లబ్బీపేట : ఆక్వా ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ గణనీయమైన అభివృద్ధి సాధించిందని నెక్స్ జెన్ మేనేజింగ్ డెరైక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం తెలి పారు. అక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న దీపక్ నెక్స్ జెన్ ఫీట్స్ కంపెనీ ఫిష్ గోల్డ్ పేరుతో చేపల మేతను మంగళవారం లాంఛనంగా ఆవిష్కరించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో జరిగిన కార్యక్రమంలో వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చేపలకు నాణ్యమైన మేతను అందించే కృత నిశ్చయంతో తమ కంపెనీ ఉందన్నారు.
మూడేళ్లక్రితం 25 వేల టన్నుల సామర్థ్యం నుంచి నేడు 80 వేల టన్నుల అమ్మకాలకు వృద్ధి చెందామని చెప్పారు. రొయ్యల మేత పరిశ్రమను త్వరలో ప్రారంభించనున్నామని వివరించారు. కంపెనీ డెరైక్టర్లు డాక్టర్ డి. మల్లేశ్వరరావు, కేబీ సత్యనారాయణ, శ్రీనివాసరావు, డీలర్లు పాల్గొన్నారు.
ఆక్వా ఉత్పత్తుల్లో భారత్‌కు రెండో స్థానం
Published Wed, Aug 26 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement