గువాహటి/కోల్‌కతా: కల్లోల మణిపూర్‌లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది.
ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్‌కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్ డెవలప్‌మెంట్ బ్లాక్ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు.
వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు.
వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం
మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ మాజీ మిలిటెంట్ గ్రూప్‌నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్‌లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment