Aqua industry
-
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్‌వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్‌పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్‌హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
ఆక్వా పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు : మంత్రి సీదిరి అప్పలరాజు
-
సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు ఇవే!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సేంద్రియ ఆక్వాపాలసీ తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. మితిమీరిన రసాయనిక ఎరువుల వినియోగం వల్ల భూమి నిస్సారమవడంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రజల ఆరోగ్యాల మీద ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సేంద్రియ సాగు కోసం ఒక విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం ఆక్వాకల్చర్‌లో కూడా సేంద్రియ పద్ధతిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫామింగ్ (ఏఐఎఫ్వోఎఫ్) ఆమోదంతో 2007లో బ్లూయూ సంస్థ ద్వారా మన రాష్ట్రంలో సేంద్రియ ఆక్వాసాగుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకారం చుట్టినా ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రోత్సాçహం లభించలేదు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియసాగును ప్రోత్సహించేందుకు ఒక విధానాన్ని తీసుకొస్తోంది. మోతాదుకు మించి యాంటిబయోటిక్స్.. రాష్ట్రంలో 2010–11లో 14.23 లక్షల టన్నులున్న ఆక్వా ఉత్పత్తులు 2020–21లో ఏకంగా 46.23 లక్షల టన్నులకు పెరిగాయి. సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపవగా రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి ఏకంగా 15 రెట్లు పెరిగాయి. అధికోత్పత్తే లక్ష్యంగా మోతాదుకుమించి యాంటిబయోటిక్స్, ఎరువులు, సింథటిక్, పురుగుమందులు వినియోగించడం, టన్ను ఉత్పత్తి కోసం 3 టన్నుల వైల్డ్ఫిష్ను మేతగా వినియోగించంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఏటా పుట్టుకొస్తున్న వైరస్లు, వ్యాధులు పెట్టుబడులను పెంచేస్తున్నాయి. దేశీయ ఆక్వా ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మోతాదుకు మించి ఉంటున్నాయనే సాకుతో చైనా, యూరోపియన్ దేశాలు తరచు వెనక్కి పంపుతుండడం ఎగుమతులపైన, ఆర్థిక వ్యవçస్థపైన ప్రభావం చూపుతోంది. చివరికి రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఎగుమతులకు అనువుగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలంటే సేంద్రియ సాగే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం నిర్ణయించింది. సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు సేంద్రియ పద్ధతుల్లో ఆక్వాసాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం. యాంటిబయోటిక్స్, హార్మోన్స్ వాడకుండా ప్రభుత్వం గుర్తించిన సంస్థల ద్వారా సేంద్రియ పద్ధతుల్లో తయారుచేసిన, జన్యుమార్పిడి లేని çసర్టిఫైడ్ సీడ్, ఫీడ్‌ను రైతులకు అందించడం. సహజమైన పద్ధతుల్లోనే చెరువుల నిర్వహించడం. పర్యావరణానికి హానిలేనివిధంగా నీటిమార్పిడి విధానం అవలంభించడం. సాగులో రసాయన ఎరువులు, పురుగుమందులు, సింథటిక్ మందుల వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం. చేపలు, రొయ్యలను దశల వారీగా పట్టుబడి పట్టి సేంద్రియ పద్ధతుల్లోనే శుద్ధిచేసి ప్యాకింగ్ చేయడం. గుర్తించిన ఏజెన్సీల ద్వారా సర్టిఫై చేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావడం, విదేశాలకు ఎగుమతిచేయడం. సేంద్రియంతో ఖర్చు తగ్గుతుంది ఆక్వాసాగులో ఎక్కడా యాంటిబయోటిక్స్ వాడటం లేదు. ఎకరాకు 1,500 చేపలు, 50 వేల రొయ్యలు వేస్తాం. చేపలకు తవుడు పర్మంటేషన్ చేసి ఇస్తాం. రొయ్యలకు సోయా లేదా పాలికల్చర్ మేత అందిస్తాం. 10 రోజులకోసారి కాకరకాయ జ్యూస్ ఇస్తాం. చేపకు శంకుజలగ వంటి జబ్బులు రావు. రొయ్యల్లో వెబ్రియో కూడా కంట్రోల్ అవుతుంది. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తే ఖర్చు బాగా తగ్గుతుంది. సబ్సిడీపై ఆర్గానిక్ సర్టిఫైడ్ సోయా అందిస్తే మంచి ఫలితాలొస్తాయి. – ఎ.ఫణికుమార్, ఆక్వారైతు, చిన్నపులేరు, పశ్చిమగోదావరి వ్యాధులను తట్టుకుంటున్నాయి నేను 40 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగుచేస్తున్నా. మార్కెట్లో లభించే మేత వాడుతున్నప్పటికీ ఎక్కడా యాంటిబయోటిక్స్, కెమికల్స్ వాడడం లేదు. దేశీయ మేలుజాతి గో మూత్రంతో తయారుచేసిన జీవామృతం, ద్రవజీవామృతం వాడుతున్నా. వ్యాధులను తట్టుకుంటున్నాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. సర్టిఫైడ్ ఆర్గానిక్ సీడ్, ఫీడ్ అందిస్తే మంచి ఫలితాలొస్తాయి. – శ్రీహరిరాజు, పటవల, తూర్పుగోదావరి సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే.. ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలో తీసుకొస్తున్న సేంద్రియ పాలసీలో భాగంగా సర్టిఫికేషన్ చేసిన ముడిసరుకు తయారీ, సాగువిధానం, గిట్టుబాటు ధర కల్పన, మార్కెటింగ్, ఎగుమతుల కోసం విధివిధానాలు రూపొందించేందుకు నిపుణులు, మేధావుల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. – ఎస్.అంజలి, అదనపు డైరెక్టర్, మత్స్యశాఖ -
లాక్డౌన్: 50 శాతం కూలి అదనం
సాక్షి, కాకినాడ: ఆక్వా పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ‘కోవిడ్–19’ వైరస్ దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. లాక్డౌన్ కారణంగా పది రోజులుగా స్తంభించిన రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనుమతులు మంజూరు చేసింది. కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళుతోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చించారు. ప్రస్తుతం కూలీలకు ఇస్తున్న కూలి కంటే 50 శాతం అదనంగా అందించాలని సూచించారు. అందుకు ఆయా యూనిట్ల యాజమాన్యాలు అంగీకరించాయి. పనులు చేస్తున్న చోటే కూలీలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చూపిన చొరవతో ఐదు రోజులుగా ఆక్వా ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. వాటిని ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు కొనుగోలు చేసి భద్రపరుస్తున్నాయి. ప్రొసెసింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎగుమతులు ప్రారంభిస్తారు. ఏం జరిగిందంటే.. కరోనా ప్రకంపనలు జిల్లాలోని ఆక్వా ఉత్పత్తులకు తాకడంతో నెలన్నర రోజులుగా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో పది రోజులుగా మరింత దారుణంగా మారింది. డిసెంబర్లో వచ్చే పంటతో లాభాలు ఆర్జించవచ్చని గంపెడాశలు పెట్టుకున్న సాగుదారులకు ఈ సంక్షోభం కన్నీళ్లు మిగిల్చింది. ధరల పతనానికి తోడు.. ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడడంతో చెరువుల్లోని రొయ్యల పట్టుబడి చేయలేని స్థితి నెలకొంది. దీనికితోడు దళారులు దీన్ని బూచిగా చూపిస్తూ మరింత ప్రతిష్టంభన సృష్టించారు. దీంతో ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య కొట్టుమిట్టాడింది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దాదాపు 25 వేల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. ప్రాసెసింగ్ కంపెనీల నుంచి కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. భారతదేశం నుంచి యూఎస్ఏ, ఈయూ, చైనా, జపాన్ వంటి దేశాలకు లక్షల మెట్రిక్ టన్నుల్లో సరుకు ఎగుమతి అవుతోంది. ఇందులో అత్యధికంగా యూఎస్ఏకు 41 శాతం ఉండగా.. తర్వాత చైనా దేశానికి 23 శాతం మేర సరుకు రవాణా అవుతోంది. తర్వాత జపాన్ 16, ఈయూకు 10 శాతం ఎగుమతి అవుతోంది. జిల్లా నుంచి ఏటా 1.20 లక్షల నుంచి రూ.1.35 మెట్రిక్ టన్నుల వరకూ సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. రూ.3,900 కోట్ల వ్యాపారం సాగుతోంది. నెల రోజులుగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షల మెట్రిక్ టన్నుల సరుకు గోదాములకే పరిమితమైంది. స్థానికంగా గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడుతుంటే.. ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులకు ఆశించిన ధర చెల్లించలేని పరిస్థితిలో ఎగుమతిదారులు ఉన్నారు. ఎకరాకు రూ.7 లక్షలకు పైనే పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. మంత్రి కన్నబాబు చొరవతో.. ఆక్వా రైతుల దీనావస్థను స్వయంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. సీఎం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం స్పందించారు. ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ కరప మండలంలో ఉన్న రొయ్యల ప్రొసెసింగ్ యూనిట్లను సందర్శించారు. యూనిట్లు తెరచి పనులు చేపట్టాలని సూచించారు. కూలీల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆక్వా కేంద్రం వద్ద ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. పనులు చేసే ప్రాంతంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం పాటించాలని, కారి్మకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. -
ఆక్వారైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-
ఆక్వా ఉత్పత్తుల్లో భారత్‌కు రెండో స్థానం
లబ్బీపేట : ఆక్వా ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ గణనీయమైన అభివృద్ధి సాధించిందని నెక్స్ జెన్ మేనేజింగ్ డెరైక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం తెలి పారు. అక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న దీపక్ నెక్స్ జెన్ ఫీట్స్ కంపెనీ ఫిష్ గోల్డ్ పేరుతో చేపల మేతను మంగళవారం లాంఛనంగా ఆవిష్కరించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో జరిగిన కార్యక్రమంలో వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చేపలకు నాణ్యమైన మేతను అందించే కృత నిశ్చయంతో తమ కంపెనీ ఉందన్నారు. మూడేళ్లక్రితం 25 వేల టన్నుల సామర్థ్యం నుంచి నేడు 80 వేల టన్నుల అమ్మకాలకు వృద్ధి చెందామని చెప్పారు. రొయ్యల మేత పరిశ్రమను త్వరలో ప్రారంభించనున్నామని వివరించారు. కంపెనీ డెరైక్టర్లు డాక్టర్ డి. మల్లేశ్వరరావు, కేబీ సత్యనారాయణ, శ్రీనివాసరావు, డీలర్లు పాల్గొన్నారు.