నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే | It is really gold fish | Sakshi
Sakshi News home page

నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే

Published Sun, Mar 29 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే

నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే

బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న ఈ భారీ చేప నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు మరి!  28 కిలోల బరువున్న  ఈ చేపను కచిడీలంటారు. వీటిలో మగ కచిడీలు బంగారు వర్ణంతో ఉంటాయి. ఈ చిత్రంలో ఉన్నది మగ కచిడీయే. శనివారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు చిక్కుకుంది. ఔషధాలకు వాడే ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో రూ.లక్షకు పాడుకున్నాడు. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారన్నారు. ఈ చేప పొట్ట భాగం విలువే రూ.85 వేల వరకు ఉంటుందన్నారు.
 - సఖినేటిపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement