చేపకు ఆపరేషన్ చేశారట! విడ్డూరంగా లేదూ? ఈ ఫొటోలో కనిపిస్తున్న చేప పేరు మెర్లిన్. దీని వయసు పదిహేడేళ్లు. అమెరికాకు చెందిన లూకాన్ అనే వ్యక్తి ఈ గోల్డ్ ఫిష్‌ను గత మూడేళ్లుగా తన ఆక్వేరియంలో పెంచుకుంటున్నాడు. ఇటీవల ఈ చేప ఎడమ కంటిపై వాపు వచ్చి, ఈత కొట్టలేక పోతుండటాన్ని గమనించాడు.
వెంటనే చేపను ఆసుపత్రికి తీసుకొని వెళ్తే, డాక్టర్ దానిని పరిశీలించి, చేప కంటిపై పెరిగిన కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలగించకుంటే చేప ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో, పశువైద్యుడు ఈమర్ ఓర్లీ, ఈ చేపకు ఆపరేషన్ చేసి బతికించాడు. చేపలకు మత్తుమందు ఇవ్వడం చాలా కష్టమైనా, డాక్టర్ ఓర్లీ, మత్తుమందు ఇచ్చి, సుమారు మూడు గంటల పాటు శ్రమించి, చేప కంటి మీద ఉన్న ప్రాణాంతకమైన కణితిని నేర్పుగా తొలగించారు.
తర్వాత దానికి కుట్లు వేసి, ప్రత్యేక ట్యాంకులో పరిశీలనకు ఉంచారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకొని ఆషరేషన్ చేసిన డాక్టర్‌కు సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!)
Comments
Please login to add a commentAdd a comment