అల్ కాయిదాతోనూ సంబంధం | associated with alkayida | Sakshi
Sakshi News home page

అల్ కాయిదాతోనూ సంబంధం

Published Thu, Feb 4 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

అల్ కాయిదాతోనూ సంబంధం

అల్ కాయిదాతోనూ సంబంధం

ఇది మోస్ట వాంటెడ్ ఉగ్రవాది గిడ్డా అజీజ్ గతం
నేటి సాయంత్రానికి హైదరాబాద్‌కు తరలింపు

 
సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్‌కు అంతర్జాతీయు ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాతోనూ సంబంధాలున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి.  బుధవారం తెల్లవారుజామున సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వచ్చిన అజీజ్‌ను అక్కడి ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. నగరం నుంచి వెళ్లిన సిట్ బృందం గురువారం సాయంత్రానికి అతడిని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. గిడ్డా అజీజ్ గతనెల 18నే సౌదీ నుంచి రావాల్సి ఉండగా... సాంకేతిక కారణాల వల్ల డిపోర్టేషన్ ఆలస్యమైంది.
 
అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా...
భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్...ఉగ్రవాదులు  ఫసీ, ఆజం ఘోరీల ద్వారా ఉగ్రవాద బట్టాడు. సౌదీకి పారిపోయాక లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)కి దగ్గరయ్యాడు. అక్కడ ఉండగానే అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాపై జరిగిన ‘9/11’ ఎటాక్స్‌లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ సభ్యుడు ఖాలిద్ షేక్ దగ్గరైన అజీజ్ అతడి పేరోల్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు సంబంధించి అజీజ్‌ను అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా నియమించుకున్నాడు.  అప్పట్లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్‌ఏ)లో కీలకపాత్ర పోషించిన అజీజ్.. ఖాలిద్ నుంచి రూ.9.5 లక్షలు కూడా అందుకున్నాడు. ఆ డబ్బు వెచ్చించి నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ విధ్వంసానికి కుట్రపన్నాడు. అమెరికా నిఘా సంస్థలు 2003 మార్చి 1న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఖాలిద్‌ను అరెస్టు చేయడంతో వీరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధాలు ఏర్పరుచుకున్న అజీజ్ దానికి కమాండర్‌గా పని చేశాడు. ప్రస్తుతం ఖాదిల్ షేక్ క్యూబాలోని గ్వాంటనుమలో ఉన్న అమెరికన్ జైల్లో ఉన్నాడు.
 
‘బెల్జియం’ మిస్టరీ వీడేనా?
హైదరాబాద్‌లోని ఆర్పీఓ కార్యాలయం నుంచే 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర అభియోగం మోపారు. అరెస్టు సమయంలో అజీజ్ నుంచి నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. అప్పట్లో ఇతడికి బెల్జియంలో తయారైన తుపాకీ ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. లక్నో నుంచి నగరానికి  తీసుకొచ్చిన తర్వాత గిడ్డాఅజీజ్‌ను 2004 నాటి సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర కేసులో అరెస్టు ప్రకటించనున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఇతర అంశాలతో పాటు ‘బెల్జియం’ కోణాన్నీ విచారించాలని నిర్ణయించారు.
 
 20 ఏళ్ల క్రితమే ‘పీజీపీ’ వినియోగం...
ఎలాంటి ఉన్నత విద్య అభ్యసించని గిడ్డా అజీజ్ 20 ఏళ్ల క్రితమే సమాచార మార్పిడికి పెట్టీ గుడ్ ప్రైవరీ (పీజీపీ) విధానాన్ని వినియోగించాడు. బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బోస్నియా నుంచి బయటపడిని జోడ్డానియన్లు కొందరు లండన్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో నగరం నుంచి వీరితో సంప్రదింపులు జరిపేందుకు అజీజ్ పీజీపీ విధానాన్ని వాడాడు. పూర్తిస్థాయి ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే ఈ విధానంలో హాట్‌మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని తాను కోరుకున్న వారు మాత్రమే చూసేలా డిజైన్ చేశారు. అజీజ్ 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement