
చేపల వలలో చిక్కుకున్న కొండ చిలువ
సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ సమీపంలోని సిద్ధాపురం చెరువులో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన మత్స్యకారులు సిద్ధాపురం చెరువులో చేపలు పడుతున్నారు. ఇందులో భాగంగా వల వేశారు. ఇందులో భారీ కొండ చిలువ చిక్కుకుంది. దీన్ని గమనించిన మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని వల నుంచి కొండచిలువను బయటకు తీసి నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. (పులస @ రూ.21 వేలు)