మెరిడియన్‌కు చెందిన ఓ మధ్యవయసు మహిళ శరీరం నుంచి 50 పౌండ్ల కణితిని తొలగించారు. వివరాలు.. బ్రెండా కిడ్‌లాండ్ అనే మహిళ ఈ మధ్యకాలంలో విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించింది. మోనోపాజ్ స్టేజ్‌లో ఉన్నా కదా కాబట్టి బరువు పెరగడం చాలా సాధరణమే అని భావించింది. ఇక ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత కొద్ది నెలలుగా బ్రెండా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దాంతో డాక్టర్‌ను కలిసింది. వైద్య పరీక్షల్లో భాగంగా బ్రెండాకు సీఏటీ స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ చూసి ఆశ్యర్యపోవడం డాక్టర్ల వంతయ్యింది.
బ్రెండా శరీరంలో దాదాపు 50 పౌండ్ల(సుమారు 23 కిలోగ్రాములు) కణితి ఉన్నట్లు స్కానింగ్‌లో తెలీంది. ఇంత భారీగా పెరిగిన కణితి ఆమె శరీరంలోని మిగతా అవయవాలను అడ్డుకోవడమే కాక మెదడుకు రక్త ప్రసరణ కాకుండా నిరోధిస్తుందని వైద్యులు తెలిపారు. అనంతరం డాక్టర్లు దాదాపు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితిని తొలగించారు.
సర్జరీ అనంతరం బ్రెండా మాట్లాడుతూ.. ‘కణితిని తొలగించిన తరువాత నేను దాదాపు 65 పౌండ్ల బరువు తగ్గాను. దీని వల్ల నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. మన శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమైనా తేడా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. నా కథ మిగతా ఆడవారందరికి ఒక ఉదాహరణగా నిలవాల’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment