ఇండోర్‌కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది.
చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం.
ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే..
శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్‌గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి.
కణితులు రావడానకి గల కారణాలు
- శరీరంలో పరివర్తన చెందిన బీఆర్‌సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు
- లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు
- రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా
- ధూమపానం
- బెంజీన్ వంటి టాక్సిన్స్‌కు గురికావడం
- హెచ్‌పీవీ వంటి వైరస్‌లుస
- ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు
కణితులు సంకేతాలు లేదా లక్షణాలు
⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం
⇒జ్వరం
⇒తొందరగా బరువు తగ్గడం
⇒ఆకలి లేకపోవడం
⇒రాత్రిపూట సడెన్‌గా చెమటలు పట్టడం
⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి
అన్ని రకాల కణితులు ప్రమాదకరమా?
►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి.
►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు
►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్‌నెస్‌గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment