militant group
-
సిరియా పయనమెటు?
ఒకే ఒక్క వారం. కేవలం ఏడు రోజుల వ్యవధిలో సిరియాలో సర్వం మారిపోయింది. పాలకుడు బషర్ అల్ అసద్ కాడి పడేసి పారిపోయాడు. దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోయింది. అసద్‌ల 50 ఏళ్ల నియంతృత్వ పాలనకు ఎట్టకేలకు తెర పడిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైనా, రెబెల్స్ పాలనలో సిరియా మరో అఫ్గాన్‌గా మారొచ్చన్న అంచనాలు అంతర్జాతీయ సమాజంలో గుబులు రేపుతున్నాయి. కుట్రలు, అంతర్యుద్ధం తదితరాల పరిణామంగా 1970లో గద్దెనెక్కిన హఫీజ్ అల్ అసద్ నియంతృత్వ పోకడలకు మారుపేరుగా పాలించారు. 1982లో ఇస్లామిక్ ఫ్రంట్ సారథ్యంలో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణిచేసే క్రమంలో ఏకంగా 40 వేల పై చిలుకు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. 2000లో గద్దెనెక్కిన బషర్ నియంతృత్వ పోకడల్లోనూ, క్రూరత్వంలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. 2011 అరబ్ విప్లవాన్ని అణిచివేసేందుకు ఏకంగా 4 లక్షల పై చిలుకు మందిని బలి తీసుకున్నారు. ఆయన పాతికేళ్ల పాలనలో కనీసం 5 లక్షల మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డట్టు అంచనా. అంతటి రక్తసిక్త చరిత్రను వారసత్వంగా మిగిల్చి అవమానకర పరిస్థితుల్లో దేశం వీడి రష్యాలో తలదాచుకున్నారు. సాయుధ మిలిటెంట్ గ్రూప్ హయాత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) సారథి అబూ మొహ్మద్ అల్ జొలానీ అలియాస్ అహ్మద్ అల్ షరాకు సిరియా ప్రధాని మొహమ్మద్ గాజీ జలాలీ తాజాగా లాంఛనంగా అధికారాన్ని అప్పగించారు. దాంతో అసద్‌ల 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర పడ్డా సిరియా భవితవ్యం మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. హెచ్‌టీఎస్ సారథ్యంలో ఏర్పడబోయే సర్కారుకు ముళ్లబాటే స్వాగతం పలుకుతోంది. ఇప్పటికైతే మధ్యేమార్గమే! అసద్ ఇంత త్వరగా పారిపోతారని, దేశం తమ సొంతమవుతుందని నిజానికి హెచ్‌టీఎస్ కూడా ఊహించలేదు. దాంతో మిగతా మిలిటెంట్ గ్రూపులు, రాజకీయ పారీ్టలు తదితరాలతో చర్చలు జరపడం, వాటితో అధికార పంపిణీ క్రతువును సజావుగా పూర్తి చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దానికి సవాలుగా మారింది. దాంతోపాటు జొలానీ సారథ్యంలో కొలువుదీరబోయే హెచ్‌టీఎస్ సర్కారుకు అంతర్జాతీయ గుర్తింపు ఏ మేరకు దక్కుతుందనేది కూడా కీలకమే. ఈ విషయంలో కీలక పొరుగు దేశమైన తుర్కియేతో పాటు యూరోపియన్ యూనియన్, అమెరికాలది కీలక పాత్ర కానుంది. హెచ్‌టీఎస్ మూలాలు అల్‌ఖైదాతో ముడిపడి ఉండటం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేలా కని్పస్తోంది. పూర్తి ప్రజాస్వామిక పాలనపై ఎవరికీ ఆశలు లేకపోయినా, అతివాద పోకడలకు హెచ్‌టీఎస్ తాత్కాలికంగానైనా దూరంగా ఉండాల్సి రావచ్చు. అంతేగాక కుర్ది‹Ùల స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సమాజం విధించే పలు షరతులకు కట్టుబడాల్సిన పరిస్థితి తలెత్తేలా కని్పస్తోంది. ఈ దిశగా జొలానీ ఇప్పటికే పలు సంకేతాలైతే ఇచ్చారు. విపక్షాల పట్ల సహయంతో వ్యవహరిస్తామని సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మతపరమైన మైనారిటీల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాదిరిగా మహిళల వస్త్రధారణపై ఆంక్షల వంటి వాటి జోలికి పోబోమని సోమవారం ఆయన కుండబద్దలు కొట్టారు కూడా. అయితే శరణార్థులుగా దేశాలు పట్టుకుని పోయిన సిరియన్ల తిరిగి రాక మరో పెద్ద అంశం కానుంది. అంతర్గత కల్లోలం నేపథ్యంలో కొన్నేళ్లుగా భారీగా దేశం వీడిన సిరియన్లంతా తిరిగొస్తున్నారు. వారందరికీ ఆశ్రయంతో పాటు ఉపాధి కల్పన సవాలు కానుంది. వీటికి తోడు పలు ప్రాంతాలను ఆక్రమించుకుని గుప్పెట్లో పెట్టుకున్న చిన్నాచితకా మిలిటెంట్ గ్రూపులతో కొత్త ప్రభుత్వం నెట్టుకొస్తుందనేది ఆసక్తికరం.స్థిరత్వం నెలకొనాలి: భారత్న్యూఢిల్లీ/మాస్కో/జెరూసలేం: సిరియాలో వీలైనంత త్వరగా స్థిరత్వం నెలకొంటుందని భారత్ ఆశాభావం వెలిబుచి్చంది. సిరియాలోని భారతీయుల క్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. సిరియాలో అధికార మార్పును ఈయూతో పాటు అమెరికా తదితర దేశాలు స్వాగతించాయి.అసద్‌కు ఆశ్రయమిచ్చాం: రష్యాఅసద్కు రాజకీయ ఆశ్రయం కలి్పంచినట్టు రష్యా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో ఆయన ఎక్కడ తలదాచుకున్నదీ వెల్లడించలేదు.ఇజ్రాయెల్ వైమానిక దాడులుసిరియాలో పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సోమ వారం భారీ వైమానిక దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి రాకెట్లు, రసాయనిక ఆయుధాలు రెబెల్స్ చేతిలో పడకుండా వాటిని ధ్వంసం చేసేందుకే దాడులు చేసినట్టు ప్రకటించింది. అమెరికా కూడా సిరియా లో 75 ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
Manipur violence: మొయితీల వలసబాట
గువాహటి/కోల్‌కతా: కల్లోల మణిపూర్‌లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది. ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్ డెవలప్మెంట్ బ్లాక్ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు. వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మాజీ మిలిటెంట్ గ్రూప్‌నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్‌లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట ఆరోపించింది. -
జీనియస్.. లెక్కలేనంత ఇష్టం!
వాషింగ్టన్: పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర ముఠాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రసంస్థలపై తగు కఠిన చర్యలు తీసుకోకుండా పాక్ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తోందని తన తాజా నివేదికలో అమెరికా తీవ్రంగా విమర్శించింది. మసూద్ అజర్, సాజిద్ మీర్ లాంటి ఉగ్రవాద నేతలు స్వేచ్ఛగా పాక్‌లో సంచరిస్తున్నా, వీరిని పాక్ అదుపులోకి తీసుకోవడంలేదని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదానికి సంబంధించిన 2020–నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం విడుదలచేశారు. అఫ్గానిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్వర్క్ దాడులు చేస్తూనే ఉన్నాయని, మరోవైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో కోర్టులు జైలు శిక్షను విధించాయని తెలిపింది. ఎఫ్ఏటీఏ గ్రేలిస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ కొన్ని చర్యలు చేపట్టిందని, కానీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారని నివేదిక తెలిపింది. ఐసిస్‌లో 66 మంది భారతీయ సంతతి! అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌లో 66మంది భారతీయ సంతతికి చెందినవారున్నారని ఉగ్రవాదంపై అమెరికా నివేదిక శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ, స్థానిక ఉగ్ర మూకలను గుర్తించి నిర్మూలించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏలాంటి భారత ఉగ్రవ్యతిరేక దళాలను నివేదిక ప్రశంసించింది. ఎయిర్‌పోర్టుల్లో కార్గో పరీక్షకు రెండు తెరల ఎక్స్రేతెరలను వాడేందుకు భారత్ అంగీకరించిందని నివేదిక తెలిపింది. అలాగే వాయుమార్గంలో ప్రయాణించే వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించే ఐరాస ప్రతిపాదన అమలకు కూడా ఇండియా సుముఖంగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ తెలిపారు. పలు ఒప్పందాల ద్వారా ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని వెల్లడించా రు. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్ఐఏ విచారించిందని, 160మందిని అరెస్టు చేసిందని, వీరిలో 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లని నివేదిక తెలిపింది. ఉగ్రసమాచారం అందించాలన్న యూఎస్ అభ్యర్థనకు భారత్ సానుకూలంగా స్పందిస్తోందని బ్లింకెన్ తెలిపారు. టెర్రరిస్టుల్లో టెక్నాలజీ వాడకంపై భారతీయ అధికారులు ఆందోళనగా ఉన్నారన్నారు. పలు దేశాలతో భారత్ ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. -
అమెరికా సాయం అక్కర్లేదు!
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో పెట్రేగుతున్న ఐసిస్ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి. వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. తాజాగా అఫ్గాన్ మసీదులో ఐసిస్ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్ చెప్పారు. యూఎస్ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు. గుర్తింపు కోసం కాదు తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్ నిధులను విడుదల చేయాలని పాక్ యూఎస్‌ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అఫ్గాన్‌కు... తాలిబన్ల దాడికి వెరిచి భారత్‌కు పారిపోయివచి్చన అఫ్గాన్ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. -
సిరియాపై అమెరికా వైమానిక దాడులు
బాగ్దాద్: సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది. అయితే ఇరాక్ బలగాల అధికారి మాత్రం ఒక్కరే మరణించారని, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సైనిక చర్యలకు దిగడం ఇదే మొదటిసారి. సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కతాబ్ హెజ్బుల్లా గ్రూపుకి చెందిన స్థావరాలకు మారణాయుధాలను తీసుకువెళుతున్న మూడు లారీలు అమెరికా దాడుల్లో ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా బ్రిగేడ్స్ అని కూడా ఈ గ్రూపును పిలుస్తుంటారు. ఇరాక్‌లో అమెరికా బలగాలకు అండగా ఉంటాం : ఆస్టిన్ సిరియాలో వేటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగామో తమకు బాగా తెలుసునని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల్ని మరింతగా విస్తరించి పట్టు పెంచుకోవడం కోసం బైడెన్ ఈ దాడులకు ఆదేశాలివ్వలేదని, ఇరాక్‌లో అమెరికా బలగాలకు మద్దతుగా ఉండడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆస్టిన్ స్పష్టం చేశారు. లెబనీస్ హెజ్బుల్లా ఉద్యమం నుంచి విడిపోయిన ఇరాకీ కతాబ్ గ్రూపు మిలిటెంట్లు గతంలో ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పలు దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్యం చాలాసార్లు ఆరోపించింది. -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు
మహబూబాబాద్ రూరల్: ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 414 తుపాకీ తూటాల డంపు, పార్టీ సాహిత్యాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఆదివారం మానుకోట సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పరిధి మామిడిగూడెం, మిర్యాలపేట ప్రాంతాలకు చెందిన బండి సుధాకర్, కల్తి సమ్మయ్య, పోలెబోయిన సారయ్య మావోయిస్టు మిలిటెంట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ముగ్గురిని ఆదివారం దుబ్బగూడెంలో అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు రామారం, పొనుగొండ్ల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఒక డంపులోని మూడు వేర్వేరు బ్యాగుల్లో 414 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం క్రితం మావోయిస్టు పార్టీ నాయకులైన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి, కుర్పం మంగు అలియాస్ భద్రు, మడకం సింగి అలియాస్ అనిత అలియాస్ శాంత, ముచాకి ఉంగాల్ అలియాస్ సుధాకర్, కర్ణాకర్ అలియాస్ క్రాంతి, కొవ్వాసి గంగా అలియాస్ మహేశ్, వెట్టి భీమాలు అలియాస్ భీమా, యాలమ్ నరేందర్ అలియాస్ సంపత్, కొమ్ముల నరేశ్ అలియాస్ బయ్యన్న, మేదరి భిక్షపతి అలియాస్ విజేందర్‌తో పాటు మరికొంత మంది వీరి వద్ద తూటాలను దాచిపెట్టారని ఎస్పీ వివరించారు. ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ముగ్గురు మిలిటెంట్ల అరెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన గూడూరు సీఐ బాలాజీ, కొత్తగూడ, గంగారం ఎస్సైలు తాహెర్‌బాబా, రామారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ సాగర్, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ నిజాముద్దీన్, డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్‌ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. రాష్ట్రంలో మళ్లీ తిష్ట వేయడానికి.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలు మావోయిస్టు నక్సల్స్‌ను తిరస్కరించడం వల్ల ఈ ప్రాంతంలో పనిచేసే వారంతా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయారని తెలిపారు. మళ్లీ ఇక్కడ అలజడి సృష్టించేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ పథకం పన్ని హరిభూషణ్, కంకణాల రాజిరెడ్డి, దామోదర్, భద్రు, ఆజాద్‌లను తెలంగాణలో పని చేయాలని పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ గుత్తికోయ నక్సల్స్‌ను సైతం పంపుతోందని, ప్రజలు వారి కుయుక్తులను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. -
ఆ మల్లన్న.. కూర రాజన్న!
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వాధికారి, కాంట్రాక్టర్‌ను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ గుట్టు బట్టబయలవుతోంది. ఆ గ్యాంగ్ వెనుక ఉన్న పాత్రధారులను ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. సాదాసీదా ముఠాగా భావించిన సిద్దిపేట మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా కన్పిస్తోంది. ఈ గ్యాంగ్ వ్యవహారాలు పోలీస్ శాఖనే కలవరానికి గురిచేస్తున్నాయి. కదలికల్లేవని భావిస్తున్న జనశక్తి నేతలు మళ్లీ యాక్టివ్ అవడం, మల్లన్న మిలిటెంట్ పేరుతో కార్యకలాపాలు సాగించడం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ‘ఎవరన్నా.. ఈ మల్లన్న’శీర్షికన ఇటీవల ‘సాక్షి’ప్రచురించిన కథనం సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సంచలనం రేపింది. మాజీ జనశక్తి నేత కూర రాజన్న నేతృత్వంలోనే సిద్దిపేట, మెదక్, సిరిసిల్లలో మల్లన్న మిలిటెంట్ దళం పేరుతో ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లను కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల కింద సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్‌ను నలుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. కూర రాజన్నకు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ నక్సలైట్ సాయి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 ఎం.ఎం. పిస్టల్‌తో పాటు 19 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో ప్రజాప్రతినిధులు.. కూర రాజన్న నేతృత్వంలో ఏర్పడ్డ ఈ గ్యాంగ్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులుండటం సంచలనం రేపుతోంది. ఏకంగా ఓ జెడ్పీటీసీ, ఓ ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త.. సాయితో కలసి ఇంజనీర్‌ను బెదిరించి తీసుకున్న డబ్బును పంచుకున్నట్లు గుర్తించారు. అదే రీతిలో మెదక్, సిరిసిల్లలో ఇతర అధికారులు, కాంట్రాక్టర్లను అక్కడి లోకల్ గ్యాంగ్‌తో కలసి సాయి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)గుర్తించింది. అయితే సాయికి రాజన్న ద్వారానే పిస్టల్ లభించిందని, ఆయన నేతృత్వంలోనే వీళ్లంతా వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి స్పష్టం చేశారు. పోలీసుల అదుపులో ప్రజాప్రతినిధులు.. సిద్దిపేట జిల్లా తొగుట పోలీసుల అదుపులో పలువురు ప్రజాప్రతినిధులున్నట్టు తెలిసింది. అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఎవరిని బెదిరించారు.. ఈ గ్యాంగ్‌కు నకిలీ నోట్ల చెలామణి నిందితుడు ఎల్లంగౌడ్‌కు ఉన్న లింకులేంటన్న కోణంలో వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త ఉన్నట్లు తెలిసింది. కీలకంగా భావిస్తున్న జెడ్పీటీసీ పరారీలో ఉన్నారని, ఎల్లంగౌడ్ సైతం పరారీలోనే ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
‘ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా ఉగ్రవాదులే’
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీ విచారణ కొనసాగుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు గత శుక్రవారం ఆమెను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు మహిళా అధికారులతో ఆమెను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదరిగా భావిస్తాడు గనుకే.... విచారణ భాగంగా ఆసియా చెప్పిన పలు విషయాలను ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆసియా.. హఫీజ్ తనను సోదరిగా భావిస్తాడని అందుకే తనతో ఎల్లప్పుడూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రభుత్వం ఆసియా పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఎన్ని సార్లు గృహ నిర్భందం విధించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదన్నారు. అనేక మంది లష్కర్ ఉగ్రవాదులు ఆసియాను ట్విటర్లో ఫాలో అవుతున్నట్లు గుర్తించామన్న ఆయన.. వీరిలో చాలా మంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తోన్న వారేనని తెలిపారు. భారత దేశాన్ని, జాతీయతను వ్యతిరేకిస్తూ ఉర్దూ భాషలో అనేక ట్వీట్లు చేసిన ఆసియా.. ర్యాలీలు నిర్వహించి మరీ మహిళా విద్యార్థులను రెచ్చగొట్టేవారని పేర్కొన్నారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే పలువురు విద్యార్థులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు పలుమార్లు అరెస్టయ్యారు. ఆసియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
‘ఇక్కడ మేం బతకలేం’
కాబుల్ : వరుస ఉగ్రదాడులతో అప్ఘానిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు భయానికి లోనవుతున్నారు. దేశంలో జీవించలేమంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలాలాబాద్‌లోని సిక్కులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్ ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది హిందువులు, సిక్కులు కాగా.. మరో ఇద్దరు అఫ్గాన్ జాతీయులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ దేశ హిందువులు, సిక్కులు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో మేం జీవించలేం అంటూ మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘ ఇక్కడ ఉంటే ఎక్కువ రోజులు బతకలేమని నాకు అర్థమయింది. ముస్లిం టెర్రరిస్టులు మమ్మల్ని బతకన్విరు’ అంటూ మృతుల బంధువు ఒకరు భయాన్ని వ్యక్తం చేశారు. మా మతాల వారిని ఉగ్రవాదులు వదలేలా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం అప్ఘనిస్తానీయులమని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్ చేశారు. ముస్లీం టెర్రరిస్టులు మాపై దాడికి పాల్పడుతున్నారు’ అని ఆఫ్ఘాన్ హిందూ, సిక్కుల ఫ్యానెల్ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. ‘హిందూ, సిక్కులకు అప్ఘాన్లో రాజకీయ, ఇతర అంశాలల్లో సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ పక్షపాత ధోరణితో ముస్లీంలు మమ్మల్ని అణచివేస్తున్నారు. ఉగ్రవాదులు వేధింపులకు తాళలేక వేలాది మంది ఇండియాకు వలస వెళ్లారు. ఇప్పుడు మాకు రెండే దారులు ఉన్నాయి, ఇండియాకు వలస వెళ్లడం లేదా ముస్లిం మతం స్వీకరించడం.అలా చేస్తేనే ఈ దేశంలో మేం బతకగల్గుతాం’ అని మృతుల బంధువులు వాపోతున్నారు. కాగా అప్ఘాన్ హిందూ, సిక్కులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని రోజులైనా ఇండియాలో జీవించవచ్చని అప్ఘాన్ భారత రాయబారి విజయ్ కుమార్ వెల్లడించారు. వారికి మేం రక్షణగా ఉంటాం. అన్ని సౌకర్యాలు అందిస్తాం అని తెలిపారు. -
4 వేల మందిని ఉరితీసిన ఐఎస్ఐఎస్
లండన్: ప్రపంచ అగ్రదేశాలపై దాడులు చేస్తూ వస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. అయితే ఈ ఉగ్ర సంస్థ గత రెండేళ్ల కాలంలో 4 వేల కంటే ఎక్కువ మందిని ఉరితీసింది. ఈ విషయాన్ని యూకేకు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికైనా ఈ విషయాన్ని తీవ్రమైన నేరాలుగా భావించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయకులను ఉరితీయడంతో పాటు కాల్పులు జరపడం, బాంబు దాడులకు పాల్పడటం లాంటి హేయమైన చర్యలకు ఐఎస్ఎస్ పాల్పడుతుందని వారు ఆవేదన చెందారు. 4,144 మందిని ఉరితీసినట్లు మానవ హక్కుల సంస్థ అధికారికంగా వెల్లడించింది. సున్నీలు, కుర్దిష్ సిటిజన్లే ఈ మృతులలో 2,230 మంది ఉన్నారు. గుఢచర్యానికి పాల్పడుతున్నాడన్న అనుమానంతో సొంత సోదరుడినే హత్య చేస్తున్న ఘటనలు ఐఎస్ఎస్ సంస్థ కార్యకలాపాలతో భాగమవుతున్నాయి. కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఈ ఏదాడి మార్చి నాటికి 80 మందిని హత్య చేయగా అందులో చిన్నారులు, ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని యూకే సంస్థ వెల్లడించింది. 13 ఏళ్ల చిన్నారులు కూడా చేతుల్లో భయంకరమైన ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని, కొన్ని నెలల కిందట ఏకే 47లతో ఆరుగురి తలలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యచేయడంపై ఎస్ఓహెచ్ఆర్ ఉన్నతాధికారి విచారం వ్యక్తంచేశారు. -
అల్ కాయిదాతోనూ సంబంధం
ఇది మోస్ట వాంటెడ్ ఉగ్రవాది గిడ్డా అజీజ్ గతం నేటి సాయంత్రానికి హైదరాబాద్‌కు తరలింపు సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్‌కు అంతర్జాతీయు ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాతోనూ సంబంధాలున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వచ్చిన అజీజ్‌ను అక్కడి ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. నగరం నుంచి వెళ్లిన సిట్ బృందం గురువారం సాయంత్రానికి అతడిని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. గిడ్డా అజీజ్ గతనెల 18నే సౌదీ నుంచి రావాల్సి ఉండగా... సాంకేతిక కారణాల వల్ల డిపోర్టేషన్ ఆలస్యమైంది. అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా... భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్...ఉగ్రవాదులు ఫసీ, ఆజం ఘోరీల ద్వారా ఉగ్రవాద బట్టాడు. సౌదీకి పారిపోయాక లష్కరే తొయిబా (ఎల్ఈటీ)కి దగ్గరయ్యాడు. అక్కడ ఉండగానే అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాపై జరిగిన ‘9/11’ ఎటాక్స్‌లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ సభ్యుడు ఖాలిద్ షేక్ దగ్గరైన అజీజ్ అతడి పేరోల్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు సంబంధించి అజీజ్‌ను అల్ కాయిదా రెసిడెంట్ ఏజెంట్‌గా నియమించుకున్నాడు. అప్పట్లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్ఏ)లో కీలకపాత్ర పోషించిన అజీజ్.. ఖాలిద్ నుంచి రూ.9.5 లక్షలు కూడా అందుకున్నాడు. ఆ డబ్బు వెచ్చించి నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ విధ్వంసానికి కుట్రపన్నాడు. అమెరికా నిఘా సంస్థలు 2003 మార్చి 1న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఖాలిద్‌ను అరెస్టు చేయడంతో వీరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా (ఎల్ఈటీ)తో సంబంధాలు ఏర్పరుచుకున్న అజీజ్ దానికి కమాండర్‌గా పని చేశాడు. ప్రస్తుతం ఖాదిల్ షేక్ క్యూబాలోని గ్వాంటనుమలో ఉన్న అమెరికన్ జైల్లో ఉన్నాడు. ‘బెల్జియం’ మిస్టరీ వీడేనా? హైదరాబాద్‌లోని ఆర్పీఓ కార్యాలయం నుంచే 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర అభియోగం మోపారు. అరెస్టు సమయంలో అజీజ్ నుంచి నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. అప్పట్లో ఇతడికి బెల్జియంలో తయారైన తుపాకీ ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. లక్నో నుంచి నగరానికి తీసుకొచ్చిన తర్వాత గిడ్డాఅజీజ్ను 2004 నాటి సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర కేసులో అరెస్టు ప్రకటించనున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఇతర అంశాలతో పాటు ‘బెల్జియం’ కోణాన్నీ విచారించాలని నిర్ణయించారు. 20 ఏళ్ల క్రితమే ‘పీజీపీ’ వినియోగం... ఎలాంటి ఉన్నత విద్య అభ్యసించని గిడ్డా అజీజ్ 20 ఏళ్ల క్రితమే సమాచార మార్పిడికి పెట్టీ గుడ్ ప్రైవరీ (పీజీపీ) విధానాన్ని వినియోగించాడు. బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బోస్నియా నుంచి బయటపడిని జోడ్డానియన్లు కొందరు లండన్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో నగరం నుంచి వీరితో సంప్రదింపులు జరిపేందుకు అజీజ్ పీజీపీ విధానాన్ని వాడాడు. పూర్తిస్థాయి ఎన్క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే ఈ విధానంలో హాట్‌మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని తాను కోరుకున్న వారు మాత్రమే చూసేలా డిజైన్ చేశారు. అజీజ్ 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. -
సిరియా ఉగ్రవాదులపై ఆసిస్ సమరశంఖం
సిరియా: ఆస్ట్రేలియా తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాలు సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై తొలిదాడి చేసింది. అయితే, నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, దాడి జరిపిన విషయాన్ని మాత్రం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. ఈ దాడుల ద్వారా దాయిష్ ఉగ్రవాదులు తరలిస్తున్న మందుగుండు సామాగ్రి వాహనాన్ని ఒక ప్రత్యేక క్షిఫణి ద్వారా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే తూర్పు సిరియా ప్రాతంపై ఈ దాడి జరిపనట్లు తెలిపారు. అయితే, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదే సమయంలో తమ యుద్ధ విమానాలు ఉగ్రవాదులు జరిపే ఎదురు దాడులకు ధ్వంసం కావని, ఎలాంటి అగ్ని ప్రమాదాన్ననైనా తట్టుకునేలా తమ జెట్ యుద్ధ విమానాలు ఉన్నట్లు చెప్పారు. ఉగ్రవాదులను అణిచివేసే చర్యలకోసం అంతకుముందు జరిగిన ఒప్పందంతోపాటు సిరియాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఉత్తర బాగ్దాద్‌లో ఇలాంటి దాడులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఐఎం ఖాతాలో రూ.200 కోట్లు
* ఆధారాలు సేకరించిన నిఘా వర్గాలు * ఈ పరిణామం మంచిది కాదంటున్న అధికారులు * అల్ కాయిదాతో పోటీ.. దందాలు, ఆయుధాల విక్రయం, బ్లాక్‌మెయిల్‌తో నిధుల సమీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై రెండుసార్లు పంజా విసిరి, 4 బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వద్ద ప్రస్తుతం రూ.200 కోట్ల నిధులు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దేశ వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్న ఈ ముష్కరులు అంతర్జాతీయ సంస్థ అల్‌కాయిదాను ఆదర్శంగా తీసుకుని నిధులు సమీకరింస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. 2012లో ఐఎం రూ.45 కోట్లు సమీకరించగా.. 2014 జూన్ నాటికి ఈ మొత్తం రూ.200 కోట్లకు పెరిగిందని చెప్పడానికి అవసరమైన ఆధారాలనూ కేంద్ర నిఘా వర్గాలు సేకరించాయి. దేశంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఉగ్రవాద సంస్థ వద్ద ఈ స్థాయిలో నిధులుండడం ఆందోళన కలిగించే అంశమని హెచ్చరిస్తున్నాయి. - కోల్‌కతాకు చెందిన అమీర్ రజా ఖాన్ స్థాపించిన ఐఎం ఒకప్పుడు కేవలం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా(ఎల్ఈటీ) నుంచి వచ్చే నిధులే ఆధారంగా పని చేసింది. - ఐఎం కార్యకలాపాలు.. భత్కల్ బ్రదర్స్‌గా పిలిచే రియాజ్, ఇక్బాల్ చేతుల్లోకి వెళ్లిన తరవాత సొంత నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. 2000లో కోల్‌కతాకు చెందిన రాయ్బర్మన్ను బెదిరించి రూ. 3.5 కోట్లు తీసుకున్న ఉగ్రవాదులు.. అప్పటి నుంచి ఇలాంటి పంథానే అనుసరిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. - దేశంలో దుశ్చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా కొంతకాలం నిధుల సమీకరణకు బ్రేక్ వేస్తున్న ఐఎం ముష్కరులు.. ఆపై ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ తన ఖజానాను నింపుకుంటున్నారు. - కొన్నేళ్ల క్రితం ఉత్తరాది రాష్ట్రాల్లో కిడ్నాప్‌లకూ పథక రచన చేసిన ఐఎం ఉగ్రవాదులు అవి అంత శ్రేయస్కరం కాదని భావించి వెనక్కు తగ్గినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే ఉద్దేశంతో ఈ దందానే కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. - గడిచిన కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబైల్లోని బడా హోటళ్ల యజమానుల్ని బెదిరించడం ద్వారానే ఏకంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించి ఫోన్లు చేస్తుండటంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధీనంలో ఉన్న ఈ కేసులూ కొలిక్కిరావట్లేదు. - దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు నిధుల సమీకరణకూ ఐఎం ఉగ్రవాదులు నకిలీ కరెన్సీని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాక్‌లో ముద్రితమై, బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి వస్తున్న ఈ కరెన్సీని మార్చడంద్వారా రూ.50 కోట్లకు పైగా ఆర్జించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. - బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్లోనూ అక్రమ ఆయుధాల విక్రయాలను చేపట్టిన ఐఎం.. ఈ వ్యాపారంలో రూ.40 కోట్ల వరకు సమీకరించినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో కొన్ని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడి మరో రూ.8 కోట్ల వరకు తమ ఖాతాల్లో వేసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. - ఆయా అంశాలను రాష్ట్ర పోలీసు విభాగాలకు చేరవేసిన నిఘా వర్గాలు.. ఇకపై చోటు చేసుకునే భారీ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించాయి. గతంలో చోటు చేసుకుని, ఇప్పటికీ కొలిక్కిరాని, ఎలాంటి ఆధారాలూ లేని కేసుల దర్యాప్తు వేగాన్ని పెంచాలని స్పష్టం చేశాయి.