mla anil kumar yadav
-
ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
టీడీపీ నేతల అవినీతికి నిదర్శనమే నెల్లూరు రహదారులు
-
దోపిడీ చేయడం మానండి
నెల్లూరు(సెంట్రల్): ‘మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. పనుల పేరుదో దోపిడీ చేయడం మానండి’ అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని 42వ డివిజన్లో స్థానికులకు కార్తీక్ హార్ట్ సెంటర్ సహకారంతో ఎమ్మెల్యే సొంత నిధులతో రాజన్న గుండెభరోసా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. దీనిని అనిల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో వివిధ పనుల పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. కాలువల్లో పూడిక తీయాలని, లేకుంటే వర్షాలు కురిస్తే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాలుగున్నరేళ్లుగా మొత్తుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. మంత్రి నారాయణ ఇప్పటివరకు నగరాన్ని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో చేస్తున్నట్లు అబూత కల్పనను సృష్టిస్తున్నారన్నారు. తుపాన్ వచ్చే రోజుల్లో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. నగరంలో తవ్విన రోడ్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ ప్రొటోకాల్ కూడా పాటించకుండా మంత్రి నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ నుంచి అన్ని వాడుకుంటున్న మంత్రి నారాయణ మేయర్ స్థానానికి గౌరవం కూడా ఇవ్వకపోవడం మంచిపద్ధతి కాదన్నారు. దోపిడీ వ్యవహారాలు మొత్తం త్వరలోనే బయటకు వస్తాయన్నారు. రాజన్న గుండెభరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 271 మందికి డాక్టర్ నాగేంద్రప్రసాద్ వైద్యపరీక్షలు నిర్వహించారని, అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చారన్నారు. ఎనిమిది మందికి బైపాస్సర్జరీలు, 97 మందికి యాంజియోగ్రామ్, 37 మందికి యాంజియోప్లాస్టీ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఆర్ ఇంతియాజ్, ఖాదర్‌బాషా, అలీం, దస్తగిరి, సందానీ, ఇలియాజ్, జలీల్, అబీద్ పాల్గొన్నారు. -
అనిల్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన నెల్లూరు యువత
-
త్వరలోనే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది
-
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా
- పదే పదే తప్పుడు వార్తలు రాస్తే.. అబద్ధాలు నిజాలు కావు - నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ: ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 రోజులుగా తనపై పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోందని.. పదేపదే రాస్తే అబద్ధాలు నిజాలు కావని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట గురువారం శాంతియుత ధర్నా చేసేందుకు ఆయన పూనుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ తమపై అసత్య కథనాలు రాస్తున్నందుకు నిరసనగా శాంతియుత ధర్నా చేసేందుకు వచ్చామని, అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. శుక్రవారం పండుగ అయినందున ధర్నా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. దీంతో పోలీసులపై గౌరవంతో ధర్నాను విరమించుకుంటున్నట్టు ఎమ్మెల్యే అనిల్ ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. దీనికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు ప్రచురించడం బాధ కలిగించిందన్నారు. నిజాయతీని నిరూపిం చుకుంటా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూ ర్వకంగా తమను బెట్టింగ్ కేసుల్లో ఇరికించేందుకు ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయిస్తున్నట్టు ఉందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. క్రికెట్ బుకీ శంషీర్ తన అనుచరుడని రాశారని, అతడు ఏ టీడీపీ నేతకు అనుచరుడో ప్రజలకే తెలుసని అన్నారు. ప్రతిరోజూ పనిగట్టుకుని తమను ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒక కథనం రాస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు చేసి ఎన్ని కథనాలు రాసినా.. తన నిజాయతీని ప్రజాక్షేత్రంలో నిరూపిం చుకుంటానని తెలిపారు. తనపై అసత్య వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరు వు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
కార్పొరేషన్లో అక్రమ వసూళ్లు తగవు: ఎమ్మెల్యే అనిల్
► పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కార్పొరేషన్లో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో 300 కుటుంబాలు మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు తెలియజేసినా నేటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. భగత్‌సింగ్‌కాలనీ, జనార్దన్రెడ్డికాలనీల్లో మరుగుదొడ్లను నిర్మించుకునే వారి నుంచి ఇంటికి రూ.రెండు వేలు వసూలు చేశారని, అయితే నేటికీ ఆ దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు గతంలో కట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్నారు. టెండర్ తీసుకున్న వారు వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టడంలేదని ఆరోపించారు. హౌస్ ఫర్ ఆల్ కింద స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమని చెప్తున్నారని, అయితే వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ ప్రాంతాల్లో ఇంటి ప్లాన్‌కు కార్పొరేషన్ రూ.700 నిర్ణయిస్తే నిరుపేదల వద్ద రూ.1500 వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌నగర్‌లో జరిగిన అవకతవకలపై అధికారులను సస్పెండ్ చేశారని, దీన్ని కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ వసూళ్లలో అధికారుల ప్రమేయం ఉంటే వారికి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో 30 కరెంట్ స్తంభాలను వేయించాల్సిన అవసరం ఉందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగరాజు, నాగభూషణం, జాకీర్, జమీర్, కేవీఆర్ శ్రీను, వెంకటేశ్వర్లు, అన్వర్, హర్షద్, కరిముల్లా, ప్రసాద్, సుధాకర్, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సెటిల్మెంట్లు చేయడం దారుణం
అమరావతి: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావు దౌర్జన్యం చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. టీడీపీ నేతలు రవాణా శాఖ కమీషనర్ గన్‌మెన్‌ను నెట్టివేశారని, వాళ్లు కానిస్టేబుల్‌కు క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం లేదా? అధికార పార్టీకి చట్టం వర్తించదా అన్ని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, మిగతావారికి మరో న్యాయమా అని నిలదీశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్మెంట్లు చేయడం దారుణమని విమర్శించారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. -
పునరావాసం కల్పించాకే ఇళ్లు తొలగించాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పేదలకు పునరావాసాన్ని పూర్తిగా కల్పించిన తర్వాతే ఇళ్ల తొలగింపును చేపట్టాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 53వ డివిజన్ సాలుచింతలలో మంగళవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. నాలుగు లేన్ల రోడ్డు మంజూరు కారణంగా ఇళ్లను తొలగించాలని నోటీసులు జారీ చేశారని చెప్పారు. నగరానికి సంబంధించి 67 ఇళ్లు, పోతిరెడ్డిపాళెం పంచాయతీకి సంబంధించి 150 ఇళ్లను తొలగించేందుకు నోటీసులను జారీ చేశారన్నారు. పోతిరెడ్డిపాళెం పరిధిలోని వారికి కోవూరు పంచాయతీకి సంబంధించిన స్థలాల్లో ఇళ్లు ఇస్తారని చెప్పారని, నగరానికి సంబంధించిన వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. నగరంలోని 67 ఇళ్లకు సంబంధించిన వారికి ఒకటిన్నర ఎకరా సరిపోతుందని, పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రభుత్వానికి సంబంధించిన సుమారు ఆరేడు ఎకరాల స్థలం ఉందని, అధికారులు ఇక్కడి స్థలాన్ని సర్వే చేయించి వీరికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగసుబ్బారెడ్డి, నాగభూషణం, భీముడు, నాగరాజు, హరి, జాకీర్, ఉస్మేరా, సుభాషిణి, బ్రహ్మారెడ్డి, జమీర్, కరిముల్లా, అధికారులు పాల్గొన్నారు. -
అధికారుల వెనుకడుగు
పేదల ఇళ్లు కూల్చివేతకు రంగంలోకి దిగిన కార్పొరేషన్ అధికారులు స్థానికులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్‌యాదవ్ భారీగా పోలీసులు మోహరింపు, ఎమ్మెల్యే వెనక్కు తగ్గకపోవడంతో ఆక్రమణలు తాత్కాలికంగా విరమించుకున్న అధికారులు నెల్లూరు, సిటీ: నగరంలోని 41వ డివిజన్లోని ఉమామహేశ్వరి ఆలయం, పాములమాన్యం ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో ఇళ్లు, దుకాణాలు తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఆదివారం రంగం సిద్ధం చేశారు. జేసీబీలు, భారీ క్రొక్లేన్‌లను ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రజలు జేసీబీలకు అడ్డుపడటంతో కొంతసేపపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ ఉదయం 6.30 నిమిషాలకు చేరుకున్నారు. ప్రజలు రోడ్డుపై బైఠాయించి మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ తీరుపై మండిపడ్డారు. తాము ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో నివసిస్తుంటే, ఆక్రమణల పేరుతో కూల్చివేత చేపట్టడంపై ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 4 గంటల పాటు కదలని ఎమ్మెల్యే అనిల్ . ప్రజల ఇళ్లు కూల్చివేతను అధికారులు చేపడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ తాను ఇక్కడే ఉంటానని, ఆక్రమణల పేరుతో మీ ఇళ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోనని స్థానికులకు హామీ ఇచ్చారు. ఉదయం 4గంటల పాటు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నాయకులు భారీగా చేరుకున్నారు. తదుపరి చర్యలు ఏమి తీసుకోవాలన్న దానిపై సమీక్ష పేద ప్రజలకు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ అండగా నిలబడటంతో ఇళ్లు ఏవిధంగా తొలగించాలో అర్థం కాక టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు, తిమ్మారెడ్డి, కమిషనర్ కె వెంకేటశ్వర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గంటలు గడుస్తున్నా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అధికారులు ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటికే సిద్ధం చేసిన జీసీబీని, కార్మికులను వెనక్కు పంపారు. అయితే సోమవారం ఆక్రమణల తొలగింపు ఏ విధంగా చేపట్టాలనే దాని పై ఆదివారం సాయంత్రం అధికారులు కార్యాచరణ రూపొందించారు. పేదల ఇళ్ళు జోలికొస్తే ఎంత దూరమైనా పోరాడతా–సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లు తొలగిస్తే, వాళ్లు రోడ్డున పడాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలు తెలియని జాక్‌పాట్ మంత్రి నారాయణ ఇళ్లను కూల్చేస్తాం, తీసేస్తాం, అనడం తప్ప ఎక్కడా పేద ప్రజలకు అండగా నిలిచిన దాఖలాలు లేవన్నారు. పేదల ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు తొలగిస్తే వారి కోసం వామపక్షాలన్నింటినీ కలుపుకుని పోరాడతానని హెచ్చరించారు. -
వివక్షపై దీక్ష
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నిరాహారదీక్ష ప్రారంభం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అభివృద్ధి నిధుల కేటాయింపులో నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయంపై సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ బుధవారం గాంధీబొమ్మ వద్ద చేపట్టిన నిరాహారదీక్షలో నిరసన గళాలు ఎగసిపడ్డాయి. నియోజకవర్గంలో అసలైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ వివక్షత చూపుతున్న అధికారపార్టీపై వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. తొలుత వివిధ డివిజన్ల నుంచి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ర్యాలీలుగా నిరాహారదీక్ష వేదికకు తరలివచ్చారు. మహాత్మాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే అనిల్ దీక్షను ప్రారంభించారు. క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరాహారదీక్ష ప్రారంభోత్సవ సభలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పముజుల దశరథరామయ్య తదితరులు నగర నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, బులియన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు, కిరాణామర్చంట్స్ అసోసియేషన్ నాయకులు నిరాహారదీక్షకు మద్దతు తెలిపారు. భారీ ర్యాలీ.. వైఎస్సార్సీపీ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరాహారదీక్ష శిబిరానికి చేరుకున్నారు. భారీగా జనం చేరడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కార్పొరేటర్లు కుంచాల కృష్ణవేణి, వేలూరు సుధారాణి, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, దామవరపు రాజశేఖర్, ఓబిలి రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణిదెల సుధీర్, రఘు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిధుల కేటాయింపులో వివక్షత చూపించడంపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నగర ఎమ్మెల్యే అనిల్ ఎంత విసిగి వేసారి పోయి ఉంటే నిరాహారదీక్ష చేపడతారు. మేయర్‌కు కూడా ప్రజలు ఓట్లేశారు. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. అభివృద్ధి నిధులను కేటాయించకపోవడంలో బాధ్యులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పొరపాట్లను సరిదిద్దుకొని ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. చరిత్రాత్మక నిర్ణయం – సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం నిరాహారదీక్ష చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయం. కార్పొరేషన్ పాలన నెల్లూరుకు పట్టిన దౌర్భాగ్యం. 10 నెలలుగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను విస్మరించి కేవలం దోచుకోవాలనే ఆలోచనతో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌లకు ఉండడం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఇంత ఏకపక్షపాలన ఎన్నడూ చూడలేదు. నగర ప్రజల అభివృద్ధికోసం ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేయాల్సిన పరిస్థితులు రావడం బాధాకరం. అభివృద్ధికి కలిసి పనిచేసేందుకు సిద్ధం – అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నగర ప్రజల అభివృద్ధికోసం కలిసి పనిచేసేందుకు సిద్ధం.. కలుపుకుని పనిచేసేందుకు మీరు సిద్ధమా?. దీక్షలో చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా. రెండున్నరేళ్లలో 28 డివిజన్లలో కేవలం రూ.12 కోట్ల నుంచి రూ.13కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. నగర నియోజకవర్గంపై వివక్షత ఎందుకు. అర్హులైన 3,500 మందికి పింఛన్లు అందడంలేదు. రైల్వే స్థలాలవద్ద ఉంటున్నవారికి నివేశన స్థలాలు విషయం పట్టించుకునేవాళ్లు లేరు. మంత్రి ఎప్పుడు వస్తాడో... ఎప్పుడు వెళ్తాడో తెలియదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి శఠగోపం పెట్టారు. మేయర్ పుట్టుకతోనే ప్రజాసేవకుడు అయినట్టు మాట్లాడుతున్నాడు. అధికారం శాశ్వతం కాదు. అధికార అహంతో పాతాళలోకానికి పోయిన చాలా మంది ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకో.. వివక్షత వీడు. కనీసం షాదీమంజిల్ మరమ్మతు పనులైనా ఇంతవరకు చేపట్టలేదు. టెండర్ల ప్రక్రియ వరకు ఆగిపోయింది. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బిక్షతోనే మేయర్వు అయ్యావు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు పట్టించుకో. కేవలం ఆరోపణలు కాదు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల వివక్షతలో కేవలం ప్రతిపక్ష ఆరోపణలు కాదు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నిసార్లు చెప్పినా మంత్రి, మేయర్ పట్టించుకోలేదు. పత్రికల్లో వస్తున్న పుంకాలు పుంకాలు వార్తలకు సమాధానం ఏం చెబుతారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. సొంత కార్పొరేషన్‌పై మంత్రి దృష్టి సారించాలి. అభివృద్ధి పనులకోసం మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తాం. అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. వైఎస్సార్ హయాంలో మాదిరిగా పథకాలు అందాలి – ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరిగా పేదలందరికీ పథకాలు అందాలి. చట్టబద్ధతలేని జన్మభూమి కమిటీ చెప్పిన వారికి సౌలభ్యాలు కల్పిచండం మంచిది కాదు. ఇంతటి ఏకపక్ష ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్లో అభివృద్ధి నిధులు కేటాయించాలి. చిత్తశుద్ధిగల ఎమ్మెల్యే అనిల్ –పముజుల దశరథరామయ్య, సీపీఐ రాష్ట్ర నాయకుడు పిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై నిజాయితీతో పనిచేస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్ దీక్ష అర్థవంతమైంది. అభివృద్ధికోసం ఓటు వేసిన అందరికీ సాయం చేయాలనే తపన పాలకవర్గానికి కనువిప్పుకావాలి. పక్షపాతంతో కార్పొరేషన్లో పనులు చేయడం మంచి పద్దతి కాదు. న్యాయం జరిగే వరకు ఎవరు పోరాటం చేసినా పార్టీ తరపున మద్దతు ఉంటుంది. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం నిరాహార దీక్షకు దిగారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
28, 29న ఎమ్మెల్యే అనిల్ నిరశన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అభివృద్ధి నిధుల కేటాయింపులో నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయనికి నిరసనగా ఈ నెల 28, 29 తేదీలలో స్థానిక గాంధీబొమ్మసెంటర్‌లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజలు తెలియజేసినప్పటికీ వివక్షతచూపుతున్న ప్రభుత్వంపై నిరసన గళమెత్తనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
కొత్త ఇళ్లు కట్టించాలి
ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌నగర్‌లో నాసిరకంగా నిర్మించిన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్లు కట్టించాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు వినతిపత్రం అందజేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 6,500 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆయన పాలన కాలంలో పనులు జోరుగా సాగాయన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన పాలకులు వైఎస్సార్నగర్ను పట్టించుకోకపోవడంతో పనులు నాసిరకంగా జరిగాయన్నారు. గతంలో చంద్రబాబు, మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. ఇప్పటికైనా స్పందించి నాణ్యతతో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. బ్యారేజీ నిర్వాసితులను ఆదుకోవాలి 53వ డివిజన్ పరిధిలోని సాలుచింతల ప్రాంతంలో పెన్నాబ్యారేజీ నిర్మాణంతో నిర్వాసితులవుతున్న పేదలనుఆదుకోవాలని ఎమ్మెల్యే అనిల్ కోరారు. అక్కడ అనేక ఏళ్లుగా పేదలు నివసిస్తున్నారని, బండ్‌కు బదులు ప్రహరీ నిర్మాణం లేదా ప్రత్నామ్నాయం చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, దేవరకొండ అశోక్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఆర్ ఇంతియాజ్, నాయకులు వేలూరు మహేష్, వందవాశి రంగా తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించరా..?
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి నెల్లూరు సిటీ: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు చివరి దశలో ఉండగా, మంత్రి నారాయణ సొంత జిల్లాలోని కార్పొరేషన్లో మాత్రం ఇప్పటికీ ప్రారంభంకాలేదని నెల్లూరు నగర , రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధుల పనులు ప్రారంభం కాకపోవడంపై మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లును వారు కలిశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్‌కు మంజూరైన సబ్‌ప్లాన్ నిధులు రూ.38 కోట్లతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు సిండికేటై 8 ప్యాకేజీలుగా చేశారన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీలోపు టెండర్లను పిలుస్తామని కమిషనర్ చెప్పారని, 15లోపు ప్రక్రియ పూర్తికాకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళాలను వేస్తామని హెచ్చరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి నిధులు వచ్చాయని చెప్పారు. కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి నారాయణ నిధులను తీసుకురావాల్సి ఉందని, అయితే ఉన్న నిధులతో కూడా పనులను ప్రారంభించలేదని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం కార్పొరేషన్ తీరును ఎండగడతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, మునీర్ సిద్ధిఖ్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. -
భూములపై సమగ్ర విచారణ జరపాలి
మరణించిన వ్యక్తులు భూములు ఆక్రమించారనడం నిచరాజకీయాలకు నిదర్శనం రాజకీయ ఎదుగుదలను చూడలేక ఆరోపణలు మేయర్ అజీజ్‌పై నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మేల్యేలు ఫైర్ నెల్లూరు(పొగతోట): ముస్లిం మైనార్టీలకు కేటాయించిన భూములను మా తాత పోలుబోయిన సుందరయ్య, మా తండ్రి తిరుపాలయ్యలు ఆక్రమించారని నగర మేయర్ అబ్దుల్అజీజ్ చేసిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. అంబపురానికి సంబం«ధించిన మైనార్టీ భూముల విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి బుధవారం జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో మైనార్టీలకు భూములు కేటాయించారన్నారు. మైనార్టీలకు 2008లో భూములు కేటాయిస్తే 2001లో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఎలా ఆక్రమిస్తారని, ఏ విధంగా కోర్టును ఆశ్రాయిస్తారన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పినట్లుగా మేయర్ పిచ్చి పనులు చేస్తుంటారన్నారు. వారం రోజుల తరువాత జేసీ ఇచ్చే నివేదికలను చూసి మేయర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ చూసుకుంటారో, క్లాక్‌టవర్ చూసుకుంటారో, పెన్నా బ్రిడ్జి చూసుకుంటారో లేక ఆయన ఇంట్లో ఉన్న బావిని చూసుకుంటారో నిర్ణయించుకోవాలన్నారు. వైఎస్సార్‌ను అభిమానించే ముస్లింల భూములను అడ్డుపెట్టుకుని తమపై నిందలు వేస్తే మైనార్టీ సోదరులు క్షమించరన్నారు. దీనిపై నివేదికలు వచ్చిన తరువాత మరణించిన వ్యక్తిపై నిందలు వేసినందుకు క్షమాపణ చెబుతారా? లేదా మరేదైనా చూసుకుంటారా? అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. రాజకీయ ఎదుగుదలకు కారకులైన మైనార్టీలకు సంబంధించిన భూములు ఒక్క అంకనమైన ఆక్రమించలేదని, వారికి హాని కలిగించే ఏ పని కుడా చేయలేదన్నారు. అలా చేయాల్సి వస్తే రాజకీయాలను వదులుకుంటానన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేయర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ముస్లింలకు కేటాయించిన భూములు అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులు ఆక్రమించలేదు కాబట్టే నేడు ధైర్యంగా వచ్చి విచారణ జరిపించమని జే సీకి వినతి పత్రం సమర్పించారన్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మునీర్సిద్దీక్ మాట్లాడుతు నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు నీతీనిజాయితీకి నిలబడేవారన్నారు. మైనార్టీల భూములు ఆక్రమించాల్సిన అవసరం వారికి లేదన్నారు. అసత్యాలు ప్రచారం చేసినంత వారిపై మైనార్టీల అభిమానం తగ్గదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనా«ద్, పార్టీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఎండి.ఖలీల్ఆహ్మద్, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, ఊటుకూరు మాదవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరి మహేష్, వందవాసి రంగా, మునీర్ సిద్దీక్, ఎస్ఆర్.ఇంతియాజ్, అతహర్‌బాషా, పఠాన్ ఫయాజ్‌ఖాన్, ఎండీ. తారిక్ ఆహ్మద్, మున్వర్, రవూఫ్, అహ్మద్, తీగల మురళీకృష్ణ, దార్ల వెంకటేశ్వర్లు, ఎం.మురళీకృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, గంధం సుధీర్‌బాబు, హాజీ పాల్గొన్నారు. -
సంఘటితమైతేనే బడుగుల మనుగడ సాధ్యం
► నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ► ఘనంగా మహాత్మజ్యోతిరావు పూలే, ► బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి నెల్లూరు(బృందావనం) : సంఘటితంగా పోరాటాలు సాగిస్తేనే బడుగుల మనుగడ సాధ్యమవుతుందని, నాడే మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేరుతాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నగరంలోని పురమందిరంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ, బీసీకులాల సమన్వయ కమిటీ, బహుజన టీచర్స్ అసోసియేషన్, మహిళాసాధికార సమన్వయకమిటీ, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పూలే (ఏప్రిల్11), అంబేడ్కర్(ఏప్రిల్14) జయంతులను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు మహాత్ముల జయంతులు, ఉత్సవాలు,వర్థంతులు జరిపితే సరిపోదన్నారు. వారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారి పిల్లలు చదివే పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని అందించి విద్యాభివృద్ధికి తోడ్పడితే వారు ప్రగతివైపు పయనిస్తారన్నారు. దక్షిణమధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జె.ఎన్.రాజు మాట్లాడుతూ పూలే, అంబేదడ్కర్లను బడుగుల దేవుళ్లుగా పేర్కొన్నారు. వారి ఆశయాలు సాధించేందుకు అందరూ కృషిచేయాల్సిన అవసరముందన్నారు. తొలుత పూలే,సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ జీవితచరిత్ర పుస్తకాలను ఎమ్మెల్యే, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శిరీష, రాజు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున్‌యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, రొంపిచెర్ల శివరామయ్య ఆచారి, నాశిన భాస్కర్‌గౌడ్, డాక్టర్ మారం విజయలక్ష్మి, చదలవాడ రమణయ్య, షేక్ కాలేషా, మెతుకు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌కు అండగా ఉంటా : అనిల్, ఎమ్మెల్యే బలహీనవర్గాని చెందిన తాను తన పినతండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 90 ఓట్లతో కొందరి కారణంగా ఓడానని, అయితే మళ్లీ నెల్లూరు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బీసీవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి గెలుపుకోసం కృషిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన ఊపిరి ఉన్నంత వరకు అండగా ఉంటానన్నారు. బీసీల ఉన్నతికి తోడ్పడిన వారిలో రాష్ట్రంలో ఎన్టీరామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అగ్రగణ్యులని, వారిని ఎవరూ మరిచిపోరని కొనియాడారు. -
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆరో డివిజన్లో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో పక్కాగృహాల దరఖాస్తులను శెట్టిగుంట రోడ్డులోని సత్రంబడిలో గురువారం ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేశారు. రసీదులను డివిజన్ ప్రజలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు లేని వారికి గృహ వసతిని కల్పిస్తామన్నాయని, దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలనే అంశాన్ని గుర్తించి డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి దరఖాస్తులను పొందుపర్చామని వివరించారు. రిజిస్ట్రేషన్‌కు ఇతర కేంద్రాల్లో రూ.వంద ఖర్చవుతోందని, డివిజన్లోని ప్రజలపై ఆ భారం పడకుండా డిప్యూటీ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అభినందించారు. పేదలకు ఎన్ని ఇళ్లు ఇస్తామనే అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం బాధాకరమన్నారు. నగరంలోని 54 డివిజన్లలో దాదాపు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాజకీయాలకతీతంగా జన్మభూమి కమిటీలను పక్కనబెట్టి అర్హులందరికీ గృహ వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు శివకుమార్, తులసి, మద్దినేని శ్రీధర్, హరీష్, చిరంజీవి, సునీల్, సునీత, మల్లి, తదితరులు పాల్గొన్నారు. చెత్త సేకరణకు చర్యలు చేపట్టాలి చెత్త సేకరణకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో చెత్త సేకరణకు అవసరమైన రెండు రిక్షా బండ్లు, డస్ట్బిన్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్ నుంచి రూ.కోటికిపైగా పన్నులు కార్పొరేషన్‌కు వస్తున్నాయని, అయితే డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.19 లక్షలనే వెచ్చించారని ఆరోపించారు. డ్రెయిన్లు, మురుగుకాలువలకు నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెరుగైన పారిశుధ్యం కోసం స్థానిక కార్పొరేటర్ తన వం తు సహకారం అందించడాన్ని అభినందించారు. కార్పొరేటర్లు ఓబి లి రవిచంద్ర, ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్, మహేష్, రఘు, కుమార్, నాగరాజు, రామలక్ష్మణ్, అరవింద్, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్, వీరా, తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారే విషయమై పునరాలోచించుకోవాలి
నెల్లూరు : పార్టీ మారే విషయమై మేయర్ అబ్దుల్ అజీజ్ పునరాలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఒకవేళ అజీజ్ పార్టీ మారాలనుకుంటే మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం రేయింబవళ్లు నిద్దుర మానుకుని పనిచేశామని, టీడీపీ ఆగడాలను అడ్డుకుని మేయర్‌ను చేస్తే ఇప్పుడు అజీజ్ అందరిని వంచించి టీడీపీలో చేరుతున్నానంటూ చెప్పడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు అజీజ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.