కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. | Cute Video Of Dog Saving Goldfish Goes Viral Twitter | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: గోల్డ్‌ఫిష్‌లను కాపాడిన కుక్క!

Published Tue, May 5 2020 5:13 PM | Last Updated on Tue, May 5 2020 5:31 PM

Cute Video Of Dog Saving Goldfish Goes Viral Twitter - Sakshi

విశ్వాసానికి మారుపేరు శునకం. అందుకే ఎక్కువ మంది తమ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్‌బీఏ మాజీ ఆటగాడు రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ బుజ్జి శునకం.. నేల మీద ఉన్న గోల్డ్‌ఫిష్‌లను నీటితో నిండి ఉన్న గిన్నెలో వేసింది. అంతేకాదు వాటికి ఏమాత్రం హాని చేయకుండా... ఎంతో జాగ్రత్తగా నోటితో ఒడిసి పట్టుకుని నీళ్లలోకి జారవిడిచింది. ఇక ఈ క్యూట్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైకులు కొడుతూనే.. ఆ చేపలు కింద ఎలా పడ్డాయి.. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి కుక్క కంటే ముందే వాటిని ఎందుకు రక్షించలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. (నెమలి సోయగం.. అద్భుతమైన వీడియో!)

లాక్‌డౌన్‌లో ఈ కుక్క ఏం చేసిందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement