సాక్షి, రాయికోడ్(అందోల్): ‘‘సార్.. నా రెండేళ్ల చిన్నారికి గొంతు చుట్టూ కణితి ఏర్పడి బాధపడుతోంది.. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత లేదు.. ఆర్థిక సాయం చేయండి ప్లీజ్’’అని చిన్నారి తండ్రి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు.
వివరాలు.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ (2)కు ఏడాదిన్నర క్రితం గొంతు వద్ద చిన్న కణితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ఆర్థికస్థోమత లేక ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుండగా మిత్రుడి సూచన మేరకు అతడి ట్విట్టర్ నుంచి బుధవారం మంత్రి కేటీఆర్‌కు విషయం వివరించాడు. ''శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండి.. ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారని'' కేటీఆర్ కార్యాలయం అధికారులు సూచించినట్లు అవినాష్ తెలిపాడు.
చదవండి: కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి
I was in pain just looking at the photo of the child. Wonder how she is holding up 🙏
— KTR (@KTRTRS) June 10, 2021
Will personally handle the issue and get the little one best medical care. Thanks for bringing this to my attention @KTRoffice please coordinate https://t.co/FAiDd14OLP
Comments
Please login to add a commentAdd a comment