భూములపై సమగ్ర విచారణ జరపాలి
-
మరణించిన వ్యక్తులు భూములు ఆక్రమించారనడం నిచరాజకీయాలకు నిదర్శనం
-
రాజకీయ ఎదుగుదలను చూడలేక ఆరోపణలు
-
మేయర్ అజీజ్‌పై నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మేల్యేలు ఫైర్
నెల్లూరు(పొగతోట):
ముస్లిం మైనార్టీలకు కేటాయించిన భూములను మా తాత పోలుబోయిన సుందరయ్య, మా తండ్రి తిరుపాలయ్యలు ఆక్రమించారని నగర మేయర్ అబ్దుల్‌అజీజ్ చేసిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. అంబపురానికి సంబం«ధించిన మైనార్టీ భూముల విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి బుధవారం జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో మైనార్టీలకు భూములు కేటాయించారన్నారు.
మైనార్టీలకు 2008లో భూములు కేటాయిస్తే 2001లో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఎలా ఆక్రమిస్తారని, ఏ విధంగా కోర్టును ఆశ్రాయిస్తారన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పినట్లుగా మేయర్ పిచ్చి పనులు చేస్తుంటారన్నారు. వారం రోజుల తరువాత జేసీ ఇచ్చే నివేదికలను చూసి మేయర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ చూసుకుంటారో, క్లాక్‌టవర్ చూసుకుంటారో, పెన్నా బ్రిడ్జి చూసుకుంటారో లేక ఆయన ఇంట్లో ఉన్న బావిని చూసుకుంటారో నిర్ణయించుకోవాలన్నారు. వైఎస్సార్‌ను అభిమానించే ముస్లింల భూములను అడ్డుపెట్టుకుని తమపై నిందలు వేస్తే మైనార్టీ సోదరులు క్షమించరన్నారు.
దీనిపై నివేదికలు వచ్చిన తరువాత మరణించిన వ్యక్తిపై నిందలు వేసినందుకు క్షమాపణ చెబుతారా? లేదా మరేదైనా చూసుకుంటారా? అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. రాజకీయ ఎదుగుదలకు కారకులైన మైనార్టీలకు సంబంధించిన భూములు ఒక్క అంకనమైన ఆక్రమించలేదని, వారికి హాని కలిగించే ఏ పని కుడా చేయలేదన్నారు. అలా చేయాల్సి వస్తే రాజకీయాలను వదులుకుంటానన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేయర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ముస్లింలకు కేటాయించిన భూములు అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులు ఆక్రమించలేదు కాబట్టే నేడు ధైర్యంగా వచ్చి విచారణ జరిపించమని జే సీకి వినతి పత్రం సమర్పించారన్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మునీర్‌సిద్దీక్ మాట్లాడుతు నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు నీతీనిజాయితీకి నిలబడేవారన్నారు.
మైనార్టీల భూములు ఆక్రమించాల్సిన అవసరం వారికి లేదన్నారు. అసత్యాలు ప్రచారం చేసినంత వారిపై మైనార్టీల అభిమానం తగ్గదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనా«ద్, పార్టీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఎండి.ఖలీల్‌ఆహ్మద్, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, ఊటుకూరు మాదవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరి మహేష్, వందవాసి రంగా, మునీర్ సిద్దీక్, ఎస్‌ఆర్.ఇంతియాజ్, అతహర్‌బాషా, పఠాన్ ఫయాజ్‌ఖాన్, ఎండీ. తారిక్ ఆహ్మద్, మున్వర్, రవూఫ్, అహ్మద్, తీగల మురళీకృష్ణ, దార్ల వెంకటేశ్వర్లు, ఎం.మురళీకృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, గంధం సుధీర్‌బాబు, హాజీ పాల్గొన్నారు.