CAT scan
-
మహిళ శరీరంలో 50 పౌండ్ల కణితి
మెరిడియన్‌కు చెందిన ఓ మధ్యవయసు మహిళ శరీరం నుంచి 50 పౌండ్ల కణితిని తొలగించారు. వివరాలు.. బ్రెండా కిడ్‌లాండ్ అనే మహిళ ఈ మధ్యకాలంలో విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించింది. మోనోపాజ్ స్టేజ్‌లో ఉన్నా కదా కాబట్టి బరువు పెరగడం చాలా సాధరణమే అని భావించింది. ఇక ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత కొద్ది నెలలుగా బ్రెండా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దాంతో డాక్టర్‌ను కలిసింది. వైద్య పరీక్షల్లో భాగంగా బ్రెండాకు సీఏటీ స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ చూసి ఆశ్యర్యపోవడం డాక్టర్ల వంతయ్యింది. బ్రెండా శరీరంలో దాదాపు 50 పౌండ్ల(సుమారు 23 కిలోగ్రాములు) కణితి ఉన్నట్లు స్కానింగ్‌లో తెలీంది. ఇంత భారీగా పెరిగిన కణితి ఆమె శరీరంలోని మిగతా అవయవాలను అడ్డుకోవడమే కాక మెదడుకు రక్త ప్రసరణ కాకుండా నిరోధిస్తుందని వైద్యులు తెలిపారు. అనంతరం డాక్టర్లు దాదాపు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితిని తొలగించారు. సర్జరీ అనంతరం బ్రెండా మాట్లాడుతూ.. ‘కణితిని తొలగించిన తరువాత నేను దాదాపు 65 పౌండ్ల బరువు తగ్గాను. దీని వల్ల నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. మన శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమైనా తేడా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. నా కథ మిగతా ఆడవారందరికి ఒక ఉదాహరణగా నిలవాల’ని తెలిపారు. -
రెండోసారి పక్షవాతాన్ని నివారించుకోండి
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా దగ్గరి బంధువుల్లో ఒకరి వయసు 47. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోందని గొడవపెడ్తున్నాడు. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్ని నివారించలేమా? - అరవింద్‌కుమార్, దిల్సుఖ్నగర్ అకస్మాత్తుగా కలిగే పరిణామం ఏదైనా సరే... అంటే మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... ఇవన్నీ పక్షవాత లక్షణాలే. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. నా వయసు 35. నాకు గత 16 ఏళ్లుగా ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అది నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాడి వయసు ఎనిమిదేళ్లు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్యా? నాకు తగిన సలహా ఇవ్వండి. - వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ అనేది కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖరరెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదారాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించినదా, కాదా అని నిర్ధారణ చేసే ‘సీటీ స్కాన్’ అందుబాటులోకి వచ్చిందని నా మిత్రుడొకరు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? - విశాల్, హైదరాబాద్ గుండెకు సంబంధించిన రక్తనాళాలనూ, వాటిలోని అడ్డంకులను గుర్తించడానికి గత ఐదేళ్లుగా ‘కొరనరీ సీటీ యాంజియోగ్రామ్’ (సీటీఏ) అనే పరికరం అందుబాటు లోకి వచ్చిన మాట వాస్తవం. కానీ ఇది ప్రతి చిన్న ఛాతీనొప్పికీ చేయించుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని కొన్ని వందల ఎక్స్-రేలు తీయించుకున్నదా నితో సమానమైన రేడియేషన్‌కు గురిచేస్తుంది. ఇటీవలే రేడియేషన్ పాళ్లను తగ్గించే స్కాన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇంకా అన్ని రకాల ఛాతి నొప్పిలకూ వాడ టానికి డాక్టర్లు వీటిని సిఫార్సు చేయరు. ఎవరికైతే గుండె జబ్బు తాలూకు రిస్క్‌ఫాక్టర్లు కనిపిస్తూ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా ఉంటే వారికి మాత్రమే ‘డాక్టర్ సలహా మేరకు మాత్రమే’ ఆ పరీక్షలు చేయించు కోవాలి. ఎవరిలోనైతే సాధారణ ఈసీజీ, ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలతో గుండెపోటు ఉందని నిర్ధారణ జరుగు తుందో వారికి కూడా సీటీఏ పరీక్ష అనవసరం. ఎందు కంటే వారికి చేతి ద్వారా చేసే యాంజియోగ్రామ్ ఎలా గూ అవసరమవుతుంది. కాకపోతే కొందరిలో అప్పటిక ప్పుడే స్టెంటింగ్ (అడ్డంకులను నివారించే ప్రక్రియ) చేసి, ఒకే సిట్టింగ్‌లో రక్తనాళాలను నార్మల్ చేసేందుకు గల అవకాశాలను నిర్ధారణ చేయడంలో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించాల్సి రావచ్చు. నాకు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. నేనెప్పుడు బీపీ పరీక్ష చేయించుకోడానికి వెళ్లినా నా బీపీ నార్మల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నా వయసు కేవలం 35 మాత్రమే. నేను ఇలాగే మందులు వాడాల్సిందేనా లేదా మానవచ్చా? వివరించగలరు. - వినోద్, కరీంనగర్ ఎవరికైనా హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉందని నిర్ధారణ అయ్యా వారికి బీపీ ఎంతగా పెరిగిందో దాన్ని బట్టి డాక్టర్లు మందును, మోతాదును నిర్ధారణ చేస్తారు. బీపీ నార్మల్ కంటే ఎక్కువగా ఉందని గుర్తించిన తొలిదశల్లో నడక, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలి ప్రక్రియలతో బీపీ నార్మల్ అవుతుందా లేదా అని కొద్ది వారాల పాటు పరీక్షించి చూస్తారు. కానీ ఇంకా తగ్గ కుండా బీపీ అధికంగానే ఉంటుంటే (అంటే 160 / 100 కంటే ఎక్కువగా) మందులు వాడమనే రోగికి డాక్టర్లు సలహా ఇస్తారు. సాధారణంగా ఒకసారి బీపీ మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత బీపీ హెచ్చుతగ్గులను బట్టి మందు మోతాదులను మారుస్తూ, అది ఒకేలా ఉండేలా చూస్తారు డాక్టర్లు. అంతేగానీ... బీపీ నార్మల్‌గా ఉందని మందులు మానడం సరికాదు. బీపీ పెరిగిందా లేక తగ్గిందా లేక స్థిరంగా ఉందా అన్న విషయం తెలుసు కోడానికి క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్ష చేయించుకోడాలి. మీకు మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకపోతే అవి ఎప్పుడూ వాడటమే శ్రేయస్కరం. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్