ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించినదా, కాదా అని నిర్ధారణ చేసే ‘సీటీ స్కాన్’ అందుబాటులోకి వచ్చిందని నా మిత్రుడొకరు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం?
- విశాల్, హైదరాబాద్
గుండెకు సంబంధించిన రక్తనాళాలనూ, వాటిలోని అడ్డంకులను గుర్తించడానికి గత ఐదేళ్లుగా ‘కొరనరీ సీటీ యాంజియోగ్రామ్’ (సీటీఏ) అనే పరికరం అందుబాటు లోకి వచ్చిన మాట వాస్తవం. కానీ ఇది ప్రతి చిన్న ఛాతీనొప్పికీ చేయించుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని కొన్ని వందల ఎక్స్-రేలు తీయించుకున్నదా నితో సమానమైన రేడియేషన్‌కు గురిచేస్తుంది. ఇటీవలే రేడియేషన్ పాళ్లను తగ్గించే స్కాన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇంకా అన్ని రకాల ఛాతి నొప్పిలకూ వాడ టానికి డాక్టర్లు వీటిని సిఫార్సు చేయరు. ఎవరికైతే గుండె జబ్బు తాలూకు రిస్క్‌ఫాక్టర్లు కనిపిస్తూ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా ఉంటే వారికి మాత్రమే ‘డాక్టర్ సలహా మేరకు మాత్రమే’ ఆ పరీక్షలు చేయించు కోవాలి.
ఎవరిలోనైతే సాధారణ ఈసీజీ, ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలతో గుండెపోటు ఉందని నిర్ధారణ జరుగు తుందో వారికి కూడా సీటీఏ పరీక్ష అనవసరం. ఎందు కంటే వారికి చేతి ద్వారా చేసే యాంజియోగ్రామ్ ఎలా గూ అవసరమవుతుంది. కాకపోతే కొందరిలో అప్పటిక ప్పుడే స్టెంటింగ్ (అడ్డంకులను నివారించే ప్రక్రియ) చేసి, ఒకే సిట్టింగ్‌లో రక్తనాళాలను నార్మల్ చేసేందుకు గల అవకాశాలను నిర్ధారణ చేయడంలో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించాల్సి రావచ్చు.
నాకు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. నేనెప్పుడు బీపీ పరీక్ష చేయించుకోడానికి వెళ్లినా నా బీపీ నార్మల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నా వయసు కేవలం 35 మాత్రమే. నేను ఇలాగే మందులు వాడాల్సిందేనా లేదా మానవచ్చా? వివరించగలరు.
- వినోద్, కరీంనగర్
ఎవరికైనా హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉందని నిర్ధారణ అయ్యా వారికి బీపీ ఎంతగా పెరిగిందో దాన్ని బట్టి డాక్టర్లు మందును, మోతాదును నిర్ధారణ చేస్తారు. బీపీ నార్మల్ కంటే ఎక్కువగా ఉందని గుర్తించిన తొలిదశల్లో నడక, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలి ప్రక్రియలతో బీపీ నార్మల్ అవుతుందా లేదా అని కొద్ది వారాల పాటు పరీక్షించి చూస్తారు. కానీ ఇంకా తగ్గ కుండా బీపీ అధికంగానే ఉంటుంటే (అంటే 160 / 100 కంటే ఎక్కువగా) మందులు వాడమనే రోగికి డాక్టర్లు సలహా ఇస్తారు. సాధారణంగా ఒకసారి బీపీ మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత బీపీ హెచ్చుతగ్గులను బట్టి మందు మోతాదులను మారుస్తూ, అది ఒకేలా ఉండేలా చూస్తారు డాక్టర్లు. అంతేగానీ... బీపీ నార్మల్‌గా ఉందని మందులు మానడం సరికాదు. బీపీ పెరిగిందా లేక తగ్గిందా లేక స్థిరంగా ఉందా అన్న విషయం తెలుసు కోడానికి క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్ష చేయించుకోడాలి. మీకు మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకపోతే అవి ఎప్పుడూ వాడటమే శ్రేయస్కరం.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Mon, Jun 22 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement
Advertisement