raikode mandal
-
'మా చిన్నారి ఆపరేషన్‌కు స్థోమత లేదు'.. కేటీఆర్ స్పందన
సాక్షి, రాయికోడ్(అందోల్): ‘‘సార్.. నా రెండేళ్ల చిన్నారికి గొంతు చుట్టూ కణితి ఏర్పడి బాధపడుతోంది.. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత లేదు.. ఆర్థిక సాయం చేయండి ప్లీజ్’’అని చిన్నారి తండ్రి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ (2)కు ఏడాదిన్నర క్రితం గొంతు వద్ద చిన్న కణితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ఆర్థికస్థోమత లేక ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుండగా మిత్రుడి సూచన మేరకు అతడి ట్విట్టర్ నుంచి బుధవారం మంత్రి కేటీఆర్‌కు విషయం వివరించాడు. ''శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండి.. ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారని'' కేటీఆర్ కార్యాలయం అధికారులు సూచించినట్లు అవినాష్ తెలిపాడు. చదవండి: కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి I was in pain just looking at the photo of the child. Wonder how she is holding up 🙏 Will personally handle the issue and get the little one best medical care. Thanks for bringing this to my attention @KTRoffice please coordinate https://t.co/FAiDd14OLP — KTR (@KTRTRS) June 10, 2021 -
ఎప్పుడు చూసినా తాళమే..
తెరుచుకోని ఏడీఏ కార్యాలయం రాయికోడ్: మండల కేంద్రం రాయికోడ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఏడీఏ కార్యాలయం గత కొన్ని రోజులుగా తెరుచుకోవడంలేదు. రాయికోడ్ మండలంతో పాటు రేగోడ్, మునిపల్లి మండలాల రైతుల ప్రయోజనం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సొంతం భవనం లేని కారణంగా గ్రామ చివరన ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న గదులను తాత్కాలికంగా ఏడీఏ కార్యాలయానికి కేటాయించారు. ఖరీఫ్ పంటల సాగులో రైతులు అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందుబాటులో ఉంటూ వెన్నుదన్నుగా ఉండాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటంలేదని రైతులు వాపోతున్నారు. కార్యాలయం ఏర్పాటు చేసి సుమారు 4 నెలలవుతున్నా వారానికి ఒకసారి కూడా ఏడీఏ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్నారా లేక డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సందేహ నివృత్తి కోసం ఎన్నిసార్లు ఏడీఏ కార్యాలయానికి వెళ్లినా తాళం వేసి ఉంటోందని రైతులు తెలిపారు. ఈ విషయమై ఏడీఏ మాధవిని వివరణ కోరుగా మునిపల్లి, రేగోడ్ మండలాల్లో చేపట్టిన పలు కార్యాక్రమాల్లో పాల్గొనడం, శాఖాపరమైన సమావేశాలు, ఉన్నతాధికారుల సమీక్షలు ఉన్నందున తాను పర్యటనల్లో ఉన్నానన్నారు. జూనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు చెప్పారు. ఏఓ, ఏఈఓలు మండలంలో అందుబాటులో ఉంటారని అత్యవసర పరిస్థితులు, ముఖ్యమైన కార్యక్రమాల సమయాల్లో తాను మండలకేంద్రంలోని కార్యాలయానికి వస్తానని వివరించారు. -
అమర జవాన్లకు నివాళి
రాయికోడ్: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్లో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగచాటుగా చొరబడి జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం నివాళులర్పించారు. మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వీరజవాన్ల త్యాగాలకు జోహార్లు పలికారు. ఈ సందర్భంగా హెచ్ఎం అంజయ్య, ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు దేశ భద్రతకు సరిహద్దుల్లో జవాన్ల అందించే సేవలను వివరించారు. యూరి సెక్టార్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వీరజవాన్ల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, రమేష్రావ్, మంజుల, సుమన్, సల్మా, గోదావరి, సంధ్యారాణి, రమేష్, నిహారిక, శకుంతల, విద్యా వలంటీర్లు రాజ్‌కుమార్, ప్రభాకర్, పార్వతి పాల్గొన్నారు.