జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది.
బ్రెయిన్ ట్యూమర్..
అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు.
ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా.
బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు:
ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు.
లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది.
నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు.
ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment