పార్టీ మారే విషయమై మేయర్ అబ్దుల్ అజీజ్ పునరాలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
నెల్లూరు : పార్టీ మారే విషయమై మేయర్ అబ్దుల్ అజీజ్ పునరాలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఒకవేళ అజీజ్ పార్టీ మారాలనుకుంటే మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం రేయింబవళ్లు నిద్దుర మానుకుని పనిచేశామని, టీడీపీ ఆగడాలను అడ్డుకుని మేయర్ను చేస్తే ఇప్పుడు అజీజ్ అందరిని వంచించి టీడీపీలో చేరుతున్నానంటూ చెప్పడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు అజీజ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.