మౌనం పాటిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
రాయికోడ్: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగచాటుగా చొరబడి జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం నివాళులర్పించారు. మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వీరజవాన్ల త్యాగాలకు జోహార్లు పలికారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం అంజయ్య, ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు దేశ భద్రతకు సరిహద్దుల్లో జవాన్ల అందించే సేవలను వివరించారు. యూరి సెక్టార్‌లో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వీరజవాన్ల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, రమేష్‌రావ్, మంజుల, సుమన్, సల్మా, గోదావరి, సంధ్యారాణి, రమేష్, నిహారిక, శకుంతల, విద్యా వలంటీర్లు రాజ్‌కుమార్, ప్రభాకర్, పార్వతి పాల్గొన్నారు.