fishermen net
-
చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ సమీపంలోని సిద్ధాపురం చెరువులో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన మత్స్యకారులు సిద్ధాపురం చెరువులో చేపలు పడుతున్నారు. ఇందులో భాగంగా వల వేశారు. ఇందులో భారీ కొండ చిలువ చిక్కుకుంది. దీన్ని గమనించిన మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని వల నుంచి కొండచిలువను బయటకు తీసి నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. (పులస @ రూ.21 వేలు) -
నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే
బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న ఈ భారీ చేప నిజంగా ‘గోల్డ్’ ఫిష్షే. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు మరి! 28 కిలోల బరువున్న ఈ చేపను కచిడీలంటారు. వీటిలో మగ కచిడీలు బంగారు వర్ణంతో ఉంటాయి. ఈ చిత్రంలో ఉన్నది మగ కచిడీయే. శనివారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు చిక్కుకుంది. ఔషధాలకు వాడే ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో రూ.లక్షకు పాడుకున్నాడు. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారన్నారు. ఈ చేప పొట్ట భాగం విలువే రూ.85 వేల వరకు ఉంటుందన్నారు. - సఖినేటిపల్లి