Abdul Aziz
-
టీడీపీ నేత అజీజ్‌కు చెన్నై పోలీసుల నోటీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్‌కు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆయన తమ్ముడు, మరికొందరికి కూడా జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ అజీజ్, అతని సోదరుడు జలీల్, కుటుంబ సభ్యుల పేరిట స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్ కంపెనీ నిర్వహించేవారు. దీనికి విదేశాల్లోనూ బ్రాంచిలు ఉన్నాయి. కాగా, చెన్నైలోని టీనగర్‌కు చెందిన ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ స్టార్ ఆగ్రో కంపెనీలో భాగస్వామ్యం కోసం రూ.42 కోట్లు పెట్టుబడులు పెట్టింది. చదవండి: ‘బిగ్‌బాస్’ ఒక అనైతిక షో: సీపీఐ నారాయణ ఆ మొత్తాన్ని స్టార్ ఆగ్రో కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న అజీజ్, అతని సోదరుడు అబ్దుల్ జలీల్ వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి మోసగించడంతో పాటు లెక్కలు చూపమని ప్రశ్నించిన తమ వారిపై బెదిరింపులకు దిగుతున్నారని జెంపెక్స్ కంపెనీ ప్రతినిధి మనోహరప్రసాద్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2017 డిసెంబర్లో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ టీమ్–1, ఈడిఎఫ్–1 వింగ్ పోలీసులు అజీజ్, జలీల్, అబ్దుల్ ఖుద్దూస్‌తో పాటు పలువురిపై ఐపీసీ 406, 420, 506 (ఐ) ఆర్/డబ్ల్యూ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం టీడీపీలో కలకలం రేకెత్తించింది. అయితే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని అబ్దుల్ అజీజ్ అప్పట్లో చెప్పారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అలా చెప్పారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. పై కేసులో తదుపరి విచారణ నిమిత్తం హాజరుకావాలని సీసీబీ పోలీసు అధికారులు సెక్షన్ 41ఏ కింద శనివారం నోటీసులిచ్చారు. ఈ నెల 28 ఉదయం 10.30 గంటలకు అబ్దుల్ జలీల్, 12 గంటలకు అబ్దుల్ ఖుద్దూస్, మధ్యాహ్నం ఒంటిగంటకు అబ్దుల్ అజీజ్ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
టెక్నాలజీ ఊతంతో స్వచ్ఛమైన ఇంధనాలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన, సమర్ధమంతమైన, చౌకైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కాలుష్యకారక కార్బన్‌డైఆక్సైడ్‌ను రీసైక్లింగ్ చేసేందుకు టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ సదస్సులో వీడియో లింక్ ద్వారా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ముడిచమురు ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ అల్–సౌద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్బన్‌డైఆక్సైడ్‌ను ఒక భారంగా భావించకుండా టెక్నాలజీ ఊతంతో ఇతరత్రా ఉత్పత్తుల కోసం దాన్ని ముడి వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పెట్టాల్సి ఉందని ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోని 800 కోట్ల మంది జనాభాకు ఇంధనం అనేది తప్పనిసరిగా అవసరం. ఈ నేపథ్యంలో చౌకైన, సమర్థమంతమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలి. అది కూడా బాధ్యతాయుతమైన పద్ధతిలో చేయగలగాలి‘ అని అంబానీ చెప్పారు. -
స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా..
ఎవరైనా కదలకుండా ఎంతసేపు నిలబడగలరు..? ఓ ఐదు నిమిషాలు.. అరగంట.. అంతకుమించి అయితే చాలా కష్టం కదూ! నిజంగానే మనం అసలేమాత్రం కదలకుండా అంతకన్నా ఎక్కువసేపు నిలబడడం సాధ్యం కాదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రతి రోజూ, నిర్విరామంగా ఆరు గంటలసేపు కదలకుండా, విగ్రహంలా నించుంటున్నాడు. అది కూడా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా! అందుకే అతడ్ని ‘స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటున్నారు. అతడి పేరు అబ్దుల్ అజీజ్. ఇంతకీ అతనెక్కడ ఉంటాడో.. ఎందుకలా నిలబడుతున్నాడో తెలుసుకుందాం.. సందర్శకుల కోసం.. అది చెన్నైలోని ఓ ప్రైవేటు బీచ్ రిసార్టు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపేందుకు, బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ రిసార్టుకు ప్రతిరోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వారికి అనేక రకాలుగా వినోదం పంచడం రిసార్టు నిర్వాహకుల బాధ్యత. పర్యాటకుల్ని ఆకర్షించే ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ఆ రిసార్టులో. అయితే అన్నింటికంటే ఎక్కువగా పర్యాటకుల్ని ఆకర్షించేది మాత్రం ఓ వ్యక్తి. ఇంతకీ అతనేం చేస్తాడో తెలుసా.. కదలకుండా, ఓ విగ్రహంలా నిలబడి ఉంటాడు. అది కూడా వరుసగా ఆరు గంటలపాటు. కళాత్మకంగా, వివిధ శిల్పాలతో తీర్చిదిద్దిన సెట్ల మధ్య అతడు ఓ శిల్పంలా నిలబడి ఉండి అందరినీ ఆకట్టుకుంటాడు. సందర్శకుల్ని ఆకర్షించే ఉద్దేశంతో, రిసార్టు యాజమాన్యం అతడ్ని విగ్రహంలా నిలబడే ఏర్పాటు చేసింది. మూడు దశాబ్దాలుగా.. శిల్పంలా నిలబడి ఉంటున్న అతడి పేరు అబ్దుల్ అజీజ్. 54 ఏళ్ల వయసున్న అజీజ్ ఈ రిసార్టులో దాదాపు 1985 నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి 32 ఏళ్లుగా, ప్రతి రోజూ, ఆరు గంటలపాటు విగ్రహంలా నిలబడి ఉండడం అంత సులభమైన విషయం కాదు. కానీ, అజీజ్, దీన్ని ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. అందువల్లే అతడిని ‘స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తున్నారు. విదేశాల్లో కూడా ఇలా శిల్పంలా నిలబడి ఉండే కళాకారులు చాలా మందే ఉన్నారు. కానీ దీర్ఘకాలం పాటు ఇదే పని కొనసాగిస్తున్న వారు ప్రపంచంలో చాలా అరుదు. బహుశా, ఇంత ఎక్కువ కాలం పాటు విగ్రహంలా నిలబడి ఉంటున్న వ్యక్తి ఇతడే అయ్యుండొచ్చు. యజమాని ఆలోచన.. ఇది 1985 నాటి సంగతి. అప్పుడు అబ్దుల్ అజీజ్ వయసు 22 ఏళ్లు ఉంటుంది. ఉపాధి కోసం చెన్నైలోని ఓ రిసార్టులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. తనతోపాటు, రిసార్టులో మరో నలుగురైదుగురు సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. ఈ సమయంలో రిసార్టు యజమాని తన కుటుంబంతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాల్లో ఇలా విగ్రహంలాగా, కొందరు నిలబడి ఉండడాన్ని చూశాడు. వీరు పర్యాటకుల్ని బాగా ఆకట్టుకోవడాన్ని గమనించిన ఆయనకు ఓ ఐడియా తట్టింది. ఇండియాలోని తన రిసార్టులో కూడా ఇలా శిల్పంలాగా ఓ వ్యక్తిని నియమించాలనుకున్నాడు. చెన్నైకు తిరిగి వచ్చిన వెంటనే తన సెక్యూరిటీ గార్డులను పిలిచి, ఈ విషయం చెప్పాడు. గార్డుల్లో ఒకరిని దీని కోసం నియమించాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలు శిక్షణ కూడా ఇప్పించాడు. ఎక్కువసేపు కదలకుండా ఉండే వారిని దీని కోసం నియమించాలనుకున్నాడు. అలాగే ఒక్కసారి అలా నిలబడ్డాక కదలడం, నవ్వడం, మాట్లాడడం వంటివి కూడా చేయకూడదు. శిక్షణ పూర్తయ్యేలోపు వారిలోంచి అబ్దుల్ అజీజ్‌ను ఎంపిక చేశాడు. అతడు అందరిలోకీ, మంచి ప్రతిభ కనబర్చడంతో అతడ్ని ఎంపిక చేశాడు. ఇష్టం లేకున్నా.. యజమాని తనను శిల్పంలా నిలబడే పనికి నియమించడం నిజంగా అబ్దుల్ అజీజ్‌కు ఇష్టం లేదు. కానీ, ఈ విషయం చెబితే, యజమాని సెక్యూరిటీ గార్డుగా కూడా తీసేస్తాడేమోనని భయపడ్డాడు. పైగా తనకు ఆ ఉద్యోగం ఎంతో అవసరం. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అజీజ్ ఈ పనికి ఒప్పుకొన్నాడు. అలా మొదలైన అతడి ప్రస్థానం మూడు దశాబ్దాలుగా, విజయవంతంగా కొనసాగుతోంది. క్లిష్టమైన పని.. ప్రస్తుతం అజీజ్ రోజూ ఆరు గంటలపాటు కదలకుండా నిలబడుతున్నాడు. రాచరిక కాలం నాటి ప్రత్యేక దుస్తులు ధరించి, రిసార్టులో ఒకే చోట అలా నిలబడి ఉంటాడు. ఒక్కసారి అలా నిలబడడం ప్రారంభమైందంటే, సమయం పూర్తయ్యే వరకూ ఎటూ కదిలే అవకాశం ఉండదు. ఈ సమయంలో అతడు నవ్వడం, మాట్లాడడం, నడవడం, వంటివి కూడా చేయడు. అచ్చం ఓ విగ్రహంలా ఉంటాడంతే. భోజనం కూడా పని తర్వాతే. అత్యవసరమైతే తప్ప ఈ పనికి విరామం ఉండదు. విదేశాల్లోనూ పలు సంస్థలు, ఇలాంటి వ్యక్తుల్ని నియమించుకుంటాయి. అయితే వారికి ప్రతి రెండు గంటలకోసారి విరామం ఉంటుంది. షిఫ్టుల మార్పూ ఉంటుంది. కానీ, అజీజ్‌కు మాత్రం ఆరుగంటలపాటు ఇవేవీ ఉండవు. సందర్శకులు ఎవరూ లేని సమయంలో, విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటే మాత్రం కొద్దిగా రిలాక్స్ అవుతాడు. గుర్తింపు.. ఇన్నేళ్లుగా అసాధారణమైన పని చేస్తున్న అజీజ్‌కు ఇప్పుడు మంచి గుర్తింపు దక్కింది. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం, అజీజ్ పనితీరును చూసేందుకు వస్తున్నారు. అయితే, ఇలా రోజూ నిలబడి ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అతడు చెప్పాడు. కానీ, తన కుటుంబ పోషణ కోసం ఈ పని చెయ్యక తప్పడం లేదని, ఆవేదన చెందాడు. ఇబ్బందుల్ని అధిగమించి.. తనకుతానుగా, అజీజ్ ఆరు గంటలపాటు నిలబడి ఉండగలడు. కానీ, ఇతడ్ని కదిలించేందుకు చాలా మంది సందర్శకులు ప్రయత్నిస్తుంటారు. నవ్వించేందుకు మంచి జోకులు చెబుతుంటారు. అయినా ఇతడు నవ్వడు. ఇలా నవ్వించేందుకు ప్రయత్నించడం, మొహానికి దగ్గరగా వచ్చి, వెకిలి చూపులు చూడడం, చేతుల్ని బలవంతంగా కదిలించేందుకు ప్రయత్నించడం వంటి చేష్టలతో, ఇతడ్ని సందర్శకులు ఇబ్బంది పెడుతుంటారు. అయినప్పటికీ, తన చుట్టూ ఏం జరుగుతున్నా, పట్టించుకోకుండా అలా నిలబడే ఉంటాడు. కనీసం కంటి రెప్పలు కూడా కదిలించకుండా, అలా విగ్రహంలా నిలబడే ఉంటాడు. అంతగా అజీజ్, ఈ పనికి అలవాటు పడిపోయాడు. సందర్శకుల నుంచి మరీ ఇబ్బంది ఎదురైతే మాత్రం, పక్కనే ఉండే గార్డులు వారిని దూరంగా తీసుకెళ్తారు. రిసార్టు యాజమాన్యం కూడా అప్పుడప్పుడూ ఓ పోటీ నిర్వహిస్తుంటుంది. సందర్శకులెవరైనా, అజీజ్ తనకుతానుగా కదిలేలా చేయగలిగితే, వారికి నగదు బహుమతినిస్తామని ప్రకటించింది. అయితే, ఎవరూ ఆ పని చేయలేకపోయారు. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
దోస్త్ మేరా దోస్త్
ఆదాలతో అజీజ్ స్నేహం తమ వర్గం పట్టు పెంచుకోవడానికి పార్టీ నేతలతో సమావేశం కార్పొరేటర్లతో పాటు ఓడిన వారికీ పనులు ఇస్తామని హామీ నెల్లూరు సిటీలో అజీజ్‌కు ఆదాల సహకారానికి ఒప్పందం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు తెలుగుదేశం పార్టీలో కొత్త స్నేహానికి తెర లేచింది. మంత్రి నారాయణతో విభేదిస్తున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో మేయర్ అబ్దుల్ అజీజ్ జత కట్టారు. రాజకీయంగా ఒకరికొకరు సహరించుకుంటూ పార్టీ లోని తమ శత్రువులకు చెక్ పెట్టే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గురువారం ఆదాల ఇంట్లో రూరల్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యులతో ఇద్దరూ సమావేశమై మనం మనం ఒకటి అనుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ తన గురువు, మంత్రి నారాయణ ఆహ్వానంతో టీడీపీలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆనం కుటుంబం టీడీపీలో చేరడంతో అజీజ్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. మంత్రి అండతో రాజకీయ చక్రం తిప్పాలనుకున్న అజీజ్ వ్యూహం ఫలించలేదు. ఆనం కుటుంబానికి మంత్రి ప్రాధాన్యం ఇస్తూ రావడంతో కార్పొరేషన్ వ్యవహారాల్లో కూడా వారు పరోక్షంగా జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో అజీజ్ ఒక అడుగు ముందుకేసి శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆదాలతో జత కలిశారు. ఆదాల సహకారం ఉంటే కార్పొరేషన్ వ్యవహారాల్లో తన మాట నెగ్గించుకోవడం కోక పోయినా ఆనం చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేశారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో మంత్రి నారాయణ మీద ఆదాల నేరుగా ధ్వజమెత్తడం వీరిద్దరి స్నేహాన్ని మరింత బలపడేలా చేసింది. అప్పటి నుంచి ఒకరి కొకరు అన్నట్లుగా ఉన్న వీరిద్దరూ రూరల్నియోజక వర్గంలో కలసి పనిచేసుకుని తమ వర్గం బలపరచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల చేతిలో ఓడిన అభ్యర్థులను ఒక్కటి చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రూరల్ నియోజక వర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఓడిన అభ్యర్థులతో ఆదాల ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రాంరభమైన సమావేశం రాత్రి 9 గంటల దాకా జరిగింది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌కు ఆదాల, సిటీకి అజీజ్ టికెట్లు దక్కించుకునే ఎత్తుగడలోనే ఈ రాజకీయం ప్రారంభించారని టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా రూరల్ నియోజకవర్గంలో గెలిచిన, ఓడిన కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య సమన్వయం కుదర్చడం కోసం నిర్వహించే పేరుతో జరిపిన ఈ సమావేశానికి ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డిని ఆజీజ్ మనుషులు ఆహ్వానించారు. నామ మాత్రపు ఆహ్వానం అందినందువల్ల తాను రాలేదని, ఆయన తన మద్దతు దారులకు చెప్పారు. ఈయనతో పాటు వెంకన్న యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, నెల్లూరు సునీత, బొల్లినేని శ్రీవిద్య సమావేశానికి రాలేదు. వీరిలో కొందరు మంత్రి నారాయణతో సన్నిహితంగా ఉండటం వల్ల రాలేదు. కొందరు మాత్రం వ్యక్తిగత పనుల వల్ల రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆదాల, అజీజ్ ఇద్దరూ కార్పొరేటర్లు, ఓడిన అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడారు. కార్పొరేషన్ పరి«ధిలో మంజూరైన పనులు కార్పొరేటర్లతో పాటు ఓడిన∙వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రూరల్ నియోజక వర్గంలోని డివిజన్లలో ఇక మీదట జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల్లో ఆదాల పేరు కూడా వేయాలని కొందరు కార్పొరేటర్లు చేసిన డిమాండ్‌కు అజీజ్ అంగీకరించినట్లు తెలిసింది. -
'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా'
అజీజ్.. నువ్వు ముస్లింల పరువు తీస్తున్నావు ఆనం వర్గం మైనార్టీ నాయకుడు మునాఫ్ నెల్లూరు : ‘ఆనం వివేకానందరెడ్డి ముందు నువ్వు బచ్చా’ అని మాజీ కార్పొరేటర్ మునాఫ్ మేయర్ అబ్దుల్ అజీజ్ పై మండిపడ్డారు. ఏసీ సెంటర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనార్టీలను అడ్డంపెట్టుకుని రూ.కోట్లు దండుకున్న అజీజ్ తమ నాయకుడు వివేకానందరెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఎంతో మంది మైనార్టీలు నెల్లూరులో నాయకులుగా ఎదిగారన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే అజీజ్‌కు అవినీతిపరుడుగా ముద్రపడిందన్నారు. ఆయన వల్ల మైనార్టీలందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. రొయ్యలు వ్యాపారం చేసుకో కానీ ఆనం వివేకాందరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అజీజ్ నెల్లూరు కార్పొరేషన్లో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ అజీజ్‌ను తిక్క పనులు చేస్తున్నావని చెప్పిన విషయం గుర్తుచేశారు. అజీజ్ పోటీ చేసిన, ఆయన తమ్ముడు పోటీ చేసిన స్థానంలో గెలుపొందేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేశారన్నారు. నెల్లూరులో ఆనం బలం తెలుసు కాబట్టే చంద్రబాబునాయుడు స్వయంగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కార్పొరేటర్లను అజీజ్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికైనా శ్రీని వాసులురెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆనం వర్గీయులు ముజీర్, అలియాజ్, షమీమ్, ఏజాస్, నిస్సార్ పాల్గొన్నారు. -
అల్ కాయిదాతోనూ సంబంధం
ఇది మోస్ట వాంటెడ్ ఉగ్రవాది గిడ్డా అజీజ్ గతం నేటి సాయంత్రానికి హైదరాబాద్‌కు తరలింపు సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్‌కు అంతర్జాతీయు ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాతోనూ సంబంధాలున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వచ్చిన అజీజ్‌ను అక్కడి ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. నగరం నుంచి వెళ్లిన సిట్ బృందం గురువారం సాయంత్రానికి అతడిని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. గిడ్డా అజీజ్ గతనెల 18నే సౌదీ నుంచి రావాల్సి ఉండగా... సాంకేతిక కారణాల వల్ల డిపోర్టేషన్ ఆలస్యమైంది. అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా... భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్...ఉగ్రవాదులు ఫసీ, ఆజం ఘోరీల ద్వారా ఉగ్రవాద బట్టాడు. సౌదీకి పారిపోయాక లష్కరే తొయిబా (ఎల్ఈటీ)కి దగ్గరయ్యాడు. అక్కడ ఉండగానే అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాపై జరిగిన ‘9/11’ ఎటాక్స్‌లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ సభ్యుడు ఖాలిద్ షేక్ దగ్గరైన అజీజ్ అతడి పేరోల్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు సంబంధించి అజీజ్‌ను అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా నియమించుకున్నాడు. అప్పట్లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్ఏ)లో కీలకపాత్ర పోషించిన అజీజ్.. ఖాలిద్ నుంచి రూ.9.5 లక్షలు కూడా అందుకున్నాడు. ఆ డబ్బు వెచ్చించి నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ విధ్వంసానికి కుట్రపన్నాడు. అమెరికా నిఘా సంస్థలు 2003 మార్చి 1న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఖాలిద్‌ను అరెస్టు చేయడంతో వీరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా (ఎల్ఈటీ)తో సంబంధాలు ఏర్పరుచుకున్న అజీజ్ దానికి కమాండర్‌గా పని చేశాడు. ప్రస్తుతం ఖాదిల్ షేక్ క్యూబాలోని గ్వాంటనుమలో ఉన్న అమెరికన్ జైల్లో ఉన్నాడు. ‘బెల్జియం’ మిస్టరీ వీడేనా? హైదరాబాద్‌లోని ఆర్పీఓ కార్యాలయం నుంచే 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర అభియోగం మోపారు. అరెస్టు సమయంలో అజీజ్ నుంచి నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. అప్పట్లో ఇతడికి బెల్జియంలో తయారైన తుపాకీ ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. లక్నో నుంచి నగరానికి తీసుకొచ్చిన తర్వాత గిడ్డాఅజీజ్ను 2004 నాటి సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర కేసులో అరెస్టు ప్రకటించనున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఇతర అంశాలతో పాటు ‘బెల్జియం’ కోణాన్నీ విచారించాలని నిర్ణయించారు. 20 ఏళ్ల క్రితమే ‘పీజీపీ’ వినియోగం... ఎలాంటి ఉన్నత విద్య అభ్యసించని గిడ్డా అజీజ్ 20 ఏళ్ల క్రితమే సమాచార మార్పిడికి పెట్టీ గుడ్ ప్రైవరీ (పీజీపీ) విధానాన్ని వినియోగించాడు. బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బోస్నియా నుంచి బయటపడిని జోడ్డానియన్లు కొందరు లండన్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో నగరం నుంచి వీరితో సంప్రదింపులు జరిపేందుకు అజీజ్ పీజీపీ విధానాన్ని వాడాడు. పూర్తిస్థాయి ఎన్క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే ఈ విధానంలో హాట్‌మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని తాను కోరుకున్న వారు మాత్రమే చూసేలా డిజైన్ చేశారు. అజీజ్ 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. -
భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్
-
భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్
⇒ ఎట్టకేలకు డిపోర్టేషన్‌పై... నగరంలో నమోదైన కేసుల్లో మోస్ట్ వాంటెడ్ ⇒ బోస్నియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర ⇒ నకిలీ పాస్‌పోర్ట్ కేసులో తొమ్మిదేళ్ల క్రితం సౌదీలో అరెస్టు ⇒ శిక్షాకాలం పూర్తికావడంతో తిప్పి పంపిన అధికారులు సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ భారత్‌కు వస్తున్నాడు. సౌదీ అరేబియాలో తలదాచుకుని, అక్కడ నుంచే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చాడు. పుష్కరకాలంగా పోలీసు, నిఘా వర్గాలు వేటాడుతున్న ఇతగాడిని తొమ్మిదేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్ట్ కేసులో సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో శిక్ష పూర్తి చేసుకున్న అజీజ్‌ను డిపోర్టేషన్‌పై బలవంతంగా తిప్పి పంపిస్తున్నట్లు హైదరాబాద్ అధికారులకు ఆదివారం సౌదీ నుంచి సమాచారం అందింది. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయం లో అజీజ్ విమానం దిగుతున్నట్లు తెలిసి నగరం నుంచి నిఘా విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇతడిని మంగళ-బుధవారాల్లో సిటీకి తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఫసీ మాడ్యుల్ ద్వారా ఉగ్రబాట... భవానీనగర్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ 1985 నుంచి 87 వర కు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ పంప్లో మేనేజర్‌గా పని చేశాడు. నల్గొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన నిషిద్ధ స్టూడెం ట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ అలి యాస్ ఫసీ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు (ఎల్ఈటీ) అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం)తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరి గిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజం ఘోరీ చని పోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వాలంటీర్లతో కూడిన ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సంస్థకు చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తి ద్వారా రూ.9.5 లక్షలు అందుకున్న అజీజ్ ఆ డబ్బు వెచ్చించి నగరానికి చెందిన యువతనూ ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. రెండు దేశాలు... మూడు పాస్‌పోర్టులు... బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లొచ్చాడు. ఆ యుద్ధా ల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్‌ని యా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరు తో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర పన్నిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. అరెస్టు సమయంలో పోలీసులు నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్ర... మూడేళ్ల పాటు సౌదీలోనే ఉన్న అజీజ్ 2004లో హైదరాబాద్ వచ్చాడు. నగరానికి చెందిన మరికొం దరితో కలిసి సికింద్రాబాద్‌లో ఉన్న గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నింది తుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తిం చిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు. కానిస్టేబుల్ కుమారుడు... అజీజ్ తండ్రి మెహతబ్ అలీ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నగర సాయుధ విభాగంగా పిలిచే సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేసిన అలీ ప్రస్తుతం నగర శివార్లలోని షహీన్‌నగర్‌లో స్థిరపడ్డారు. గిడ్డా సోదరుడు అబ్దుల్ రషీద్ అదే ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. -
క్రికెట్ 'గాయాలు'
సిడ్నీ:క్రికెట్ లో గాయాలు కావడం సర్వసాధారణమే అయినా.. కొన్నిసందర్భాల్లో క్రికెటర్లు మృత్యువుతో సాహసం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ క్రికెటర్లను 'గాయాలు' బాధిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ను అప్పుడప్పుడూ మరణాలు షాక్ కు గురి చేస్తుంటాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో మృత్యువుతో రెండు రోజులు పోరాడి అసువులు బాసాడు. గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరి కొందరు క్రికెట్ తీవ్ర గాయాలతో ఆట నుంచి వైదొలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. *1959 లో అబ్దుల్ అజీజ్.. 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ బాల్ తన ఛాతికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయాడు. చివరకు ఆస్పత్రిలో మరణించాడు. *1960లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు తగలడంతో ఆరు రోజులు కోమాలు ఉన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. *1975 లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్ కు ఇంగ్లండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. అనంతరం అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. *1986లో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ మైకేల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర గాయమయ్యింది. *భారత ఆటగాడు రమణ్ లాంబా షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు. -
మేయర్ కాని మేయర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సొమ్మొకరిది.. సోకొకరిది అనే చందంగా మారింది నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి. ప్రజాస్వామ్య బద్ధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ అయితే.. అప్రజాస్వామికంగా టీడీపీ నేత, కార్పొరేటర్ జెడ్ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అందుకు మంగళవారం 11వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వెలసిన బ్యానర్లే నిదర్శనం. వార్డులో వెలసిన ఆ బ్యానర్లను చూసిన నగర ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఔరా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. అనూహ్యంగా ఏర్పాటు చేసిన పచ్చ బ్యానర్‌ను చూసి టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కార్పొరేటర్‌గా విజయం సాధించి మేయర్ పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ టీడీపీ నేతల ప్రలోభాలకులోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. టీడీపీలో చేరిన నాటి నుంచి మేయర్ అజీజ్‌కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ జోక్యం చేసుకుని పార్టీ శ్రేణులు మేయర్ అజీజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఒకరకంగా హుకుం జారీ చేశారు. అయినా తమ్ముళ్ల తీరు మారకపోవడంతో మంత్రి నారాయణ ఇటీవల టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నుంచి చేరిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి సమక్షంలోనూ మేయర్ అజీజ్‌ను లెక్కచేయకుండా విమర్శలు చేశారు. టీడీపీలోని ఓ వర్గం మంత్రి మాటనూ పెడచెవిన పెట్టింది. కొద్దిరోజులకు అంతా సర్దుకుంటుందని భావిం చారు. అయితే అటువంటిదేదీ జరక్కపోవటంతో రోజురోజుకూ కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో మేయర్ అజీజ్ జన్మభూమి కార్యక్రమాల్లో పెద్దగా హాజరుకాకుండా దూరంగా ఉంటున్నారు. అడుగడుగునా అవమానం నగరంలో మంగళవారం 11వ వార్డులో నెల్లూరు మేయర్ జడ్ శివప్రసాద్ అని పేర్కొంటూ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండటంతో అటు టీడీపీలోనూ.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం తాము ఏ పార్టీలో ఉన్నామో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ‘అనుకున్నదొకటి.. జరిగేదొక్కటి’ అన్నచందంగా మారటంతో ‘పార్టీ మారినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం’ అని ఓ కార్పొరేటర్ మంగళవారం తన వర్గీయుల వద్ద ఆందోళన వ్యక్తం చేయటం కనిపించింది. మేయర్‌గా పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ నగరంలో చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులోభాగంగా పొడి చెత్తను వేరు చేసి వేలం నిర్వహించాలని, వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నారు. అలాగే తడిచెత్తను మినీ డంపింగ్‌యార్డుకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించి తద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని భావించారు. అదేవిధంగా నగరంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వీటి అమలును టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ రెండు కార్యక్రమాలు అటకెక్కినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా మేయర్ వార్డుల్లో పర్యటించాలని భావించారు. అందుకు కొందరు అధికారులు సహకరించకపోవటం.. ఆయా వార్డుల్లోని టీడీపీ కార్పొరేటర్లు నిరాకరించటంతో ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. టీడీపీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నగరపాలక సంస్థ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు అధికారులు, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి మేయర్ అజీజా? జడ్ శివప్రసాదా? అని టీడీపీ శ్రేణులు చర్చించుకోవటం కనిపించింది. -
టీడీపీలో మేయర్ ఒంటరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు ఆ పార్టీ నాయకులతో సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు పార్టీలో సముచితమైన స్థానం లభించడం లేదని సమాచారం. జిల్లాలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నా, వారిలో పది శాతం కూడా మేయర్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదని, ఆయన పార్టీలో ఒంటరి అయ్యారని ఆయన సన్నిహితులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ అండతో పార్టీలో చేరిన అబ్దుల్ అజీజ్‌ను జిల్లాలోని ఇతర నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. నెల్లూరులో జరిగిన పలు కార్యక్రమాలు దీనికి ఊతమందిస్తున్నాయి. గత ఆదివారం తెలుగుదేశానికి చెందిన అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్‌ను మేయర్ ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు ఎవరూ రాక పోవడం గమనార్హం. దీంతో పాటు చమన్‌కు సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ప్రచురించిన ఫ్లెక్సీల్లో కూడా టీడీపీ నేతల పేర్లు, ఫోటోలు లేవు. చమన్‌ను పలకరించేందుకు టీడీపీ నేతలు ఎవరూ రాలేదు. దీనికి కారణం ఈ కార్యక్రమాన్ని అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేయడమేనని సమాచారం. చమన్ సన్మాన సమాచారాన్ని టీడీపీ నాయకులకు చేరవేయలేదని అజీజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి ముందు జరిగిన ఒక కార్యక్రమానికి నాయకులను ఆహ్వానించినా, ఎవరూ రాక పోవడం గమనార్హం. ఇటీవల ఎనిమిది, పదో డివిజన్లలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని అజీజ్ నిర్వహించారు. దీనికి పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్ రెడ్డి, అనూరాధలను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వీళ్లెవ్వరూ హాజరు కాలేదు. అలాగే మంగళవారం 54వ డివిజన్లో నీరు-చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిం చారు. పార్టీ నేతలు ఎవరూ రాక పోవడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అబ్దుల్ అజీజ్ ఇంత వరకు మినీ బైపాస్ రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయానికి రాక పోవడాన్ని కూడా తప్పు బడుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీలో అజీజ్ ఎదుగుదలను అడ్డుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏళ్ల తరబడి తాము పార్టీలో కొనసాగుతున్నామని, కొత్తగా అడ్డదారిలో వచ్చిన అజీజ్‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి, పార్టీలోని మరో వర్గం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనను నెల్లూరు నగరానికి తీసుకొచ్చేందుకు అబ్దుల్ అజీజ్ ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా అజీజ్ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, నగరంలో రోడ్డుకు ఇరు వైపులా సున్నం చల్లడం, రోడ్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారు. నీరు-చెట్టు కార్యక్రమం నెల్లూరులో చేపడితే, అజీజ్ సీఎంకు సన్నిహితంగా మెలుగుతాడని భావించిన రెండో వర్గం ఆ కార్యక్రమాన్ని వెంకటాచలంలోనే పూర్తి చేయించారు. నగర కార్పొరేషన్ పరిధిలోకి రానివ్వకుండా చేయగలిగారు. అడ్డుంకులను ఎదుర్కొంటూ మేయర్ అబ్దుల్ అజీజ్ ఎంత కాలం ఎదురీదుతారో వేచి చూడాల్సిందే. -
వేటు వేయాల్సిందే!
పార్టీ ఫిరాయించిన మేయర్‌పై అనర్హత వేటుకు డిమాండ్ కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చిన ఎమ్మెల్యేలు 18న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది మేయర్ పీఠాన్ని అధిరోహించిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ గురువారం నగర, రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టరుకు మెమొరాండం అందజేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అయిన కలెక్టరు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్లు మెమొరాండం అందజేశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన అబ్దుల్ అజీజ్‌తో పాటు మరో 12 మంది కార్పొరేటర్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయాన్ని తెలిపారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. దీనికి కలెక్టరు సానుకూలంగా స్పందించారు. కలెక్టరేట్ వెలుపల నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ మేయరుతో పాటు 12 మంది కార్పొరేటర్లపై యాంటీ డిఫెక్షన్ లాను బనాయించి అనర్హత వేటు వేయాలని, తదుపరి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటూ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన కావలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటుపడినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, 20 రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మోసంతో కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు తిరిగి వైఎస్ఆర్సీపీకి దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన కార్పొరేటర్లు తాము ఎంత పెద్ద తప్పుచేశామో అని ఆవేదన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఇప్పటికైనా వారు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోవాలని సూచించారు. ఎవరో ఏదో చెప్పారని, అమాయకంగా పార్టీ ఫిరాయించిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావలి చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేయడాన్ని ప్రస్తావిస్తూ, నెల్లూరులో కూడా ఆ సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే, వెళ్లిన వారు తిరిగిరావాలని సూచించారు. సోమవారం ఎన్నికల కమిషన్‌ను కలుసుకుని, ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారి తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. త్వరలో పార్టీ ఫిరాయించిన జెడ్పీటీసీలపైన కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్పొరేటర్లలో నిబద్ధత ఉండాలని సూచించారు. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ అన్ని మునిసిపల్ స్థానాలు కూడా దక్కించుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రూప్‌కుమార్ యాదవ్, బొబ్బల శ్రీనివాసులు, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
'నెల్లూరు మేయర్ అజీజ్ పై అనర్హత వేటు వేయండి'
నెల్లూరు: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు 12 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ పై చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు వైస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన అజీజ్ కు మేయర్ గా కొనసాగే హక్కులేదని కోటంరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి నెల్లూరు మేయర్ గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
పార్టీ మారే విషయమై పునరాలోచించుకోవాలి
నెల్లూరు : పార్టీ మారే విషయమై మేయర్ అబ్దుల్ అజీజ్ పునరాలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఒకవేళ అజీజ్ పార్టీ మారాలనుకుంటే మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం రేయింబవళ్లు నిద్దుర మానుకుని పనిచేశామని, టీడీపీ ఆగడాలను అడ్డుకుని మేయర్‌ను చేస్తే ఇప్పుడు అజీజ్ అందరిని వంచించి టీడీపీలో చేరుతున్నానంటూ చెప్పడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు అజీజ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
సుందరనగరంగా నెల్లూరు
నెల్లూరు(అర్బన్): నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌గా అజీజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత నగరంలోని గాంధీ, అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు అజీజ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పూలదండలు వేశారు. ర్యాలీగా నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. మేయర్‌కు నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అధికారులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు వెంటరాగా మేయర్ అజీజ్ తన చాంబరులోకి అడుగుపెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ, వెంకయ్యనాయుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగా ఉండటం అదృష్టమన్నారు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లి నెల్లూరును అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రధానంగా మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తాగునీరు, డ్రెయినేజి సౌకర్యం కల్పించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా నగర పాలక సంస్థ పాఠశాలలు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై కూడా దృష్టి కేంద్రీకరించున్నట్లు తెలిపారు. అనేక ఆసుపత్రులు శిథిలావస్థకు చేరినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నగర పాలక సంస్థ సిబ్బందికి, ప్రజలకు మధ్య స్నేహభావం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్యాక్రాంతమైన కార్పొరేషన్ ఆస్తులు పరిరక్షించుకునేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరును పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. నగర పాలక సంస్థలో అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అధికారులెవరైనా అవి నీతికి పాల్పడి ఉంటే చట్ట పరిధిలో చర్యలుంటాయని చెప్పారు. గతంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తప్పులు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తమ హయాంలో ఎవరిపై ఒత్తిళ్లు ఉండవని, ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకోవచ్చన్నారు. గతంలో జరిగిన అక్రమాలు బయటపడితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. అన్ని డివిజన్లలో ఉద్యోగుల ఫోన్ నంబర్లు నగరంలోని అన్ని డివిజన్లలో ఆ ప్రాంతానికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్‌వర్క్స్ అధికారి, వీధి దీపాలకు సంబంధించిన సిబ్బంది లేదా అధికారి ఫొటో, ఫోన్ నంబరు ప్రదర్శిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడుతుందో ఆ ప్రాంత అధికారికి త్వరగా సమాచారం అంది, సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. వారికి చెప్పినా సమస్యకు పరిష్కారం లభించకపోతే కమిషనర్ లేదా తనకు ఫోన్ చేయాలని తెలిపారు. అదేవిధంగా కమిషనర్, మేయర్ ఈ-మెయిళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, తమకు మెయిల్ ద్వారా కూడా సమస్య తెలుపవచ్చన్నారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. ఎన్నికల వరకే పార్టీల జెండాలు ఎన్నికల వరకే పార్టీల జెండాలుంటాయని అనంతరం అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉంటుందని మేయర్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయని, ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉందని, అభివృద్ధి ఎలా చేస్తారనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ తనకు విద్య నేర్పిన గురువని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తన కుటుంబానికి సన్నిహితుడని, నెల్లూరు నగర అభివృద్ధికి వారితో మాట్లాడి నిధులు సాధిస్తానని అజీజ్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నామని తెలిపారు. సర్వమత ప్రార్థనలు అబ్దుల్అజీజ్ కార్పొరేషన్ కార్యాలయంలోకి రావడంతోనే సర్వమత ప్రార్థనలు చేశారు. పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. నూతన మేయర్ అజీజ్‌కు పలువురు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాజీ మేయర్ పులిమి శైలజ, పలువురు వైఎస్సార్‌కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి అభినందించారు. -
వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
జగన్మోహన్రెడ్డి పిలుపు నెల్లూరు(అర్బన్) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి నెరవేర్చేందుకు కృషి చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు సూచించారు. సోమవారం మేయర్ అబ్దుల్ అజీజ్, ఆయన సోదరుడు 42వ డివిజన్ కార్పొరేటర్ జలీల్ హైదరాబాద్‌లో జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 52 ఏళ్ల తర్వాత నెల్లూరు పట్టణాన్ని పాలించే అవకాశం మైనార్టీలకు దక్కిందని, ఇది జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని అజీజ్ పేర్కొన్నారు. రాజకీయంగా తమకు వైఎస్సార్సీపీ జన్మనిచ్చిందని పార్టీ అధినేతకు అజీజ్, జలీల్ తెలిపారు. పార్టీ తమమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు సేవ చేస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేయాలని అజీజ్, జలీల్‌కు జగన్ సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మేయర్ అజీజ్ తాము ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలనుకున్నామో జగన్‌కు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు ఒక ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కుల,మతాలకు అతీతంగా ప్రజలందరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని, నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నగరాభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం కూడా తాము హైదరాబాద్‌లోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మేయర్ అజీజ్ వెల్లడించారు. జగన్‌ను నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ కూడా కలిశారు.