
రాష్ట్రపతి ముర్ముకు రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్‌లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment