28, 29న ఎమ్మెల్యే అనిల్ నిరశన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :
అభివృద్ధి నిధుల కేటాయింపులో నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయనికి నిరసనగా ఈ నెల 28, 29 తేదీలలో స్థానిక గాంధీబొమ్మసెంటర్‌లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజలు తెలియజేసినప్పటికీ వివక్షతచూపుతున్న ప్రభుత్వంపై నిరసన గళమెత్తనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.