gold fish
-
ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!
చేపకు ఆపరేషన్ చేశారట! విడ్డూరంగా లేదూ? ఈ ఫొటోలో కనిపిస్తున్న చేప పేరు మెర్లిన్. దీని వయసు పదిహేడేళ్లు. అమెరికాకు చెందిన లూకాన్ అనే వ్యక్తి ఈ గోల్డ్ ఫిష్‌ను గత మూడేళ్లుగా తన ఆక్వేరియంలో పెంచుకుంటున్నాడు. ఇటీవల ఈ చేప ఎడమ కంటిపై వాపు వచ్చి, ఈత కొట్టలేక పోతుండటాన్ని గమనించాడు. వెంటనే చేపను ఆసుపత్రికి తీసుకొని వెళ్తే, డాక్టర్ దానిని పరిశీలించి, చేప కంటిపై పెరిగిన కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలగించకుంటే చేప ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో, పశువైద్యుడు ఈమర్ ఓర్లీ, ఈ చేపకు ఆపరేషన్ చేసి బతికించాడు. చేపలకు మత్తుమందు ఇవ్వడం చాలా కష్టమైనా, డాక్టర్ ఓర్లీ, మత్తుమందు ఇచ్చి, సుమారు మూడు గంటల పాటు శ్రమించి, చేప కంటి మీద ఉన్న ప్రాణాంతకమైన కణితిని నేర్పుగా తొలగించారు. తర్వాత దానికి కుట్లు వేసి, ప్రత్యేక ట్యాంకులో పరిశీలనకు ఉంచారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకొని ఆషరేషన్ చేసిన డాక్టర్‌కు సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!) -
చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?
చాలా మందికి కుక్కలో, పిల్లులో, ఇతర పెంపుడు జంతువులో ఉంటాయి.. అప్పుడప్పుడూ వాటిని తీసుకుని అలా వాకింగ్‌కు వెళ్లొస్తుంటారు కూడా. మరి చేపలను పెంచుకునేవారి పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా తీసుకెళ్లడం?.. తైవాన్‌కు చెందిన హువాంగ్ జెర్రీ అనే యూట్యూబర్‌కు ఇలాంటి సందేహమే వచ్చింది. అనుకున్నదే తడవుగా తాను పెంచుకుంటున్న గోల్డ్ ఫిష్‌లతో బయటికి వెళ్లే మార్గమేమిటా అని ఆలోచించాడు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘వాకర్ ఫిష్ ట్యాంక్’ను తయారు చేసేశాడు. ఇదేదో అల్లాటప్పా ‘వాకర్ ఫిష్‌ట్యాంక్’ కాదు.. మంచి దృఢంగా ఉండే ఆక్రిలిక్ ఫైబర్ గాజు, గట్టి ఉక్కు మెటీరియల్‌తో రూపొందించాడు. చేపలకు ఆహారం వేసేందుకు ఏర్పాటు చేశాడు. ట్యాంకులోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే చిన్నపాటి ఫిల్టర్‌ను.. నీటిలో ఆక్సిజన్ సరిగా ఉండేందుకు.. గాలిని పంపే ఎయిర్‌పంప్‌ను అమర్చాడు. ఇవి నడిచేందుకు ఓ బ్యాటరీని అనుసంధానించాడు. ఇంకేం.. నీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికైనా, ఎంతసేపైనా ‘ఫిష్’తో వాకింగ్‌కు వెళ్లొచ్చన్నమాట. హువాంగ్ ఇలా తన చేపలతో వాకింగ్‌కు వెళితే.. జనమంతా కళ్లప్పగించి చిత్రంగా చూశారట. ఇటీవల యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తినేందుకు వాడేస్తున్నారట.. ఇంతకుముందు జపాన్‌కు చెందిన ఎంఏ కార్పొరేషన్స్ చేసిన ‘పోర్టబుల్ ఫిష్ ట్యాంక్’ ఇది. ఎక్కడికైనా అలా చేతిలో పట్టుకుని వెళ్లిపోయేలా దీనిని రూపొందించారు. ట్యాంక్‌లోని నీళ్లలో ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించే ఏర్పాటూ ఉంది. అయితే దీన్ని చేపలు పెంచుకునేవారితోపాటు.. చేపలు, పీతలు వంటివి ఫ్రెష్‌గా తినాలనుకునేవారు వాటిని తెచ్చిపెట్టుకునేందుకు ఈ ట్యాంక్‌ను వాడేస్తున్నారట. -
కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
విశ్వాసానికి మారుపేరు శునకం. అందుకే ఎక్కువ మంది తమ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్బీఏ మాజీ ఆటగాడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ బుజ్జి శునకం.. నేల మీద ఉన్న గోల్డ్‌ఫిష్‌లను నీటితో నిండి ఉన్న గిన్నెలో వేసింది. అంతేకాదు వాటికి ఏమాత్రం హాని చేయకుండా... ఎంతో జాగ్రత్తగా నోటితో ఒడిసి పట్టుకుని నీళ్లలోకి జారవిడిచింది. ఇక ఈ క్యూట్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైకులు కొడుతూనే.. ఆ చేపలు కింద ఎలా పడ్డాయి.. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి కుక్క కంటే ముందే వాటిని ఎందుకు రక్షించలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. (నెమలి సోయగం.. అద్భుతమైన వీడియో!) లాక్డౌన్లో ఈ కుక్క ఏం చేసిందో తెలుసా? -
కమాండో అర్జున్ పండిట్
మైనస్ పది డిగ్రీల చలిలో దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఎన్.ఎస్.జీ కమాండో అర్జున్ పండిట్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కోసం కష్టపడుతున్నారు. మరి.. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు? అనేది వెండితెరపై తెలుస్తుంది. ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ ముఖ్య తారలుగా ‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్, ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రానా విడుదల చేశారు. అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జీ కమాండోగా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం మైనస్ పది డిగ్రీల చలిలో షూటింగ్ జరుపుతున్నాం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ ఇది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
ఆక్వా ఉత్పత్తుల్లో భారత్‌కు రెండో స్థానం
లబ్బీపేట : ఆక్వా ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ గణనీయమైన అభివృద్ధి సాధించిందని నెక్స్ జెన్ మేనేజింగ్ డెరైక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం తెలి పారు. అక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న దీపక్ నెక్స్ జెన్ ఫీట్స్ కంపెనీ ఫిష్ గోల్డ్ పేరుతో చేపల మేతను మంగళవారం లాంఛనంగా ఆవిష్కరించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో జరిగిన కార్యక్రమంలో వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చేపలకు నాణ్యమైన మేతను అందించే కృత నిశ్చయంతో తమ కంపెనీ ఉందన్నారు. మూడేళ్లక్రితం 25 వేల టన్నుల సామర్థ్యం నుంచి నేడు 80 వేల టన్నుల అమ్మకాలకు వృద్ధి చెందామని చెప్పారు. రొయ్యల మేత పరిశ్రమను త్వరలో ప్రారంభించనున్నామని వివరించారు. కంపెనీ డెరైక్టర్లు డాక్టర్ డి. మల్లేశ్వరరావు, కేబీ సత్యనారాయణ, శ్రీనివాసరావు, డీలర్లు పాల్గొన్నారు. -
నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే
బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న ఈ భారీ చేప నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు మరి! 28 కిలోల బరువున్న ఈ చేపను కచిడీలంటారు. వీటిలో మగ కచిడీలు బంగారు వర్ణంతో ఉంటాయి. ఈ చిత్రంలో ఉన్నది మగ కచిడీయే. శనివారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు చిక్కుకుంది. ఔషధాలకు వాడే ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో రూ.లక్షకు పాడుకున్నాడు. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారన్నారు. ఈ చేప పొట్ట భాగం విలువే రూ.85 వేల వరకు ఉంటుందన్నారు. - సఖినేటిపల్లి -
ఈతకొలనులో బంగారు చేప
అంగవైకల్యాన్ని జయించిన నటాలీ నూడుల్ అని ముద్దుగా పిలుచుకునే 30 ఏళ్ల దక్షిణాఫ్రికా స్విమ్మర్ నటాలీ డూ టాయ్ట్ ఈతకొలనులో బంగారు చేప. అంతర్జాతీయంగా 21 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించింది. అయితే ఈమె అంగవైకల్యాన్ని జయించి మరీ ఈ పతకాలు సాధించడం విశేషం. 14 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో ఎడమ కాలిని కోల్పోయినా తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంతర్జాతీయ స్విమ్మర్‌గా రాణించాలన్న కసితో స్విమ్మింగ్‌లో సాధన చేసింది. ఫలితంగా 2002 కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. 2002, 06, 10 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం ఏడు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. పారా ఒలింపిక్స్లోనైతే నటాలీకి తిరుగే లేదు. 2004లో ఏథెన్స్లో 5.. 2008లో బీజింగ్‌లో 5.. 2012లో లండన్‌లో 3 బంగారు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. అంతేకాదు.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు పారా ఒలింపియన్లలో నటాలీ ఒకరు. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టయిల్, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో రాణించగల సత్తా ఆమె సొంతం. చిన్ననాటి నుంచే... దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జన్మించిన నటాలీకి చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండటంతో అనతికాలంలోనే ఈతకొలనులో బంగారు చేపలా తయారైంది. 14 ఏళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నటాలీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి స్కూలుకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. స్కూటర్‌పై వెళ్తున్న నటాలీని వెనక నుంచి వచ్చిన కారు గట్టిగా ఢీకొట్టింది. 2001లో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆమె ఎడమకాలిని దాదాపుగా మోకాలి వరకు తీసేశారు. అయితే కాలు పోయిందన్న బాధను దిగమింగి.. తన స్విమ్మింగ్ భవిష్యత్తుపై దృష్టిపెట్టింది. 2002 కామన్వెల్త్ గేమ్సే లక్ష్యంగా సాధన చేసింది. మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్గేమ్స్తో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న నటాలీ ఇక వెనుదిరిగి చూడలేదు.