tumor
-
ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!
చేపకు ఆపరేషన్ చేశారట! విడ్డూరంగా లేదూ? ఈ ఫొటోలో కనిపిస్తున్న చేప పేరు మెర్లిన్. దీని వయసు పదిహేడేళ్లు. అమెరికాకు చెందిన లూకాన్ అనే వ్యక్తి ఈ గోల్డ్ ఫిష్‌ను గత మూడేళ్లుగా తన ఆక్వేరియంలో పెంచుకుంటున్నాడు. ఇటీవల ఈ చేప ఎడమ కంటిపై వాపు వచ్చి, ఈత కొట్టలేక పోతుండటాన్ని గమనించాడు. వెంటనే చేపను ఆసుపత్రికి తీసుకొని వెళ్తే, డాక్టర్ దానిని పరిశీలించి, చేప కంటిపై పెరిగిన కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలగించకుంటే చేప ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో, పశువైద్యుడు ఈమర్ ఓర్లీ, ఈ చేపకు ఆపరేషన్ చేసి బతికించాడు. చేపలకు మత్తుమందు ఇవ్వడం చాలా కష్టమైనా, డాక్టర్ ఓర్లీ, మత్తుమందు ఇచ్చి, సుమారు మూడు గంటల పాటు శ్రమించి, చేప కంటి మీద ఉన్న ప్రాణాంతకమైన కణితిని నేర్పుగా తొలగించారు. తర్వాత దానికి కుట్లు వేసి, ప్రత్యేక ట్యాంకులో పరిశీలనకు ఉంచారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకొని ఆషరేషన్ చేసిన డాక్టర్‌కు సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!) -
కడుపులో కణితి..ప్రాణాంతకమా? కాదా?
ఇండోర్‌కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది. చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం. ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే.. శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్‌గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కణితులు రావడానకి గల కారణాలు శరీరంలో పరివర్తన చెందిన బీఆర్సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా ధూమపానం బెంజీన్ వంటి టాక్సిన్స్‌కు గురికావడం హెచ్‌పీవీ వంటి వైరస్లుస ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు కణితులు సంకేతాలు లేదా లక్షణాలు ⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం ⇒జ్వరం ⇒తొందరగా బరువు తగ్గడం ⇒ఆకలి లేకపోవడం ⇒రాత్రిపూట సడెన్‌గా చెమటలు పట్టడం ⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి అన్ని రకాల కణితులు ప్రమాదకరమా? ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి. ►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు ►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్నెస్గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రత్యేకం
జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్.. అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా. బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు: ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు. లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు. -
అరుదైన ట్యూమర్.. వైద్యులంతా చర్చించి.. ధైర్యం చేసి..
సాక్షి, గుంటూరు మెడికల్: మెడికల్ జర్నల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైన అత్యంత అరుదైన ట్యూమర్‌ను గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు గుర్తించారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‌ను జనరల్ సర్జరీ రెండో యూనిట్ వైద్యులు విజయవంతంగా చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆస్పత్రిలో బుధవారం మీడియాకు ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన నేలటూరి శామ్‌సన్‌జాన్‌సునీల్ మంచంపై నుంచి లేవలేని విధంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతడిని విజయవాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు తక్షణమే అతడికి రక్తం ఎక్కించి ఆరోగ్యం కొంచెం మెరుగుపడ్డాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపు కింది భాగంలో జిస్ట్ అనే కణితి ఉన్నట్లు నిర్థారించారు. సర్జరీ కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదించినా లాభంలేక గుంటూరు జీజీహెచ్‌కు మార్చి 14న రోగిని తీసుకొచ్చారు. రిపోర్టులు పరిశీలించి.. చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర అత్యంత అరుదైన జిస్ట్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ కిరణ్‌కుమార్ చెప్పారు. చిన్నపేగు మొదటి భాగంలో గ్యాస్ట్రో ఇంటస్టీనల్ స్ట్రోమల్ ట్యూమర్(జిస్ట్) ఇప్పటివరకు మెడికల్ జర్నల్స్‌లో రెండు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. చదవండి: సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఈ సమస్యకు ఏ విధంగా ఆపరేషన్ చేయాలనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదని, రెండో యూనిట్ జనరల్ సర్జరీ వైద్యులంతా దీని గురించి చర్చించి ధైర్యంగా మార్చి 25న ఆపరేషన్ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకూ తీసుకునే ఈ సర్జరీని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు చలం, నాగసంతోష్, వంశీధర్, అనూష, వేణుగోపాల్, కోటి, మత్తు వైద్యులు మహేష్‌బాబు, ఆనందబాబు, అలేఖ్య, కీర్తి, రాఘవ, కవిత పాల్గొన్నట్టు డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్ ట్రీట్మెంట్ (ఎగ్జిట్) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు. పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. (చదవండి: టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?) -
అరుదైన కణితికి శస్త్రచికిత్స
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ వైద్యులు అత్యంత అరుదైన కణితి టెరటోమాను తొలగించి.. పసికందు ప్రాణాలను కాపాడారు. ఈ వివరాలను ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సుమితా శంకర్ శనివారం మీడియాకు వెల్లడించారు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన బీసుపోగు చైతన్య, ఏసయ్య దంపతులకు ఈ ఏడాది జూన్‌లో మగబిడ్డ జన్మించాడు. పుట్టుకతోనే చిన్నారి ముక్కుపై భాగంలో సుమారు కిలో బరువున్న కణితి ఉండటంతో.. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారిని తీసుకొని జీజీహెచ్‌కు వచ్చారు. పిల్లల వైద్యులు బిడ్డను పరీక్షించి న్యూరోసర్జరీ వైద్య విభాగానికి రిఫర్ చేశారు. జూన్ 4న ఆ పసికందుకు ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా ముక్కుపై ఉన్న కణితిని తొలగించారు. ఆ తర్వాత ముక్కు పై భాగంలో ఎక్కువ ఖాళీ ఉండటంతో.. ఇన్ఫెక్షన్లు బ్రెయిన్‌కు సోకే ప్రమాదాన్ని వైద్యులు గుర్తించారు. ఈనెల 21న మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఖాళీని పూరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.6 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్ సుమితా శంకర్ చెప్పారు. సకాలంలో ఆపరేషన్ చేయకపోతే.. పసికందు ప్రాణాలు పోయేవని తెలిపారు. ఇలాంటి అరుదైన ట్యూమర్‌కు ఆపరేషన్లు చేసినట్లు మెడికల్ జర్నల్‌లో ఇప్పటివరకు నమోదు కాలేదని చెప్పారు. దీనిని మెడికల్ జర్నల్స్‌కు పంపిస్తామని తెలిపారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి అభినందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా బిడ్డకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ప్రభుత్వానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో న్యూరోసర్జరీ ఇన్చార్జ్ డాక్టర్ సురేంద్ర వర్మ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు చంద్రలేఖ, నజ్మా, శృతి, గంగా«భవాని తదితరులు పాల్గొన్నారు. -
తలలో కణితి.. శిశువుకు శస్త్రచికిత్స
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి తెలిపారు. -
కణితి అని భావిస్తే.. వైట్ ఫంగస్‌గా తేలింది
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ విభిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెదడులో కణితి ఉందని భావించిన వైద్యులు ఆపరేషన్ తీసి దాన్ని తొలగించారు. తీరా చూస్తే అది కాస్త వైట్ ఫంగస్‌గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన కలా బాయ్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు తన శరీరం కుడి భాగం విపరీతంగా లాగడం ప్రారంభించింది. దాంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేసి.. మెదడులో కణితి ఏర్పడినట్లు గుర్తించారు. ప్రాణాంతక కణితిని వెంటనే తొలగించాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కణితికి బయాప్సి నిర్వహించగా షాకింగ్ విషయం తెలిసింది. వైద్యులు భావించినట్లు అది కణితి కాదు.. వైట్ ఫంగస్ అని తేలింది. ఈ సందర్భంగా కలా బాయ్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ఎంఆర్ఐ స్కాన్‌లో ఫంగస్ కణితిలానే కనిపించింది. పైగా కణితి ఏర్పడినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో కలా బాయ్‌లో అవే లక్షణాలు కనిపించాయి. ఆమె అదృష్టం బాగుండి ఫంగస్ మిగతా భాగాలకు చేరేలోపే దాన్ని తొలగించగలిగాము. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’’ అని తెలిపారు. చదవండి: శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు -
'మా చిన్నారి ఆపరేషన్‌కు స్థోమత లేదు'.. కేటీఆర్ స్పందన
సాక్షి, రాయికోడ్(అందోల్): ‘‘సార్.. నా రెండేళ్ల చిన్నారికి గొంతు చుట్టూ కణితి ఏర్పడి బాధపడుతోంది.. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత లేదు.. ఆర్థిక సాయం చేయండి ప్లీజ్’’అని చిన్నారి తండ్రి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ (2)కు ఏడాదిన్నర క్రితం గొంతు వద్ద చిన్న కణితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ఆర్థికస్థోమత లేక ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుండగా మిత్రుడి సూచన మేరకు అతడి ట్విట్టర్ నుంచి బుధవారం మంత్రి కేటీఆర్‌కు విషయం వివరించాడు. ''శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండి.. ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారని'' కేటీఆర్ కార్యాలయం అధికారులు సూచించినట్లు అవినాష్ తెలిపాడు. చదవండి: కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి I was in pain just looking at the photo of the child. Wonder how she is holding up 🙏 Will personally handle the issue and get the little one best medical care. Thanks for bringing this to my attention @KTRoffice please coordinate https://t.co/FAiDd14OLP — KTR (@KTRTRS) June 10, 2021 -
మంత్రి ‘కొప్పుల’కు మేయర్ శస్త్రచికిత్స
సాక్షి, కరీనంగర్/గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ మంగళవారం శస్త్రచికిత్స చేశారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశ్వర్ కడుపు ఎడమవైపు పైభాగంలో కణతి ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని వైద్యులు ఇదివరకే సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఈశ్వర్ పాల్గొని తిరిగి వస్తుండగా కడుపులో నొప్పి ఎక్కువైంది. మార్గమధ్యంలో గోదావరిఖని మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌ను ఆశ్రయించగా విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆపరేషన్ చేసిన అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జి అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొన్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి 50 కిలోల అండాశయ కణితిని డాకర్లు తొలగించారు. ఆమె శరీర బరువులో సగభాగం ఆ కణితే ఉండేదని డాక్టర్లు తెలిపారు. కణిత బాగా పెరిగిపోవడంతో ఆ మహిళకు కడుపులో నొప్పి విపరీతంగా వచ్చేది. అంతే కాకుండా ఆమె సంవత్సరం నుంచి విపరీతంగా బరువు పెరగడం మొదలుపెట్టింది. దీంతో అనేక నొప్పులు, నడవడం కష్టమవడం, నిద్రపోవడం ఇబ్బంది ఉండటం లాంటి సమస్యలు మొదలయ్యాయి. ఆమె దగ్గరలో ఉన్న డాక్టరుకు చూపించుకోగా ఆయన ఇంద్రప్రస్థాన్ అపోలో హాస్పటల్‌కు వెళ్లాల్సిందిగా ఆ మహిళకు సూచించారు. పరీక్షలు చేసిన అపోలో డాక్టర్లు ఆమె అండశయంలో కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. మూడున్నర గంటల పాటు కష్టపడి ఆమె కడుపులోని కణితి తొలగించారు. దీంతో ఆమె శరీర బరువు 106 కేజీల నుంచి అమాంతం 56 కేజీలకు తగ్గిపోయింది. అంటే ఆమె శరీరంలో దాదాపు సగం బరువు ఈ కణితే ఉంది. చికిత్స అనంతరం ఆమెను ఆగస్టు 22న డిశార్జ్ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆపరేషన్ చేసిన కణిత ఇదేనని, అదివరకు కొయంబత్తూరుకు చెందిన మహిళ కడుపు నుంచి 2017 లో 34 కేజీల కణితను తొలగించామని డాక్టర్లు తెలిపారు. చదవండి: ‘యూపీ సర్కార్ ఆ సూత్రాలను పాటించడం లేదు’ -
ఆపదలో ఆశల దీపం..
ఏడాదిన్నర వయసు.. ఆ పిల్ల మాట్లాడినా, అరిచినా, నవ్వినా, కాస్త నడిచినా ముచ్చటపడిపోవాల్సిందే. రోజంతా ఎంత కష్టపడినా ఆ బుజ్జాయి ముఖం చూస్తే చాలు తండ్రి ప్రాణానికి హాయి. దినమంతా ఎంత బాధగా గడిచినా ఆ చిన్నారి నవ్వు చూస్తే ఆ తల్లి మనసుకు స్వాంతన. అలాంటిది ఆ పాప ఇప్పుడు నవ్వలేకపోతోంది. నోరారా అమ్మా అని సరదాగా పిలవలేకపోతుంది. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతోంది. అన్నింటికీ మించి ఆస్పత్రి మంచంపై చావుతో పోరాడలేకపోతోంది. కిడ్నీ ట్యూమర్‌తో బాధ పడుతున్న కుమార్తెను బతికించుకోవడానికి తల్లిదండ్రులు తోటివారి సాయం కోరుతున్నా రు. ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం జిల్లా): ఇచ్ఛాపురం మండలం కొళిగాం గ్రామానికి చెందిన యామన గోపాలకృష్ణ, చిట్టిపాప దంపతులు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కొన్నాళ్ల కింద ట బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని బతుకుతున్నారు. దు స్తులు కుట్టే పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ దంపతులకు కోమలి, నోమశ్రీలు సంతానం. ఇద్దరు పిల్లలే లోకంగా ఆ దంపతులు ఉన్నంతలోనే సు ఖంగా రోజులు గడిపేస్తున్నారు. కానీ ఆ కాస్త ఆనందం కూడా వారిని నిలవలేదు. ఇరవై నెలల ముద్దుల చిన్నారి నోమశ్రీ అనారోగ్యం బారిన పడింది. విపరీతమైన జ్వరం, నీరసం రావడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిప్పారు. కొన్ని రోజులు జ్వరం తగ్గడం, మళ్లీ రావడంతో కేవలం ఆ వైద్యానికే రూ.లక్షల్లో ఖర్చయిపోయింది. చివరకు హైదరాబాద్‌లోనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించగా పాప కిడ్నీ ట్యూమర్‌తో బాధపడుతోందని, వెంటనే వైద్యం చేయాలంటూ పిడుగులాంటి వార్త చెప్పడంతో తల్లిదండ్రులు హతాశుతులయ్యారు. అసలే వలస కుటుంబం, ఆపై సుమారు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చువుతుందంటూ వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థోమతకు మించిన సొమ్ము సర్దలేక సతమతమవు తున్నారు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండికి చెందిన ‘యువతరం సంస్థ’ అధ్యక్షుడు చింత మురళీ ముందుకు వచ్చి తమ సంస్థ ద్వారా కొంత ఆర్థిక సాయాన్ని అందించారని బాలిక తండ్రి గోపాలకృష్ణ తెలిపాడు. ప్రస్తుతం నెలన్నర రోజుల నుంచి ఆస్పత్రిలో పాపకు చికిత్స చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి చికిత్స ఖర్చు తలకుమించిన భారం కావడంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. మ నసున్న వారు స్పందించి తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాల ని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు గూగుల్ పే : 8985403107 ఫోన్ పే : 6303285103 ఆంధ్రాబ్యాంకు(తెలంగాణ): అకౌంట్ నంబర్ః 032710100178007 ఐఎఫ్ఎస్సీ కోడ్ః ఏఎన్080000327 -
రేడియో సర్జరీ అంటే ఏమిటి?
మావారి వయసు 36 ఏళ్లు. ఇటీవల తరచుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దాంతో న్యూరాలజిస్ట్‌ను కలిశాం. ఆయన అన్ని పరీక్షలూ చేసి, మెదడు లోపల కాస్తంత లోతుగా 2.5 సెంటీమీటర్ల సైజ్‌లో కణితి (ట్యూమర్) ఉందని చెప్పారు. ఇలాంటి ట్యూమర్లకు రేడియో సర్జరీ మంచిదని సలహా ఇచ్చారు. మేం చాలా ఆందోళనగా ఉన్నాం. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్లు. ఎంతో భయంగా ఉంది. ఈ సర్జరీ గురించి వివరంగా చెప్పండి. మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే మీరుగానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ట్యూమర్ విషయంలో ఎలాంటి ఆందోళనలూ, భయాలు పెట్టుకోనవసరం లేదు. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్ఆర్ఎస్ (స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ) లేదా రేడియో సర్జరీ అని పిలిచే అత్యాధునిక ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ... కేవలం అనారోగ్యకరమైన కణజాలాన్ని మాత్రమే తొలగించే లక్ష్యంతో డాక్టర్లు సర్జరీ నిర్వహిస్తారు. ఈ లక్ష్యాన్ని రేడియో సర్జరీ మరింత ప్రభావవంతంగా నెరవేరుస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్స్‌రేల నుంచి ఫోటాన్ శక్తిని ట్యూమర్పైకి పంపిస్తారు. మెదడుకు కేవలం 2 గ్రేల రేడియేషన్‌ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ట్యూమర్‌ను సమూలంగా నిర్వీర్యం చేయడానికి అంతకన్నా ఎక్కువ రేడియేషన్ అవసరం. అందుకే స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీలోఒక ప్రత్యేకమైన ఫిల్టర్ గుండా రేడియేషన్‌ను ట్యూమర్పైన మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేస్తారు. ఇందుకోసం 13 నుంచి 22 గ్రే ల రేడియేషన్‌ను వాడతారు. ఇది చాలా ఎక్కువ మోతాదు (హై డోస్) రేడియేషన్. అయినప్పటికీ ఈ రేడియేషన్ అంతా ప్రతి కిరణంలోనూ వందో వంతుకు విభజితమవుతుంది. అయితే మొత్తం రేడియేషనంతా ట్యూమర్‌ను టార్టెట్‌గా చేసుకొని పూర్తిగా దానిమీదే కేంద్రీకృతమవుతుంది. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. ఈ రేడియో సర్జరీలో ఫ్రేమ్ వాడరు. అందుకే దీన్ని ఫ్రేమ్‌లెస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని కూడా అంటారు. అయితే ఈ సర్జరీ చేయాలంటే ట్యూమర్ పరిమాణం 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. కానీ అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే సర్జరీ చేసి, దాని పరిణామాన్ని తగ్గించి, ఆ తర్వాత రేడియో సర్జరీ ద్వారా మొత్తం ట్యూమర్‌ను తొలగించవచ్చు. రేడియేషన్ పంపించిన తర్వాత రెండేళ్లకు కణితి పూర్తిగా కుంచించుకుపోతుంది. 3 నుంచి 5 ఏళ్లలో 60 నుంచి 70 శాతం తగ్గుతుంది. చివరికి మచ్చలాగా మిగులుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్‌లో రేడియోసర్జరీ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఒకేసారి ఐదు ట్యూమర్లనూ తొలగించవచ్చు. ఈ స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ కోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. ఔట్‌పేషెంట్‌గానే ఈ చికిత్సను పూర్తిచేయవచ్చు. ఇది పూర్తిగా నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే దీని కోసం శరీరం మీద ఎలాంటి కోత/గాటు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్ అంటే సాధారణంగా ఎంతోకొంత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఈ రేడియో సర్జరీలో కోత ఉండదు కాబట్టి దీనిలో ఎలాంటి రక్తస్రావమూ ఉండదు. కోత ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. చికిత్స జరిగే సమయంలో ట్యూమర్ కణాలు తప్ప, దాని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన మెదడు కణాలకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. శరీరానికి కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీలో కణితిలోని కణాలు పక్కకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ రిస్కు ఉండదు. సంప్రదాయక శస్త్రచికిత్సలో పొరబాటున మిగిలిపోయిన ట్యూమర్ కణాలను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. చికిత్స చాలా కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణ సర్జరీతో చికిత్స అందించలేని ట్యూమర్లను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. వృద్ధులకు, సర్జరీ చేయడం కుదరని పేషెంట్లకు కూడా ఈ రేడియో సర్జరీని చేయవచ్చు. కాబట్టి మీ డాక్టర్ సూచించిన విధంగా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ వారికి ఈ సర్జరీ చేయించండి. ట్యూమర్ అంటే అది క్యాన్సరేనా? మా ఫ్రెండ్ వాళ్ల నాన్న చాలాకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్నారు. అసలు ట్యూమర్ అంటే ఏమిటి? అంటే అది క్యాన్సరేనా? దీనికి చికిత్స లేదా? శాశ్వత పరిష్కారం ఏమిటి? ట్యూమర్లను ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేమిటి? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి. కణాలు తమ నియతి (కంట్రోల్) తప్పి, విపరీతంగా విభజన చెంది పెరిగితే కణితి (ట్యూమర్) ఏర్పడుతుంది. కణుతులు అన్నీ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కాని కణుతులును బినైన్ ట్యూమర్లు అంటారు. క్యాన్సర్ కణాలైతే కణితి ఏర్పడిన చోటి నుంచి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కానీ బినైన్ కణాలు అలా వ్యాపించవు. కానీ కణితి పక్కనున్న నరంపైన ఒత్తిడి పడేలా చేస్తాయి. దాంతో ఇతర సమస్యలు రావచ్చు. ట్యూమర్ పెద్ద సైజులో ఉన్నా, కీలకమైన నరాల దగ్గర ఏర్పడినా ఫిట్స్ రావచ్చు. మెదడులో ట్యూమర్ వల్ల కొన్నిసార్లు కాళ్లూచేతులు పడిపోవడం లాంటి ప్రమాదం కూడా ఉండవచ్చు. అందుకే బినైన్ కణుతులకు కూడా చికిత్స అందించాలి. బినైన్ ట్యూమర్లను ఒకసారి తొలగిస్తే ఇక జీవితాంతం సమస్య ఉండదు. సాధారణంగా ఈ ట్యూమర్లు జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడతాయి. వీటికి పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) కారణాలూ తోడవుతాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారం లాంటి అంశాలు కణితి ఏర్పడే జన్యుతత్వాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడకుండా నివారించలేము. మంచి ఆహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే కొంతవరకు మేలు. మెదడులో ట్యూమర్ ఉన్నప్పుడు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇవి చాలా వరకు పరీక్షల్లో మాత్రమే బయటపడుతుంటాయి. కణితి పెరిగి మరీ పెద్దగా అయినప్పుడు మాత్రమే ఇబ్బందులు తలెత్తవచ్చు. పదేపదే తలనొప్పి వస్తున్నదంటే మెదడులో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించవచ్చు. తలనొప్పితో పాటు వికారంగా ఉండటం, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ రవిసుమన్ రెడ్డి, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద çహాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
మహిళ శరీరంలో 50 పౌండ్ల కణితి
మెరిడియన్‌కు చెందిన ఓ మధ్యవయసు మహిళ శరీరం నుంచి 50 పౌండ్ల కణితిని తొలగించారు. వివరాలు.. బ్రెండా కిడ్‌లాండ్ అనే మహిళ ఈ మధ్యకాలంలో విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించింది. మోనోపాజ్ స్టేజ్‌లో ఉన్నా కదా కాబట్టి బరువు పెరగడం చాలా సాధరణమే అని భావించింది. ఇక ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత కొద్ది నెలలుగా బ్రెండా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దాంతో డాక్టర్‌ను కలిసింది. వైద్య పరీక్షల్లో భాగంగా బ్రెండాకు సీఏటీ స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ చూసి ఆశ్యర్యపోవడం డాక్టర్ల వంతయ్యింది. బ్రెండా శరీరంలో దాదాపు 50 పౌండ్ల(సుమారు 23 కిలోగ్రాములు) కణితి ఉన్నట్లు స్కానింగ్‌లో తెలీంది. ఇంత భారీగా పెరిగిన కణితి ఆమె శరీరంలోని మిగతా అవయవాలను అడ్డుకోవడమే కాక మెదడుకు రక్త ప్రసరణ కాకుండా నిరోధిస్తుందని వైద్యులు తెలిపారు. అనంతరం డాక్టర్లు దాదాపు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితిని తొలగించారు. సర్జరీ అనంతరం బ్రెండా మాట్లాడుతూ.. ‘కణితిని తొలగించిన తరువాత నేను దాదాపు 65 పౌండ్ల బరువు తగ్గాను. దీని వల్ల నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. మన శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమైనా తేడా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. నా కథ మిగతా ఆడవారందరికి ఒక ఉదాహరణగా నిలవాల’ని తెలిపారు. -
ఆమె బతికేవుంది.. కణాలుగా!
నువ్వు లేవు కానీ నీ జ్ఞాపకాలున్నాయి అని మనకు ప్రియమైన వాళ్లను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ బతికిçస్తుంటాం. కానీ హీన్రియెటా లాక్స్ విషయంలో ఈ ఉద్వేగం పనిచేయదు. మనిషి కొన్ని కోట్ల కణాల సమూహం అని ఒప్పుకుంటే ఈ ఆఫ్రికన్ అమెరికన్ మహిళ ఇప్పటికీ బతికివున్నట్టే లెక్క. కాకపోతే సాంకేతికంగా ఆమె జీవితకాలాన్ని 1920–1951 అని రాయాలంతే. హీన్రియెటా అనారోగ్యంతో 1951లో అమెరికా మేరీలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో చేరింది. ఆ ప్రాంతంలో అప్పుడు నల్లవారికి చికిత్స చేసే ఆసుపత్రి అదొక్కటే. అప్పటికి ఆమె ఐదుగురు పిల్లల తల్లి. పొగాకు పండించే కుటుంబం వాళ్లది. గర్భాశయంలో చిన్న ముడిలాంటిదేదో ఉన్నట్టు ఆమె అనుకుంది. ఇంట్లోవాళ్లు మళ్లీ గర్భం దాల్చిందేమో అనుకున్నారుగానీ రక్తస్రావం జరిగాక, చాలా పరీక్షల తర్వాత సెర్వికల్ కేన్సర్ అని తేలింది. అప్పుడు ఆమె ట్యూమర్ కణాలను శాంపిల్‌గా తీసుకున్నారు. ఆ విషయం ఆమెక్కూడా తెలియదు. వాటిని బయాప్సీ చేసిన బయాలజిస్ట్ జార్జ్ ఆటో గై... యురేకా అని అరిచినంత పనిచేశాడు. ఆమె కణాలు వేగంగా పెరగడమే కాదు, వాటికి మృత్యువనేదే లేదని గుర్తించాడు. సాధారణంగా పరిశోధకులు కణాల మీద చేసే ప్రయోగాల్లో ప్రయోగం కంటే ఆ కణాలను కాపాడుకోవడమే ఎక్కువ ప్రయాస అవుతుంది. కానీ హీన్రియెటా కణాలు ఏ పరిస్థితుల్లోనైనా మనగలిగే గొప్ప గుణాన్ని కలిగివుండటం సృష్టి మర్మం. పది నెలల పోరాటం అనంతరం 31 ఏళ్ల హీన్రియెటా మరణించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల ప్రయోగశాలల్లోనూ జరుగుతున్న బయోమెడికల్ రీసెర్చ్‌లో ఆమె కణాలు కీలకమవుతున్నాయి. ఏఉnటజ్ఛ్టీ్ట్చ ఔఅఛిజుటపేరు మీదుగా రూపొందిన హీలా సెల్ లైన్ వేలాది రోగాల చికిత్స కోసం తయారుచేస్తున్న వేలాది మందులను పరీక్షించడానికి పనికొస్తోంది. 2010లో మాత్రమే ఆమె సేవను అధికారికంగా గుర్తించారు. 2017లో ఆమె జీవితం ఆధారంగా ‘ది ఇమ్మోర్టల్ లైఫ్ ఆఫ్ హీన్రియెటా లాక్స్’ పేరుతో సినిమా కూడా వచ్చింది. -
అమ్మో..కణితి
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం డాన్బరిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ అండాశయం నుంచి తొలగించిన 60 కిలోల కణతి ఇది. రెండు నెలల పాటు వారానికి అసాధారణంగా 5 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నట్లు గుర్తించిన ఆమె వైద్యులను సంప్రదించడంతో అది కణతి అని తెలిసింది. దాని పరిమాణం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమె జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో ఆమెకు తక్కువ పోషకాలు ఉన్న ఆహారమిచ్చి క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా ఫిబ్రవరిలో కణతిని విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. -
8 కిలోల కణితి తొలగింపు
సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు. -
వ్యక్తిగత కేన్సర్ చికిత్స మరింత చేరువ!
కేన్సర్ వ్యాధి నిర్ధారణ మొదలుకొని వ్యాధి కణాల జన్యుక్రమం ఆధారంగా వ్యక్తిగత స్థాయిలో చికిత్స కల్పించేందుకు కూడా ఉపయోగపడే ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణితి నుంచి కొన్ని కణాలు విడిపోయి రక్తం ద్వారా శరీరం మొత్తం కలియదిరుగుతూంటాయని మనకు ఇప్పటికే తెలిసిందే. వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ (సీటీసీ) అంటారు. వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తే చికిత్స మరింత సులువు అవుతుంది. అదే సమయంలో కణితి తాలూకు కణజాలాన్ని పదేపదే సేకరించాల్సిన అవసరం ఉండదు. రక్తంలో సీటీసీల ఉనికిని గుర్తించడం ద్వారా కేన్సర్‌ను నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని లిక్విడ్ బయాప్సీ అంటారు. ఈ లిక్విడ్ బయాప్సీతో పాటు ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే సీటీసీలను మెరుగ్గా ఎదుర్కోగల మందులను ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడేలా శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని తయారుచేశారు. దీంట్లో... మిల్లీమీటర్ కంటే తక్కువ సైజున్న గొట్టాలు ఉంటాయి. సీటీసీ కణాలు ఎదిగేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ దీంట్లో ఉంటాయి. లిక్విడ్ బయాప్సీలు అందుబాటులోకి రాక మునుపు కణితి తాలూకు భాగాన్ని సేకరించడం ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగేది. అంతేకాకుండా ఒక మందు పనిచేయకపోతే ఇంకోటి.. అది కూడా విఫలమైతే మూడో రకం మందు వాడటం చికిత్స పద్ధతి!! -
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు మెదక్: మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు శనివారం ఓ మహిళ కడుపులోంచి 5కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన గడ్డం శకుంతల గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెను ఇటీవల పట్టణంలోని సాత్విక్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు పి.చంద్రశేఖర్, జయచంద్ర శస్త్రచికిత్స చేసి కణితి తొలగించారు. -
5 కిలోల కణితి తొలగింపు
స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన గంగక్క(70)కు శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు ఐదు కిలోల కణతి తొలగించారు. పది రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరగా.. కడుపులో కణతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్సకు సిద్ధం కాగా..ఆమె గుండెకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోయాయి. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నా వైద్యులు రిస్కు చేశారు. సర్జన్, అనస్తీషీయ వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ చేసిన వారిలో రిమ్స్ డెరైక్టర్ అశోక్, అనస్తీషియా వైద్యులు నరేందర్బండారి, నరేందర్‌రాథోడ్, మనోహర్, సుష్మభూషరెడ్డి, సూరజ్ ఉన్నారు. -
మహిళ మెదడులోని కణితి తొలగింపు
విశాఖ మెడికల్: అరుదైన రక్తనాళాల వాపు (ఎన్యురిజమ్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఇండస్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ టి.సురేష్ మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స వివరాలను ఆయన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం వన్నాడ గ్రామానికి చెందిన జగన్నాథమ్మ (45) నియంత్రణలో లేని రక్తపోటు, వాంతులు, తీవ్రమైన తలనొప్పితో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిందన్నారు. ఆమెను పరీక్షించగా మెదడు మధ్య భాగంలో ఉన్న రక్తనాళంలో అసాధారణ వాపు ఏర్పడి అది కణితి రూపంలో గడ్డకట్టినట్లు గుర్తించామన్నారు. ఈ కణితి చుట్టూ ఉన్న చిన్నపాటి రక్తనాళాలు మెదడులోని ముఖ్యమైన శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తాయి. వీటికి ఎటువంటి ముప్పు జరగకుండా స్కల్ బేస్, సెరిబ్రోవాస్కులర్ ప్రక్రియ ద్వారా అత్యంత చాకచక్యంగా కణితిని తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పుర్రె భాగం పక్కనుండి రంద్రంచేసి రక్తనాళ కణితిని, పక్కన ఉన్న చిన్న చిన్న రక్తనాళాలను జాగ్రత్తగా విడదీసి క్లిప్పింగ్ చేసి రక్తపోటును నియంత్రించి రక్తస్రావం జరగకుండా తొలగించామన్నారు. 8 గంటల పాటు నిర్వహించిన ఇటువంటి ఎన్యురిజమ్ సర్జరీలు గతంలో ముంబాయి, మద్రాసు వంటి నగరాలకు చికిత్సకు తరలించేవారని, ఇప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలు ఇండస్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు న్యూరో మత్తు వైద్యుడు శ్రీనివాస్ సహకరించారన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుందన్నారు. త్వరలో డిశ్చార్జి చేయనున్నామన్నారు. -
మూడు కిలోల కణితి తొలగింపు
నల్లగొండ టౌన్ః జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ల్యాండ్ ఆస్పత్రిలో మంగళవారం మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి కడులోంచి మూడు కిలోల కణితిని తొలగించారు. వేములపల్లి మండలం పుచ్చకాయలగూడేనికి చెందిన ప్రమీల కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలను నిర్వహించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి మంగళవారం డాక్టర్ సునిత, డాక్టర్ వేణు, డాక్టర్ నర్సింహ్మ, డాక్టర్ అన్సారీల బృందం ఆమెకు శస్త్ర చికిత్సను నిర్వహించి కణితిని తొలగించారు. -
పసికందు గడ్డలో మరో బిడ్డ
* గడ్డలో తల తప్ప మిగిలిన అవయవాలు * అసంపూర్తిగా ఏర్పడిన రెండో శిశువు * గుంటూరు జీజీహెచ్‌లో శస్త్రచికిత్స గుంటూరు మెడికల్: మలవిసర్జన మార్గం వద్ద గడ్డ ఉన్న పసికందుకు ఆపరేషన్ చేయగా అందులో మరో బిడ్డ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తల మినహా మిగతా శరీర అవయవాలన్నీ గడ్డలో కనిపించాయి. తల్లి గర్భంలో కవలలు రూపుదిద్దుకునే సమయంలో అసౌకర్యం వల్ల రెండో శిశువు ఏర్పడకుండా అసంపూర్తిగా నిలిచిపోయినట్లు వైద్యులు గుర్తించారు. పసికందు మలవిసర్జన మార్గం వద్దనున్న గడ్డను తొలగించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన రాధా, నాగులు దంపతులకు తొలి సంతానంగా మార్చి 30న మగశిశువు జన్మించాడు. పుట్టిన శిశువు మలవిసర్జన మార్గం వద్ద దాదాపు 1.2 కిలోల బరువు గడ్డ (ట్యూమర్) ఉంది. దీంతో బిడ్డను గుంటూరు జీజీహెచ్‌కు అదేరోజు తీసుకొచ్చారు. జీజీహెచ్ వైద్యులు సాధారణ గడ్డగా భావించి ఈ నెల 2వ తేదీన శస్త్రచికిత్స చేశారు. గడ్డకు మత్తు ఇచ్చి తొలగించే ప్రయత్నం చేయగా లోపల పూర్తిగా ఏర్పడని చెయ్యి కనిపించింది. దాంతోపాటు కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, ఇతర శరీర అవయవాలన్నీ గడ్డలో ఉన్నాయి. తల తప్ప ఇతర అవయవాలన్నీ గడ్డలో ఉండడంతో వైద్యులు ‘ఇన్‌కంప్లీట్ కన్జాయింటనల్’గా నిర్ధారించారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడే సమయంలో అసౌకర్యం కలగడంతో ఒక శిశువు మాత్రమే పూర్తిగా రూపుదిద్దుకుని రెండో శిశువు అసంపూర్తిగా ఏర్పడినట్లు పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ చందా భాస్కరరావు గురువారం చెప్పారు. సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించి పసికందు ప్రాణాలను నిలిపామని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ చందా భాస్కరరావుతోపాటు డాక్టర్లు జయపాల్, కె.నరసింహారావు, జాకీర్ పాల్గొన్నారు. ఆహార నాళం ఏర్పడని శిశువు ప్రాణాలు కాపాడారు కేవలం కిలోన్నర బరువు ఉండి, ఊపిరితిత్తుల సమస్యతో ఆహార నాళం ఏర్పడకుండా ప్రాణాపాయ స్థితిలో తమ వద్దకు వచ్చిన ఆడ శిశువు ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ చందా భాస్కరరావు చెప్పారు. తల్లి గర్భంలో పిండం ఎదిగే సమయంలో మూడు, నాలుగు వారాల మధ్య కాలంలో ఆహార నాళాలు, ఊపిరితిత్తులు ఏర్పడతాయన్నారు. ఇవి ఏర్పడే సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే ఊపిరితిత్తులు, ఆహార నాళం విడిపోకుండా అతుక్కుని పుట్టిన శిశువుకు ప్రాణాపాయం కలుగుతుందన్నారు. సకాలంలో శస్త్రచికిత్స చేస్తే పసికందు ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. -
రొమ్ములో ఏర్పడే కణతులన్నీ క్యాన్సర్లు కాదు..!
హస్తవాసి ఆంకాలజీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నాను. నేను సొంతంగా నా రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు రెండేళ్ల క్రితం నా కుడి వైపు రొమ్ములో వేరుశనగ కాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గమనించాను. ఆ కణితి చాలా నొప్పిగా ఉంటోంది. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురవుతుండడంతో పాటు చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇది రొమ్ము క్యాన్సరేమో అని చాలా భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన చూపించగలరు. - ఓ సోదరి మీ వయసులో రొమ్ములో కణితి (ఫైబ్రోడినోమా) ఏడ్పడటం సాధారణమైన సమస్య. రొమ్ములో ఏర్పడిన కణుతులు, చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్లు కావు. ఇది ఒక వ్యాధి కాదు. కేవలం బ్రెస్ట్ డెవలప్మెంట్లో జరిగే సాధారణ పరిణామం మాత్రమే. కాబట్టి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ సమస్యకు సరైన చికిత్స అవసరం. కొన్ని సాధారణ పరీక్షల ద్వారా వైద్యులు పూర్తిగా పరీక్షించి, ఆ కణితిని తొలగించాలా, వద్దా అని నిర్ధారిస్తారు. క్రమంగా కణితి పరిమాణం పెరుగుతూ ఉండటం, నొప్పి తగ్గకుండా స్థిరంగా ఉండడం, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ సూచనలు కనిపించడం, రొమ్ము క్యాన్సర్ కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో శస్త్రచికిత్స నిర్వహించి రొమ్ములోని కణితి తొలగించవలసి ఉంటుంది. కణితి పరిమాణాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా, కాదా అని వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైనా మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ గాటుతోనే సురక్షితమైన విధానం ద్వారా ఆపరేషన్ నిర్వహించవచ్చు. ఈ శస్త్ర చికిత్స జరిగిన రోజునే ఇంటికి పంపిస్తారు. రొమ్ము నుంచి కణితి తొలగించిన ప్రాంతంలో మాత్రం చిన్న మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఆ మచ్చను కూడా కనబడకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫైబ్రోడినోమా (రొమ్ములో కణితి లేదా గడ్డ)కు పూర్తి స్థాయి చికిత్స పొందడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు. -డాక్టర్ వి. హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస ్టయశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుంటే బి.పి. 170/120 అని చెప్పారు. బి.పి.కి. మందులు వాడాలి అని చెప్పారు. మందులు వాడకుంటే ఫ్యూచర్లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చా? - సుకుమార్, వెంకటాపురం ఈ వయసులో ఏ కారణం లేకుండా బి.పి. (ఎసెన్షియల్ హైపర్ టెన్షన్) రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బి.పి. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. మీరు యూరిన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్తో పాటు అవసరమైన ఇతర టెస్ట్‌లు చేయించుకొని బి.పి. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బి.పి.కి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడడమే కాకుండా ఉప్పు చాలా తగ్గించి తినాలి. క్రమం తప్పకుండా కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. మీరు ఉండాల్సిన . బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి. నా వయసు 58. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సలీమ్, గుంటూరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇతర పద్ధతులతో (ఫిజియోథెరపీ)తో నొప్పి తగ్గించుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తరచు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సుధ, భద్రాచలం చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. మా పాప వయసు ఐదేళ్లు. ప్రతిసారీ చలికాలంలో పాప ఒళ్లంతా తెల్లటి పొడల్లాంటివి వస్తన్నాయి. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఇది తిరగబెడుతుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మాకు ముందుగానే కొన్ని సూచనలు చెప్పండి. - రవికాంత్, పాడేరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎగ్జిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి, మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయే సమస్య కాదు. ముందుగా మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో సమస్య తగ్గనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
అయ్యా నాకు చనిపోవాలని ఉంది!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుని గోడు కడుపులో కణితితో నరకయాతన పలమనేరు: ‘‘అయ్యా గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. వైద్యులేమో ఎన్నో టెస్టులు చేసి తర్వాత చూస్తాంలే అని పంపేశారు. ఈ బాధ భరించలేను. కడుపులో భారీ కణితి కారణంగా ఊపిరితీసుకోలేకపోతున్నా. ఎక్కడికన్నా వెళ్లి చనిపోదామనుకుంటే మనువళ్లు వదలడం లేదు’’ అంటూ ఓ వృద్ధుడు బుధవారం మీడియాను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే.. పలమనేరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సయ్యద్‌బాషా(69)కు ఇద్దరు ఆడపిల్లలు. వారిని పెంచి పెద్దచేసి పెళ్లిచేశాడు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదిరోజుల క్రితం స్థానిక ఆస్పత్రికి వెళితే ఇక్కడి డాక్టర్లు తమవల్ల కాదంటూ తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడి ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు కడుపులో పెద్ద కణితి ఉందని గుర్తించారు. త్వరలో ఆపరేషన్ చేయాల్సింటుందని చెప్పి పంపారు. దీంతో ఆ వృద్ధుడు ఇంటికి తిరిగొచ్చాడు. అయితే గత నాలుగు రోజులుగా కడుపునొప్పి ఎక్కువై ఊపిరితీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా మనువళ్లు అడ్డుకున్నారు. దీంతో బుధవారం ఇంట్లో వాళ్లకు తెలియకుండా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని బాపూజీ పార్కు వద్ద కొంత సేపు ఒంటరిగా గడిపిన ఆయన నేరుగా మీడియా వారివద్దకొచ్చి తన గోడు వినిపించాడు. తాను నొప్పిని భరించలేకపోతున్నానని చనిపోయే మార్గం చెప్పాలంటూ రోదించాడు. ఇంతలో ఇంట్లో తాత కనిపించకపోయేసరికి మనువళ్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. మీడియా ముందు మాట్లాడుతూ ఉండగానే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్విమ్స్ వైద్యులు స్పందించి ఆ వృద్ధునికి ఆపరేషన్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.