ.లక్షల్లో ఖర్చయిపోయింది. చివరకు హైదరాబాద్‌లోనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించగా పాప కిడ్నీ ట్యూమర్‌తో బాధపడుతోందని, వెంటనే వైద్యం చేయాలంటూ పిడుగులాంటి వార్త చెప్పడంతో తల్లిదండ్రులు హతాశుతులయ్యారు.
అసలే వలస కుటుంబం, ఆపై సుమారు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చువుతుందంటూ వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థోమతకు మించిన సొమ్ము సర్దలేక సతమతమవు తున్నారు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండికి చెందిన ‘యువతరం సంస్థ’ అధ్యక్షుడు చింత మురళీ ముందుకు వచ్చి తమ సంస్థ ద్వారా కొంత ఆర్థిక సాయాన్ని అందించారని బాలిక తండ్రి గోపాలకృష్ణ తెలిపాడు. ప్రస్తుతం నెలన్నర రోజుల నుంచి ఆస్పత్రిలో పాపకు చికిత్స చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి చికిత్స ఖర్చు తలకుమించిన భారం కావడంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. మ నసున్న వారు స్పందించి తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాల ని వేడుకుంటున్నారు.
సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు
గూగుల్ పే : 8985403107
ఫోన్ పే : 6303285103
ఆంధ్రాబ్యాంకు(తెలంగాణ): అకౌంట్ నంబర్ః 032710100178007
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ః ఏఎన్080000327
Comments
Please login to add a commentAdd a comment